Japan rice balls : చంకలో పెట్టి.. చెమటతో తయారు చేసిన ఈ ఫుడ్‌ని ఎగబడి తింటున్నారు!
04 May 2024, 12:10 IST
Sweat infused rice balls : జపాన్ నుంచి వస్తున్న ఓ వార్త.. ఇప్పుడు వైరల్‌గా మారింది. అక్కడి ట్రెడీషనల్ డిష్‌ని.. కొన్ని రెస్టారెంట్లు, చంకలో పెట్టి, చెమటతో తయారు చేయడం మొదలుపెట్టాయి.! అవి.. భారీ ధరకు అమ్ముడుపోతున్నాయి…
జపాన్ ట్రెడీషనల్ డిష్‌ని చంకలో పెట్టి, చెమటతో తయారు చేస్తున్నారు!
Sweat-infused rice balls in Japan : ప్రపంచంలో జరుగుతున్న వింత-విచిత్ర సంఘటనలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటున్నాయి. 'ఇలాంటిది కూడా ఉంటుందా? మనుషులు ఇలా కూడా ఉంటారా?' అని.. వాటిని చూస్తే డౌట్ వస్తుంది. ఇక ఇప్పుడు.. జపాన్‌కు చెందిన ఓ వార్తను విన్న వారందరు.. షాక్ అవుతున్నారు. అక్కడి ప్రముఖ, ట్రెడీషనల్ డిష్.. 'ఒనిగిరి' అనే రైస్ బాల్ని కొత్త విధానంలో తయారు చేయడం ఇందుకు కారణం! కొత్తగా తయారు చేస్తే ఏముంది? అని అనుకుంటున్నారా? ఆ ఒనిగిరిని.. చంకలో పెట్టి, చెమటతో తయారు చేస్తుండటం ఇక్కడ అసలు విషయం. అంతేకాదు.. ఎంత ధర పెట్టినా, అక్కడి ప్రజలు వీటిని ఎగబడి మరీ కొంటున్నారట!
చంకలో పెట్టి.. చెమటతో..!
ఒనిగిరి అనే రైస్ బాల్ డిష్.. జపాన్‌లో చాలా ఫేమస్. శతాబ్దాలుగా ఈ డిష్‌ని జపనీయులు వండుకుంటున్నారు. ఇవి.. ట్రైయాంగిల్ షేప్‌లో ఉంటాయి.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అనే మీడియా సంస్థ ప్రకారం.. ఒనిగిరిని తయారు చేసే మహిళలు.. డిష్‌కి ట్రైయాంగిల్ షేప్‌ని తీసుకురావడం కోసం.. వాటిని తమ చంకల్లో పెట్టుకుని ఒత్తుతున్నారు!
Japan rice balls : అయితే.. ఈ మహిళలు పూర్తి హైజీన్ ప్రొటోకాల్‌ని పాటిస్తారట. ఫుడ్‌కి కాంటాక్ట్‌లో వచ్చే శరీర భాగాలను డిసిన్ఫెక్ట్ చేసుకుంటారట. ఆ తర్వాత చెమట వచ్చేలా చేస్తారు. ఆ తర్వాత.. చేతులు వాడకుండా.. చంకలో పెట్టుకుని డిష్‌ని తయారు చేస్తారు!
ఒనిగిరి రైస్ బాల్స్‌ని తయారు చేసేందుకు.. జపాన్‌లోని చాలా రెస్ట్రారెంట్స్లో ఇదే ప్రాసెస్ నడుస్తోంది. అంతేకాదు.. చాలా రెస్టారెంట్లు.. ఈ ప్రాసెస్‌ని బహిరంగంగా కూడా ప్రదర్శిస్తున్నాయి. 'ఇదేదో యునీక్ టెక్నిక్‌లా ఉందే..' అనుకుంటూ ప్రజలు ఆ ప్రాసెస్‌ని ఎగబడి చూస్తున్నారు.
సాధారణ ఒనిగిరి ధర కన్నా.. ఇలా చంకలో పెట్టి, చెమటతో తయారు చేస్తున్న డిష్.. 10 రెట్లు అధిక ధర పలుకుతుండటం గమనార్హం.
మరి టేస్ట్ ఎలా ఉంది? అని ఓ కస్టమర్‌ని అడగ్గా.. "పెద్దగా తేడా లేదు. ఫ్లేవర్ కూడా మారలేదు. సాధారణ ఒనిగిరి టేస్టే ఇందులోనూ ఉంది," అని బదులిచ్చారు.
Japan Onigiri rice balls : ఇలా చంకలో పెట్టి, చెమటతో రైస్ బాల్స్‌ని తయారు చేయడం, వాటిని జపాన్‌వాసులు ఎగబడి తింటుండటం.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వార్త విన్న వారందరు షాక్‌కు గురవుతున్నారు. ఇంకొందరు మద్దతిస్తున్నారు.
"హైజీన్‌గా ఉన్నంత కాలం.. ఈ ప్రాసెస్‌తో ఎలాంటి హాని లేదు," అని ఒకరు రాసుకొచ్చారు.
Japan rice balls made with sweat : "ఇది అస్సలు ఆమోదయోగ్యం కాదు! దీనిని తయారు చేసే వారికి అనారోగ్య సమస్యలు ఉంటే? నేను ఈ తరహా రైస్ బాల్ని ప్రిఫర్ చేయను," అని మరొకరు పేర్కొన్నారు.
"ఇదేం పిచ్చి! ఇదేం పైత్యం" అని మరో నెటిజన్ స్పందించారు.
మరి.. ఈ 'యునీక్ టెక్నిక్'తో తయారవుతున్న ఒనిగిరి రైస్ బాల్స్‌పై మీ ఒపీనియన్ ఏంటి?