Minor Girl Issue: భద్రాద్రి జిల్లాలో గర్భం దాల్చిన పదో తరగతి బాలిక, సహ విద్యార్ధి కారణం, కేసు నమోదు
Minor Girl Issue: భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో పదో తరగతి బాలిక గర్భం దాల్చింది. తోటి విద్యార్ధి బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో కేసు నమోదు చేశారు.
Minor Girl Issue: భద్రాద్రి జిల్లాలో దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడితో గర్భం దాల్చింది. విషయం బయట పడటంతో 2 లక్షలకు పెద్ద మనుషులు పంచాయతీ కుదిర్చారు. విషయం అధికారులకు తెలియడంతో కేసు నమోదు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం Bhadradri Kothagudem జిల్లాలోని సుజాతనగర్ SujataNagar మండలంలో ఓ మైనర్ బాలిక Minor Girl గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుజాతనగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక గర్భం దాల్చడం మండలంలో చర్చకు దారితీసింది.
ఈనెల 18వ తేదీన పదవ తరగతి పరీక్ష రాయడానికి వచ్చిన ఆ బాలిక వాంతులు కావడంతో కళ్ళు తిరిగి కింద పడిపోయింది. పాఠశాల యజమాన్యం ఇన్విజిలేటర్ల సహాయంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఆ తర్వాత బాలికను స్థానిక ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి పంపించారు. అంతకు ముందు ఈ నెల 15వ తేదీన తీవ్ర కడుపు నొప్పి రావడంతో ప్రాథమిక హాస్పటల్ కి వెళ్ళగా ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం వైద్యశాలకు వెళ్లాలని వైద్యులు సూచించారు.
అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు బాలికను గట్టిగా మందలించగా అసలు విషయం బయటప డింది. తనతో పాటు చదువుకుంటున్న అదే గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి వల్ల తనకు గర్భం Pregnancy వచ్చిందని అసలు విషయం బయటకు తెలిపింది.
ఆగ్రహించిన బాలిక కుటుంబ సభ్యులు బాలుడి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. విషయం బయటకు పొక్కకుండా నాయకులగూడెం గ్రామానికి చెందిన కొంతమంది పెద్ద మనుషులు బాలిక తల్లిదండ్రులకు నచ్చజెప్పి రెండు లక్షల రూపాయలకు పంచాయతీ చేసినట్లు సుజాతనగర్ మండలంలో చర్చ జరుగుతుంది.
ఇద్దరూ మైనర్ బాల బాలికలే కావడంతో పాఠశాల దశలోనే ఇలాంటి ఘటన జరిగిన నేపథ్యం నిర్ఘాంత పరుస్తోంది. ఆ నోటా ఈ నోటా విషయం బయటకు తెలిసి అధికారుల దాకా వచ్చింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ఆ మైనర్ బాలికకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
విషయం తెలుసుకున్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ సలోమి, ఐసిడిఎస్ సూపర్వెజర్ రమాదేవి, డిసిపిఓ హరి కుమారి, సోషల్ వర్కర్ భారతి తమ సిబ్బందితో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ కు వచ్చి బాధితుల తల్లిదండ్రులకు, మైనర్ విద్యార్థినికి కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చుంచుపల్లి సిఐ రాయల వెంకటేశ్వర్లు ఎస్సె ఎస్కే జుబేదా. బేగం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.