SSC results 2023 telangana live: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్స్ ఇవే
- SSC results 2023 telangana: తెలంగాణ ఎస్సెస్సీ బోర్డు 10వ తరగతి రిజల్ట్స్ బుధవారం విడుదల అయ్యాయి. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను ప్రకటించారు. https://telugu.hindustantimes.com/telangana/results లింక్‌లో లభ్యమవుతాయి.
Wed, 10 May 202311:44 AM IST
రీకౌంటింగ్ ఫీజు రూ. 500
ఇక ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జూన్ 14 నుంచి 22వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. వీరందరూ మే 26లోపు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది . ఈ పరీక్షలు జూన్ 22 వరకు కొనసాగుతాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఇక రీకౌంటింగ్‌కు కూడా అవకాశం కల్పించారు. ఇందుకోసం రూ. 500ల చొప్పున చెల్లించి మార్కులు మళ్లీ లెక్కించుకోవచ్చు. ఫలితాలు విడుదలైన 15 రోజుల్లోనే ఎస్‌బీఐ బ్యాంకులో చలాన్లు చెల్లించాలి. దీన్ని బోర్డులో సమర్పిస్తే రీ కౌంటింగ్‌కు అవకాశం ఇవ్వనున్నారు.
Wed, 10 May 202310:34 AM IST
సప్లిమెంటరీ డేట్స్
ఫెయిలయిన విద్యార్థులకు అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలను (Telangana Tenth Advanced Supplementary Exams) వచ్చే నెలలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. విద్యార్థుల విద్యాసంవత్సరం వృథా కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. 14-06-2023 నుంచి 22-06-2023 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ పరీక్షలను ఆయా తేదీల్లో ఉదయం. 09-30 గంటల నుంచి మధ్యాహ్నం 12-30 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు.
Wed, 10 May 202310:33 AM IST
హెచ్ టీ తెలుగు లింక్ ఇదే…
https://telugu.hindustantimes.com/telangana/results
ఈ లింక్ క్లిక్ చేసి, మీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి ఫలితాలు, గ్రేడ్లు చూడొచ్చు. ఇక ఈ ఏడాది జరిగిన పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 4,86,194 మంది దరఖాస్తు చేసుకోగా... వీరిలో 4,84,384 మంది హాజరయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 443 మంది దరఖాస్తు చేసుకోగా, 191 మంది మాత్రమే హాజరయ్యారు. ఇక ఈసారి ఆరు పేపర్లే కావడంతో వాల్యుయేషన్ ప్రక్రియను త్వరగా పూర్తిచేశారు. గతంలో ఫలితాల అనంతరం ఘటనల దృష్ట్యా ఈసారి అధికారులు పలుమార్లు ట్రయల్ రన్ నిర్వహించారు. అన్ని విధాలుగా పరీశిలించిన తర్వాతే ఫలితాలను విడుదల చేస్తున్నారు.
Wed, 10 May 202308:25 AM IST
పదో తరగతి ఫలితాల్లోనూ మెరిసిన గురుకుల విద్యార్థులు
పది ఫలితాల్లోనూ మెరిసిన ‘గురుకుల’ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడంతో రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ గురుకుల విద్యాలయాలు దేశానికే రోల్ మోడల్ అని అన్నారు. టీఎస్ రెసిడెన్షియల్స్ స్కూల్స్ 98.25 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలిచాయి.
టీఎస్ రెసిడెన్షియల్స్–98.25 శాతం
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సిల్స్ – 95.24 శాతం
బీసీ వెల్ఫేర్–95.03 శాతం
మైనార్టీ రెసిడెన్షియల్స్–94.66 శాతం
ట్రైబల్ వెల్ఫేర్–92.93 శాతం
మోడల్ స్కూల్స్–91.3 శాతం
ప్రయివేటు స్కూల్స్ – 90.9 శాతం
కేజీబీవీ స్కూల్స్ – 83.86 శాతం
ఎయిడెడ్ స్కూల్స్ – 83.85 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు.
Wed, 10 May 202306:42 AM IST
ssc results 2023 telangana: సీడీ విడుదల చేసిన మంత్రి
పదో తరగతి ఫలితాల సీడీని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. కాసేపట్లో ఫలితాల పాస్ వర్డ్ ప్రకటిస్తారు. ఆ తరువాత కాసేపటికి వెబ్‌సైట్లో పరీక్ష ఫలితాలు లభ్యమవుతాయి. రిజల్ట్స్ కోసం ఈ డైరెక్ట్ లింక్ క్లిక్ చేయండి. https://telugu.hindustantimes.com/telangana/results
Wed, 10 May 202306:27 AM IST
ssc results 2023 telangana: 4.84 లక్షల మంది హాజరు
ssc results 2023 telangana: ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ ఏడాది జరిగిన పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 4,86,194 మంది దరఖాస్తు చేసుకోగా... వీరిలో 4,84,384 మంది హాజరయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 443 మంది దరఖాస్తు చేసుకోగా, 191 మంది మాత్రమే హాజరయ్యారు.
Wed, 10 May 202306:00 AM IST
కాసేపట్లో మంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్
మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఈ సమయంలో పదో తరగతి పరీక్షల ఫలితాల సీడీ విడుదల చేస్తారు. జిల్లాల వారీగా ఉత్తీర్ణతాశాతం వెల్లడిస్తారు.
Wed, 10 May 202305:07 AM IST
రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ ఎస్సెస్సీ పరీక్షల ఫలితాలను ఈ కింది డైరెక్ట్ లింక్స్ ద్వారా తెలుసుకోండి. https://telugu.hindustantimes.com/telangana/results బోర్డు అధికార వెబ్‌సైట్ లింక్స్ https://results.bsetelangana.org/ అలాగే https://results.bse.telangana.gov.in/ లలో తెలుసుకోవచ్చు.
Wed, 10 May 202303:21 AM IST
ssc results 2023 telangana: హెచ్‌టీ తెలుగులో ఎస్ఎస్‌సీ ఫలితాలు
తెలంగాణ ఎస్ఎస్‌సీ రిజల్ట్స్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఫలితాలు విడుదల కాగానే మీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. సబ్జెక్టు వారీగా గ్రేడ్లు లభ్యమవుతాయి. డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. https://telugu.hindustantimes.com/telangana/results
Wed, 10 May 202302:26 AM IST
మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్న సబితా
రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు.
Wed, 10 May 202302:07 AM IST
నేడు తెలంగాణ ఎస్సెస్సీ ఫలితాలు విడుదల
తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఫలితాలను www.httelugu.com ద్వారా తెలుసుకోవచ్చు.
Tue, 09 May 202301:01 PM IST
తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి(SSC Results 2023)
1. పదో తరగతి విద్యార్థులు ముందు ఎస్ఎస్సీ బోర్డు అధికారిక వెబ్ సైట్ bse.telangana.gov.in ఓపెన్ చేయాలి.
2. హోం పేజీలో TS SSC Results 2023 లింక్ పై క్లిక్ చేయండి
3. విద్యార్థుల తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీను ఎంటర్ చేయండి
4. విద్యార్థి వివరాలు నమోదు చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి
5. స్క్రీన్ పై విద్యార్థి 10వ తరగతి ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. TS SSC Results 2023 Marks మెమో PDF డౌన్‌లోడ్ చేసుకోండి.
6. అనంతరం ఆ పీడీఎఫ్‌ను భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోండి.
Tue, 09 May 202310:43 AM IST
రేపే పది ఫలితాలు, వెరిఫికేషన్ చేసి మరీ!
తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు అధికారులు ముహూర్తం ఖరారు చేశారు. మే10న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది 4.94 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఏప్రిల్ 03 నుంచి 11వ తేదీ మధ్య పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది ఆరు పేపర్లే కావడంతో వాల్యుయేషన్ ప్రక్రియను త్వరగా పూర్తిచేశారు. గతంలో ఫలితాల అనంతరం ఘటనల దృష్ట్యా ఈసారి అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. రెండు, మూడుసార్లు వెరిఫికేషన్ చేసి మరీ టెక్నికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసినట్లు సమాచారం.
Tue, 09 May 202310:36 AM IST
SSC Results Telangana: 4.94 లక్షల మంది విద్యార్థుల హాజరు
ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
Tue, 09 May 202310:29 AM IST
ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి సబితా ఇంద్రా రెడ్డి
తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నారు
Tue, 09 May 202310:28 AM IST
SSC Results 2023: రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఎస్సెస్సీ ఫలితాలు
Telangana SSC Results: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలను బుధవారం వెల్లడించనున్నారు. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు.