AP SSC Results: పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభం, మేలో మొదటి వారంలో రిజల్ట్స్ విడుదల
AP SSC Results: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల ఫలితాలను ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది.
సోమవారం నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు వాల్యూయేషన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల కేంద్రాలకు జవాబు పత్రాలను తరలించారు.26 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వాల్యూయేషన్ సెంటర్లలో జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా 25వేల మంది ఉపాధ్యాయులను వినియోగిస్తున్నారు. మూల్యాంకన కేంద్రాల్లో ఉపాధ్యాయులకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పలు కేంద్రాలను మార్చారు.
ఈ ఏడాది ఏపీలో పదో తరగతి పరీక్షలకు 6.23లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో మూల్యంకనం చేపట్టినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు గత బుధవారంతో ముగిశాయి.
AP SSC పబ్లిక్ పరీక్షలు 2024 మార్చి 18 నుంచి ప్రారంభం అయ్యాయి. తొలిరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 3473 కేంద్రాలలో 6,54,553 మంది నమోదవ్వగా 6,30,633 (96.35% )మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3743 పరీక్షా కేంద్రాలలో సాఫీగా మరియు ప్రశాంతంగా నిర్వహించినట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాడి రెగ్యులర్ అభ్యర్థులు 6,23,092 మంది పది పరీక్షలకు పేర్లు నమోదు చేసుకోగా...వీరిలో బాలుర సంఖ్య 3,17,939, బాలికలు 3,05,153 మంది ఉన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు ఎస్.ఎస్.సి పరీక్షలు నిర్వహించారు.ఈ పరీక్షలు ఉదయం 09:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు అంటే 3 గంటల 15 నిమిషాల పాటు నిర్వహించనున్నారు. విద్యార్థులను 08:45 AM నుంచి 09:30 AM వరకు పరీక్షా కేంద్రాలలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు. హాల్ టిక్కెట్లు మార్చి 4 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు.
పేపర్ లీకేజీ అరికట్టేందుకు కాన్ఫిడెన్షియల్ కోడెట్ పేపర్లు
మాల్‌ప్రాక్టీస్, పేపర్ లీకేజీల(Paper Leakage)ను నిరోధించడానికి అన్ని పరీక్షలకు అభ్యర్థులకు ప్రత్యేకమైన కాన్ఫిడెన్షియల్ కోడెడ్ ప్రశ్న పత్రాలు అందించామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఒక వేళ పేపర్ లీకేజీకి ఎవరైనా ప్రయత్నిస్తే ఆ పేపర్ ఏ పరీక్షా కేంద్రం నుంచి, ఏ అభ్యర్థి నుంచి వచ్చిందో తెలుసుకొనే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. దీని ద్వారా అవకతవకలకు పాల్పడిన వారిని సులభంగా గుర్తించేలా పరీక్షల్ని నిర్వహించారు.
అన్ని పరీక్షా కేంద్రాలు "నో ఫోన్ జోన్లు"(No Phone Zone)గా ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, ఇతర నాన్ టీచింగ్, ఇతర డిపార్ట్‌మెంటల్ సిబ్బంది అంటే ఏఎన్‌ఎంలు, చీఫ్ సూపరింటెండెంట్‌లతో సహా పోలీసు సిబ్బంది పరీక్షా(AP SSC Exams) కేంద్రాలకు మొబైల్ ఫోన్‌లను తీసుకురాకూడదని ఆదేశాలు ఇచ్చామన్నారు. ఒక వేళ ఎవరైనా ఫోన్ లు తీసుకువస్తే వాటిని పరీక్షా కేంద్రం ప్రధాన గేట్ వద్ద పోలీస్ ఔట్ పోస్ట్ లో ఇవ్వాలన్నారు. ఈ సూచనను పాటించకుండా ఫోన్ లు పరీక్షా కేంద్రంలోనికి తీసుకువెళ్లిన వారు శిక్షార్హులు అన్నారు.