AP SSC Results 2024 Updates: ముగిసిన 'స్పాట్ వాల్యూయేషన్' - ఆలోపే ఏపీ పదో తరగతి ఫలితాల వెల్లడి..!
Andhrapradesh SSC Results 2024: ఏపీలో పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ ముగిసింది. మొత్తం ఎనిమిది రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. త్వరలోనే ఫలితాలను ప్రకటించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
AP SSC Results 2024 Updates : ఏపీ పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం(AP SSC Exam Papers Spot Valuation ముగిసింది. మొత్తం ఎనిమిది రోజుల పాటు నిర్వహించగా…. ఏప్రిల్ 8వ తేదీతో స్పాట్ పూర్తి అయినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల కేంద్రాల్లో ఈ స్పాట్ ప్రక్రియ కొనసాగింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేశారు అధికారులు. దాదాపు 25 వేల మందికి పైగా సిబ్బంది ఈ స్పాట్ లో పాల్గొంది. అయితే ఫలితాల ప్రకటనలో కీలకమైన స్పాట్ పూర్తి కావటంతో… ఇక ఫలితాల(AP SSC Results 2024) విడుదల కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. మార్కుల ఎంట్రీతో పాటు సాంకేతిక సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టనున్నారు. అన్ని దశలు పూర్తి కాగానే… ఫలితాల విడుదలకు సంబంధించి ఓ తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
AP SSC Results 2024 Date - ఫలితాలు ఎప్పుడు..?
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కోడ్ అమల్లోకి వచ్చింది. అయితే ఈసారి ముందుగానే ఫలితాలను(AP SSC Results 2024) విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. స్పాట్ పూర్తి కావటంతో…. వీలైనంత త్వరగా రిజల్ట్స్ ను ప్రకటించాలని యోచిస్తోంది. గత ఏడాది(2023)లో చూస్తే…మే 6వ తేదీన ఫలితాలు విడుదలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం… అప్పుడు ఏప్రిల్ 18వ తేదీతో పరీక్షలు పూర్తి అయ్యాయి. కానీ ఈసారి మాత్రం…. మార్చి 30వ తేదీతో ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. గతేడాదితో పోల్చితే…. దాదాపు 18 రోజుల తేడా ఉంది. ఫలితంగా ఈసారి ముందుగానే ఏపీ పదో తరగతి ఫలితాలు(AP SSC Results) విడుదలయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ నాలుగో వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇది కుదరకపోతే…. మే ఫస్ట్ వీక్ లో ఫలితాలను ప్రకటించనున్నారు. అయితే ఫలితాల విడుదలకు సంబంధించి ఈసీ అనుమతి కూడా తీసుకునుంది ఏపీ విద్యాశాఖ.
How to Check AP SSC Results 2024 : ఏపీ టెన్త్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు…
- పరీక్ష రాసిన విద్యార్థులు ఎస్ఎస్ సీ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://www.bse.ap.gov.in/ లోకి వెళ్లాలి.
- హోమ్ పేజీలో కనిపించే AP SSC ఫలితాలు 2024 లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ నంబర్ ని నమోదు చేయాలియ
- సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే... మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి మార్క్స్ మెమో కాపీని పొందవచ్చు.
ఇక ఈసారి విద్యార్థులు డైరెక్ట్‌గా హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్‌సైట్ లో కూడా ఫలితాలను చెక్ చేసుకునే వీలు ఉంటుంది. పరీక్ష రాసిన అభ్యర్థులు https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-result లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఈసారి ఏపీలో పదో తరగతి పరీక్షల కోసం 3,473 కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రెగ్యులర్ అభ్యర్థులు 6,23,092 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులోబాలుర సంఖ్య 3,17,939గా ఉంటే బాలికల సంఖ్య 3,05,153గా ఉంది.