తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap 10th Valuation : నాకు మార్కులు వేయకపోతే చేతబడి చేయిస్తా, తెలుగు పేపర్ లో విద్యార్థి వింత సమాధానం!

AP 10th Valuation : నాకు మార్కులు వేయకపోతే చేతబడి చేయిస్తా, తెలుగు పేపర్ లో విద్యార్థి వింత సమాధానం!

10 April 2024, 19:22 IST

    • AP 10th Valuation : పరీక్షల్లో సినిమా పాటలు రాసిన విద్యార్థులను చూశాం, కానీ ఈ విద్యార్థి అంతకు మించి. తనకు మార్కులు వేయకపోతే ఏకంగా చేతబడి చేయిస్తానని రాశాడు. ఈ సమాధానం చూసి పేపర్ దిద్దిన టీచర్ అవక్కైయ్యాడు.
తెలుగు పేపర్ లో విద్యార్థి వింత సమాధానం
తెలుగు పేపర్ లో విద్యార్థి వింత సమాధానం

తెలుగు పేపర్ లో విద్యార్థి వింత సమాధానం

AP 10th Valuation : పరీక్షల్లో మార్కులు(Exams) సాధించాలంటే బాగా చదవాలనే మనకు తెలుసు. కానీ ఇలా చేస్తే కూడా మార్కులు వస్తాయని భావించాడో విద్యార్థి. మార్చి నెలలో ఏపీ పదో తరగతి(AP SSC Exams) పరీక్షలు జరిగాయి. పదో తరగతి జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తున్నారు. ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థి తనకు మార్కులు వేయకపోతే... మా తాత చేత చేతబడి చేయిస్తానని సమాధానం రాశారు.

ట్రెండింగ్ వార్తలు

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

నాకు మార్కులు వేయకపోతే చేతబడి చేయిస్తా

పదో తరగతి(AP 10th Exam) జవాబు పత్రాలను బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో మూల్యాంకనం చేస్తు్న్నారు. తెలుగు పేపర్ (Telugu Paper)లో రామాయణం(Ramayana) ప్రాశస్త్యం గురించి వివరించండి అనే ప్రశ్నకు ఓ విద్యార్థి... అందుకు సమాధానం రాయకుండా... 'నాకు మార్కులు వేయకపోతే మా తాత చేత చేతబడి చేయిస్తా' అని రాశాడు. ఈ సమాధానం చూసి అవాక్కైన ఉపాధ్యాయుడు జవాబు పత్రాన్ని పై అధికారులకు చూపించారు. అయితే ఆ విద్యార్థికి తెలుగులో వందకు 70 మార్కులు రావడం గమనార్హం. మరో విద్యార్థి రామాయణంలో పాత్ర స్వభావం గురించి రాయమంటే 'మంధర శివాజీ మహారాజును తీసుకుని దండకారణ్యానికి వెళ్లింది' అని రాశాడు. ఇలాంటి వింత సమాధానాలు చూసి ఉపాధ్యాయులు విస్తుపోతున్నారు.

ముగిసిన పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్

ఏపీ పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం(AP SSC Exam Papers Spot Valuation ముగిసింది. మొత్తం ఎనిమిది రోజుల పాటు నిర్వహించగా…. ఏప్రిల్ 8వ తేదీతో స్పాట్ పూర్తి అయినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల కేంద్రాల్లో ఈ స్పాట్ ప్రక్రియ కొనసాగింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేశారు అధికారులు. దాదాపు 25 వేల మందికి పైగా సిబ్బంది ఈ స్పాట్ లో పాల్గొంది. అయితే ఫలితాల ప్రకటనలో కీలకమైన స్పాట్ పూర్తి కావటంతో… ఇక ఫలితాల(AP SSC Results 2024) విడుదల కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. మార్కుల ఎంట్రీతో పాటు సాంకేతిక సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టనున్నారు. అన్ని దశలు పూర్తి కాగానే… ఫలితాల విడుదలకు సంబంధించి ఓ తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

ఏపీ పదో తరగతి ఫలితాలు ఎప్పుడు?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కోడ్ అమల్లోకి వచ్చింది. అయితే ఈసారి ముందుగానే ఫలితాలను(AP SSC Results 2024) విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. స్పాట్ పూర్తి కావటంతో…. వీలైనంత త్వరగా రిజల్ట్స్ ను ప్రకటించాలని యోచిస్తోంది. గత ఏడాది(2023)లో చూస్తే…మే 6వ తేదీన ఫలితాలు విడుదలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం… అప్పుడు ఏప్రిల్ 18వ తేదీతో పరీక్షలు పూర్తి అయ్యాయి. కానీ ఈసారి మాత్రం…. మార్చి 30వ తేదీతో ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. గతేడాదితో పోల్చితే…. దాదాపు 18 రోజుల తేడా ఉంది. ఫలితంగా ఈసారి ముందుగానే ఏపీ పదో తరగతి ఫలితాలు(AP SSC Results) విడుదలయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ నాలుగో వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇది కుదరకపోతే…. మే ఫస్ట్ వీక్ లో ఫలితాలను ప్రకటించనున్నారు. అయితే ఫలితాల విడుదలకు సంబంధించి ఈసీ అనుమతి కూడా తీసుకునుంది ఏపీ విద్యాశాఖ.

తదుపరి వ్యాసం