TDP Candidates List : టీడీపీ తుది జాబితా విడుదల - 4 ఎంపీ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు, లిస్ట్ ఇదే-tdp announced candidates for 4 lok sabha and 9 assembly seats for ap elections 2024 ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Tdp Announced Candidates For 4 Lok Sabha And 9 Assembly Seats For Ap Elections 2024

TDP Candidates List : టీడీపీ తుది జాబితా విడుదల - 4 ఎంపీ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు, లిస్ట్ ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 29, 2024 02:24 PM IST

TDP MLA Candidates List 2024 : పెండింగ్ లో ఉన్న 4 లోక్‍సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్తులను ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. ఈ మేరకు ఇవాళ ప్రకటన విడుదల చేసింది.

తెలుగుదేశం పార్టీ
తెలుగుదేశం పార్టీ (Photo From TDP Facebbok)

TDP MLA Candidates List 2024 : 4 లోక్‍సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ను(TDP MLA Candidates) ఖరారు చేసింది తెలుగుదేశం పార్టీ. విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా అప్పలనాయుడు, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్లను ఖరారు చేసింది. ఇక అనంతపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మినారాయణ, కడప టీడీపీ ఎంపీ అభ్యర్థిగా చదిపిరాళ్ల భూపేష్ రెడ్డికి అవకాశం దక్కింది. ఫలితంగా పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు అయింది.

ట్రెండింగ్ వార్తలు

TDP MP Candidates 2024 : ఎంపీ అభ్యర్థులు:

  1. విజయనగరం - అప్పలనాయుడు,
  2. ఒంగోలు - మాగుంట శ్రీనివాసులరెడ్డి
  3. అనంతపురం - అంబికా లక్ష్మినారాయణ
  4. కడప - చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి.

తాజాగా విడుదలైన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో మాజీ మంత్రి గంటాకు చోటు దక్కింది. భీమిలి నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఇక చీపురుపల్లి నియోజకవర్గం నుంచి సీనియర్ నేత కళా వెంకట్రావుకు అవకాశం దక్కింది. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి జయరామ్ కు గుంతకల్లు సీటు ఖరారైంది.

TDP MLA Candidates List - ఎమ్మెల్యే అభ్యర్థులు:

  1. చీపురుపల్లి - కళా వెంకట్రావు
  2. బీమిలి - గంటా శ్రీనివాసరావు
  3. పాడేరు - వెంకట రమేష్ నాయుడు
  4. దర్శి - గొట్టిపాటి లక్ష్మి
  5. రాజంపేట - సుగవాసి సుబ్రహ్మణ్యం
  6. ఆలూరు - వీరభద్ర గౌడ్
  7. గుంతకల్లు - గుమ్మనూరు జయరామ్
  8. అనంతపురం అర్బన్ - దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్
  9. కదిరి - కందికుంట వెంకటప్రసాద

తుది జాబితాలో కూడా మాజీ మంత్రి దేవినేని ఉమాకు టికెట్ దక్కలేదు. ఆయన ఆశించిన మైలవరంతో పాటు మరో చోట కూడా టికెట్ ఖరారు కాలేదు. దీంతో ఆయన అధినాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఆయనకు విజయవాడ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలను అప్పగించారు చంద్రబాబు. ఇక గంటా శ్రీనివాస్ మాత్రం… ఎట్టకేలకు భీమిలినే ఖరారు అయింది. మొదట్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సూచించినా.. ఆయన సుముఖతను వ్యక్తం చేయలేదు. దీంతో మరోసారి భీమిలి నుంచే గంటా బరిలో ఉండనున్నారు. ఇక అనంతపురం నుంచి ప్రభాకర్ చౌదరికి కాకుండా… దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ కు అవకాశం ఇచ్చింది టీడీపీ.

WhatsApp channel