TS SSC Results 2024 : ఏప్రిల్ 3 నుంచి 'టెన్త్ స్పాట్ వాల్యూయేషన్‌' - ఈసారి ముందుగానే ఫలితాలు, ఎప్పుడు రావొచ్చంటే..?-telangana ssc results 2024 are likely to be released in the last week of april or 1st week of may ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Ssc Results 2024 : ఏప్రిల్ 3 నుంచి 'టెన్త్ స్పాట్ వాల్యూయేషన్‌' - ఈసారి ముందుగానే ఫలితాలు, ఎప్పుడు రావొచ్చంటే..?

TS SSC Results 2024 : ఏప్రిల్ 3 నుంచి 'టెన్త్ స్పాట్ వాల్యూయేషన్‌' - ఈసారి ముందుగానే ఫలితాలు, ఎప్పుడు రావొచ్చంటే..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 27, 2024 12:48 PM IST

Telangana SSC Results 2024 : తెలంగాణ పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 2వ తేదీతో ఈ ఎగ్జామ్స్ పూర్తి కానున్నాయి. అయితే ఈసారి ఫలితాలు(Telangana SSC Results 2024) తొందరగానే విడదలయ్యే అవకాశం ఉంది.

పదో తరగతి ఫలితాలు
పదో తరగతి ఫలితాలు

TS SSC Results 2024 Updates: తెలంగాణ పదో తరగతి పరీక్షా(TS SSC Results 2024) పత్రాల వాల్యూయేషన్ కు రంగం సిద్ధం చేసింది ప్రభుత్వం. మార్చి 18వ తేదీన మొదలైన ఈ పరీక్షలు…. ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం(TS SSC Exam Papers Valuation 2024) చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు అధికారులు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి వాల్యూయేషన్ ప్రక్రియ మొదలుకానుంది. మొత్తం తొమ్మిది రోజుల్లో వాల్యూయేషన్ ప్రక్రియను పూర్తి చేసేలా పరీక్షాల విభాగం కార్యాచరణను సిద్ధం చేసింది. ఏప్రిల్ 11వ తేదీ నాటికి పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనం పూర్తి కానుంది. 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో ఈ వ్యాల్యూయేషన్ చేయనున్నారు.

Telangana 10th Results 2024: ఈసారి ముందుగానే ఫలితాలు!

గత ఏడాదితో పోల్చితే ఈసారి పరీక్షలు తొందరగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అంతేకాకుండా…. ఫలితాలు(Telangana 10th Results) కూడా ముందుగానే రానున్నాయి. గతేడాది ఏప్రిల్ 3 నుంచి పరీక్షలు ప్రారంభం కాగా… ఏప్రిల్ 13వ తేదీ వరకు జరగాయి. ఫలితాలను మే 10వ తేదీన ప్రకటించారు. అయితే ఈసారి పరీక్షలు మార్చి 18వ తేదీనే మొదలయ్యాయి. ఏప్రిల్ 2వ తేదీతో అన్ని ఎగ్జామ్స్ పూర్తి కానున్నాయి. గతేడాది షెడ్యూల్ తో పోల్చితే… ఫలితాల ప్రకటనకు 27 రోజుల సమయం పట్టింది. ఈసారి కూడా 25 నుంచి 30 రోజుల వ్యవధిలోనే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే….. ఏప్రిల్ చివరి వారంలోనే పదో తరగతి ఫలితాలు(Telangana 10th Results 2024) విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది కుదరకపోతే…. మే ఫస్ట్ వీక్ లో దాదాపుగా ప్రకటించే ఛాన్స్ ఉంటుంది.

ఈ ఏడాది జరగుతున్న పరీక్షల కోసం 5.08 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజులను చెల్లించారు. ఇందులో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఈ ఎగ్జామ్స్ కోసం మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే, పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.

How to Check TS SSC Results : టెన్త్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు…

  • పరీక్ష రాసిన విద్యార్థులు తెలంగాణ SSC బోర్డు అధికారిక వెబ్ సైట్ https://results.bsetelangana.org/ లోకి వెళ్లాలి. లేదా https://bse.telangana.gov.in/ సైట్‌కు వెళ్లొచ్చు.
  • హోం పేజీలో కనిపించే TS SSC Results 2024 లింక్ పై క్లిక్ చేయాలి.
  • హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీను నమోదు చేయాలి. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
  • మీ పరీక్షా ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి మార్కుల మెమోను పొందవచ్చు.

HT తెలుగులో టెన్త్ ఫలితాలు

ఇక గతేడాది మాదిరిగానే ఈసారి కూడా  విద్యార్థులు డైరెక్ట్‌గా హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్‌సైట్ లో కూడా ఫలితాలను చెక్ చేసుకునే వీలు ఉంటుంది.

  • పరీక్ష రాసిన అభ్యర్థులు  https://telugu.hindustantimes.com/telangana/results  లోకి వెళ్లాలి.
  • మీ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే.. మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
  • ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.

 

 

Whats_app_banner