తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Tourism Package: హైదరాబాద్ టు ఊటీ... టూర్ ప్యాకేజీ వివరాలివే

IRCTC Tourism Package: హైదరాబాద్ టు ఊటీ... టూర్ ప్యాకేజీ వివరాలివే

24 August 2022, 12:24 IST

google News
    • hyderabad - ooty tour package:హైదరాబాద్ నుంచి ఊటీ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. 
హైదరాబాద్ - ఊటీ టూర్ ప్యాకేజీ
హైదరాబాద్ - ఊటీ టూర్ ప్యాకేజీ (irctc tourism)

హైదరాబాద్ - ఊటీ టూర్ ప్యాకేజీ

irctc tourism hyd to ooty tour package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి ఊటీ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. Ultimate Ooty Ex Hyderabad పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. ఊటీతో పాటు Coonnoor కవర్ అవుతాయి. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.....

6 రోజులు… ఐదు రాత్రులు

ooty - hyderabad tour: ఈ నెల ఆగస్టు 30న ఈ టూర్ ప్రారంభం అవుతుంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. తొలిరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (శబరి ఎక్స్ ప్రెస్ - 17230) నుంచి రాత్రి 12.20 గంటలకు జర్నీ ప్రారంభం అవుతుంది. రెండోరోజు కోయంబత్తురు రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి 90 కి.మీల దూరంలో ఉండే ఊటీకి వెళ్తారు. మధ్యాహ్నం బోటానికల్ గార్జెన్, ఊటీ లేక్ ను సందర్శించారు. రాత్రి ఊటీలోనే బస చేస్తారు.

ఇక మూడోరోజు హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత దొడబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ ను చూస్తారు. ఈరోజు కూడా ఊటీలోనే ఉంటారు. నాల్గొ రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత కున్నూర్ లో పలు పర్యాటక ప్రాంతాలను చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఊటీకి తిరిగి వస్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఐదో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత మధ్యాహ్నం సమయానికి కోయంబత్తూరు చేరుకుంటారు. అక్కడ 04.35 గంటలకు రైలు ఎక్కితే... ఆరో రోజు అర్ధరాత్రి 12:20 గంటలకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ధరలివే....

సింగిల్ షేరింగ్ కు 25,970 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 14,950 ధరగా ప్రకటించారు. టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు.

<p>ధరల పట్టిక</p>

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం