AP TS SSC Exams 2024: నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు…ఒక్క నిమిషం నిబంధన రద్దు
AP TS SSC Exams 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం ఇప్పటికే ఎస్సెస్సీ బోర్డులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. విమర్శల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో నిమిషం నిబంధన రద్ద చేశారు.

AP TS SSC Exams 2024: ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh, తెలంగాణ telangana రాష్ట్రాల్లో నేటి నుంచి పదో SSC తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ Board బోర్డులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3473 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.
AP TS SSC Exams 2024 : ఏపీలో పదో తరగతి పరీక్షల (AP SSC Exams) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు ఎస్.ఎస్.సి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఏపీలో పరీక్షలు ఉదయం 09:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు అంటే 3 గంటల 15 నిమిషాల పాటు నిర్వహించనున్నారు. విద్యార్థులను 08:45 AM నుంచి 09:30 AM వరకు పరీక్షా కేంద్రాలలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు. హాల్ టిక్కెట్లు మార్చి 4 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు.
విద్యార్థులు స్వయంగా హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా సంబంధిత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడి నుంచి పొందవచ్చని సురేష్ కుమార్ తెలిపారు. అభ్యర్థులందరూ తమ పరీక్షా కేంద్రాన్ని ముందుగానే చూసుకొని, సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు.
ఏపీలో మొత్తం 6,23,092 రెగ్యులర్ విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో బాలురు 3,17,939, బాలికలు 3,05,153మంది ఉన్నారు. ఓరియంటల్ ఎస్సెస్సీ విద్యార్ధులు 1562మంది ఉన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు 1,02,528మంది హాజరావుతున్నారు.
తెలంగాణలో…
తెలంగాణలో Telangana కూడా సోమవా రం నుంచి పదో తరగతి TS SSC Exams 2024 పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఏప్రిల్ 2 వరకూ జరిగే పరీక్షలకు రాష్ట్రంలో 5,08,385 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి.
ఈనెల 26, 27 తేదీల్లో జరిగాల్సిన ఫిజిక్స్, బయాలజీ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతాయి. నిర్ణీత పరీక్ష సమయానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ఇప్పటికే డీఈవోలకు, సీఎస్‌లకు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు. గత ఏడాది తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణలో తెలుగు ప్రశ్నాపత్రం లీక్ కావడం కలకలం రేపింది. వరంగల్‌లో జరిగిన ఘటన నేపథ్యంలో.. పరీక్ష కేంద్రాల సిబ్బందితో పాటు, తనిఖీలకు వచ్చే అధికారులు, స్క్వాడ్స్, భద్రతా సిబ్బంది సైతం ఫోన్లను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకెళ్లకుండా ఆంక్షలు విధించారు.
ఏపీలో పేపర్ లీక్ లేకుండా కోడ్‌లతో ప్రశ్నాపత్రాలు…
పేపర్ లీకేజీ అరికట్టేందుకు కాన్ఫిడెన్షియల్ కోడ్‌లతో కూడిన పేపర్లను వినియోగిస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. మాల్‌ప్రాక్టీస్, పేపర్ లీకేజీల(Paper Leakage)ను నిరోధించడానికి అన్ని పరీక్షలకు అభ్యర్థులకు ప్రత్యేకమైన కాన్ఫిడెన్షియల్ కోడెడ్ ప్రశ్న పత్రాలు అందించామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
పేపర్ లీకేజీకి ఎవరైనా ప్రయత్నిస్తే ఆ పేపర్ ఏ పరీక్షా కేంద్రం నుంచి, ఏ అభ్యర్థి నుంచి వచ్చిందో తెలుసుకొనే విధంగా ఏర్పాట్లు చేశారు. అవకతవకలకు పాల్పడిన వారిని సులభంగా గుర్తించేలా పకడ్బందీ చర్యలు చేపట్టారు. అన్ని పరీక్షా కేంద్రాలు "నో ఫోన్ జోన్లు"(No Phone Zone)గా ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.
పరీక్ష విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, ఇతర నాన్ టీచింగ్, ఇతర డిపార్ట్‌మెంటల్ సిబ్బంది అంటే ఏఎన్‌ఎంలు, చీఫ్ సూపరింటెండెంట్‌లతో సహా పోలీసు సిబ్బంది పరీక్షా(AP SSC Exams) కేంద్రాలకు మొబైల్ ఫోన్‌లను తీసుకురాకూడదని ఆదేశాలు ఇచ్చారు.
ఫోన్ లు తీసుకువస్తే వాటిని పరీక్షా కేంద్రం ప్రధాన గేట్ వద్ద పోలీస్ ఔట్ పోస్ట్ లో ఇవ్వాల్సిందేనని ఈ సూచనను పాటించకుండా ఫోన్ లు పరీక్షా కేంద్రంలోనికి తీసుకువెళ్లిన వారు శిక్షార్హులు కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
పరీక్షా కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 144ను అమలు చేయనున్నారు. పరీక్షా కేంద్రాల దగ్గర శాంతిభద్రతలను పరిశీలించడానికి “మొబైల్ పోలీసు స్క్వాడ్‌లు” జిల్లా పోలీసులతో మొహరిస్తారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ఏపీఎస్ ఆర్టీసీలో(APSRTC) ఉచిత ప్రయాణ సదుపాయం ఉంటుంది.
మార్చి 31 నుంచి స్పాట్ వాల్యుయేషన్
జవాబు పత్రాల మూల్యాంకనం కోసం స్పాట్ వాల్యుయేషన్(Spot Valution Camps) క్యాంప్‌లను ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 8 వరకు మొత్తం 26 జిల్లాల ప్రధాన కార్యాలయాలలోని నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఫిర్యాదులు, దుష్ప్రవర్తన లేదా విచారణల గురించి కంట్రోల్ రూమ్‌ను “0866-2974540” నంబర్‌లో లేదా “dir_govexams@yahoo.com”లో సంప్రదించవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.
సంబంధిత కథనం