AP SSC Results 2024 : ఏప్రిల్ 1 నుంచి స్పాట్ వాల్యూయేషన్..! ఏపీ పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..?
AP SSC Results 2024 Updates: ఏపీలో పదో తరగతి పరీక్షలు(AP SSC Exams 2024) కొనసాగుతున్నాయి. మార్చి 30వ తేదీతో ముగియనున్నాయి. అయితే స్పాట్ వాల్యూయేషన్ కు సంబంధించి ఏర్పాట్లు సిద్ధం చేశారు.
AP SSC Results 2024 Updates : ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు(AP SSC Exams 2024) కొనసాగుతున్నాయి. మార్చి 18వ తేదీన మొదలైన ఈ ఎగ్జామ్స్… ఈనెల 30వ తేదీతో పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో…. జవాబు పత్రాల మూల్యాంకానికి సంబంధించి ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది విద్యాశాఖ. ఎనిమిది రోజుల్లోనే పూర్తిస్థాయిలో స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియను పూర్తి చేసే దిశగా కార్యాచరణను రూపొందించింది.
ఏప్రిల్ 1 నుంచి స్పాట్ వాల్యూయేషన్...!
AP SSC Exam Papers Valuation 2024: ఏపీలో మార్చి 30వ తేదీతో పరీక్షలు పూర్తి కానున్నాయి. దీంతో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియను(AP SSC Exam Papers Valuation 2024) ప్రారంభించనుంది పరీక్షల విభాగం. ఈ వాల్యూయేషన్ ప్రక్రియను ఏప్రిల్ 8వ తేదీలోపు పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల కేంద్రాల్లో ఈ మూల్యాంకన ప్రక్రియ జరగనుంది. సిబ్బంది కొరత లేకుండా పరీక్షల విభాగం చర్యలు చేపట్టింది. ఇందులో కూడా సీనియర్ ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. స్పాట్ కు సంబంధించి సమాచారం అందుకున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా విధులకు హాజరుకావాల్సి ఉంటుందని విద్యాశాఖ కూడా స్పష్టం చేసింది.
AP 10th Results 2024: ఈసారి ఫలితాలు ఎప్పుడంటే..?
గత ఏడాదితో పోల్చితే…ఈసారి ఏపీ పదో తరగతి ఫలితాలు(AP 10th Results 2024) ముందుగానే రానున్నాయి. గత షెడ్యూల్ చూస్తే… ఏప్రిల్ 3 నుంచి పరీక్షలు ప్రారంభమై…. 18వ తేదీ వరకు కొనసాగాయి. మే6వ తేదీన ఫలితాలు వచ్చాయి. కానీ ఈసారి చూస్తే…. మార్చి 18వ తేదీనే ఎగ్జామ్స్ ప్రారంభమైన… మార్చి 30వ తేదీతోనే ముగియనున్నాయి. దీంతో ఈసారి పదో తరగతి ఫలితాలు తొందరగానే రానున్నాయి. అన్ని కుదిరితే… ఏప్రిల్ మూడో వారంలోనే ఫలితాలను రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది కుదరకపోతే చివరి వారంలో దాదాపుగా ప్రకటించే ఛాన్స్ ఉంది.
ఈసారి పదో తరగతి పరీక్షల కోసం 3,473 కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి పరీక్షల కోసం రెగ్యులర్ అభ్యర్థులు 6,23,092 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులోబాలుర సంఖ్య 3,17,939గా ఉంటే బాలికల సంఖ్య 3,05,153గా ఉంది.
How to Check AP SSC Results 2024 : ఏపీ టెన్త్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు…
- పరీక్ష రాసిన విద్యార్థులు ఎస్ఎస్ సీ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://www.bse.ap.gov.in/ లోకి వెళ్లాలి.
- హోమ్ పేజీలో కనిపించే AP SSC ఫలితాలు 2024 లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ నంబర్ ని నమోదు చేయాలియ
- సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే... మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి మార్క్స్ మెమో కాపీని పొందవచ్చు.
ఇక ఈసారి విద్యార్థులు డైరెక్ట్‌గా హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్‌సైట్ లో కూడా ఫలితాలను చెక్ చేసుకునే వీలు ఉంటుంది. పరీక్ష రాసిన అభ్యర్థులు https://telugu.hindustantimes.com/telangana/results లోకి వెళ్లి చెక్ చేసుకునే వీలు ఉంటుంది.