Parenting Tips : పరీక్షల తర్వాత పిల్లలను బిజీగా ఉంచడానికి కొన్ని ఆలోచనలు-parenting tips best suggestions to keep children busy after exams ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Parenting Tips : పరీక్షల తర్వాత పిల్లలను బిజీగా ఉంచడానికి కొన్ని ఆలోచనలు

Parenting Tips : పరీక్షల తర్వాత పిల్లలను బిజీగా ఉంచడానికి కొన్ని ఆలోచనలు

Anand Sai HT Telugu
Mar 23, 2024 03:30 PM IST

Parenting Tips : పరీక్షల కాలం నడుస్తోంది. ఆ తర్వాత వేసవి సెలవుల్లో పిల్లలను కొన్ని విషయాల్లో బిజీగా ఉంచాలి. లేదంటే చెప్పిన మాట వినరు.

పిల్లలకు నేర్పించాల్సిన విషయాలు
పిల్లలకు నేర్పించాల్సిన విషయాలు (Unsplash)

మార్చి, ఏప్రిల్‌లో పిల్లలందరికీ పరీక్షలు ముగుస్తాయి. ఇక వేసవి సెలవుల్లో కొందరు పిల్లలు అమ్మమ్మల ఇంటికి వెళ్తారు. కొందరు పిల్లలు తమ తల్లిదండ్రుల వద్దే ఉంటారు. కానీ పిల్లలు రోజంతా ఇంట్లోనే ఉంటే బద్ధకంగా మారే అవకాశం ఉంది. ఇలా అయితే మొబైల్, టీవీకి ఎప్పుడూ బానిసలే. సాయంత్రంపూట బయట కాసేపు ఆడుకోనివ్వాలి. అంతేకాదు. వారు కొత్తగా ఏదైనా నేర్చుకునేందుకు అవకాశాన్ని క్రియేట్ చేయాలి. అప్పుడే వారు సరిగా ముందుకు వెళ్లగలరు.

ఈ వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు కొత్త విషయాలు నేర్పాలి. తద్వారా ఆ రోజులను సద్వినియోగం చేసుకోగలరు. చాలా విషయాలు నేర్చుకుంటారు. పరీక్షల తర్వాత పిల్లలను ఎలా బిజీగా ఉంచాలో తెలుసుకుందాం.

వారి ఇంట్రస్ట్‌లు చూడండి

ప్రతి బిడ్డకు వారి స్వంత ఆసక్తి ఉంటుంది. కొంతమంది పిల్లలు బొమ్మలు గీయడానికి ఇష్టపడతారు. మరికొందరికి డ్యాన్స్ అంటే ఇష్టం.. కాబట్టి, మీ పిల్లలను వారి ఆసక్తికి అనుగుణంగా ప్రోత్సహించండి. వారికి దేనిపై ఎక్కువగా ఇంట్రస్ట్ ఉందో తెలుసుకుని దాని ప్రకారం ప్రోత్సహించాలి. అప్పుడే వారు జీవితంలో ఏదైనా ఇష్టంగా నేర్చుకుంటారు.

తెలియని ప్రతిభ గుర్తించండి

పిల్లల్లో తల్లిదండ్రులకు తెలియని ప్రతిభ ఉంటుంది. కానీ చాలా మంది దానిని గుర్తించరు. ఈ సెలవు సీజన్‌లో మీ పిల్లలకు కొత్త నైపుణ్యాన్ని నేర్పండి. దీని కోసం మీరు వారిని ప్రత్యేక తరగతిలో కూడా జాయిన్ చేయవచ్చు. మీ పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారో పరిశీలించండి. ఎందుకంటే తమకు నచ్చిన పనిపై పిల్లలు ఉంటారు. దీంతో వారి ఇంట్రస్ట్ గుర్తించవచ్చు.

ఆడుకోనివ్వండి

సాధారణంగా పిల్లలు స్కూల్‌కి వెళ్లేటప్పుడు, ట్యూషన్, ఇంట్లో ఇలాగే ఉంటారు. ఈ సమయంలో పిల్లలు బయట ఆడుకోవడం చాలా అరుదు. సెలవుదినాల్లో మీ పిల్లలను బయటకు తీసుకెళ్లండి. ప్రకృతితో సమయం గడపండి. ఇవి మీ పిల్లలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

పిల్లలతో మాట్లాడండి

పిల్లలు పాఠశాలకు, ట్యూషన్‌కు వెళతారు, వారు వారి తల్లిదండ్రులతో సరిగ్గా మాట్లాడలేరు. దీంతో పిల్లల ఇష్టాయిష్టాలు, కోరికలు, ఆశలు, లక్ష్యాలు తల్లిదండ్రులకు తెలియవు. ఈ సెలవుల్లో మీ పిల్లలతో మాట్లాడండి. వారి ఇష్టాలు, అయిష్టాలు తెలుసుకోండి. పిల్లలతో ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత సంతోషంగా ఉంటారు. వారు తమ మనసులో ఏముందో ఓపెన్‌గా చెబుతారు.

తర్వాతి తరగతుల గురించి చెప్పండి

పిల్లలు సాధారణంగా సెలవుల తర్వాత మరొక తరగతికి వెళతారు. ఈ సెలవుల్లో తదుపరి తరగతి గురించి వారికి బోధించండి. దీని కోసం యూట్యూబ్ లేదా గూగుల్‌లో సెర్చ్ చేస్తే సబ్జెక్ట్‌లలో కొన్ని టాపిక్స్ కనిపిస్తాయి. దీనివల్ల తదుపరి పాఠాన్ని అర్థం చేసుకోవడంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. అలా చేస్తే తర్వాత తరగతిలో అందరికంటే ముందు మీ పిల్లలు ఉంటారు. దీంతో వారి మీద వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

వేసవిలో పిల్లలకు వీలైనంత ఎక్కువగా నేర్చుకునేందుకు అవకాశం కల్పించాలి. అప్పుడే వారు మీతో సరిగా ఉంటారు. కొత్త విషయాలపై అవగాహన వచ్చేలా చేయాలి.