CBN In Kadiri: రాయలసీమకు జగన్ చేసిన మేలేమి లేదన్న చంద్రబాబు, చెల్లెలి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్
CBN In Kadiri: టీడీపీ హయంలో రాయలసీమకు కియా ఫ్యాక్టరీ, హంద్రీనీవా నీళ్లు వస్తే వైసీపీ పాలనలో హింస మాత్రమే వచ్చిందని కదిరి ప్రజాగళంలో చంద్రబాబు ఆరోపించారు. సీమకు జగన్ చేసిన మేలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
CBN In Kadiri: రాష్ట్రం బాగుపడాలంటే జగన్ దిగిపోవాలని, జీవితంలో ఎన్నో ఎన్నికలు చూశానని, ఈసారి ప్రజల్లో నెలకొన్న ఉత్సాహం 1994 ఎన్నికల మాదిరిగా ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబు Chandrababuచెప్పారు. నాడు ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయి తెలుగుదేశం విజయకేతనం ఎగురవేసిందని జగన్ రెడ్డి నమ్మిన వారిని నట్టేట ముంచే మోసగాడన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా Kadiri కదిరిలో నిర్వహించిన ప్రజాగళం Prajagalam సభలో వైసీపీ YCP పాలనపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. వివేకాను ఎవరు, ఎందుకు, ఎలా చంపారో ఆనాటి ఆక్రందనలు విన్న కదిరి ప్రజలే సాక్ష్యమన్నారు. చిన్నాన అంటే తండ్రితో సమానమని, బంధాలు, బంధుత్వాలు అంటే జగన్‌కు అర్ధం తెలుసా అని ప్రశ్నించారు.
2019 ఎన్నికల ముందు జగన్ Ys jaganఎన్నో మాయ మాటలు చెప్పాడని, రాయలసీమలో మొత్తం 52 సీట్లు ఉంటే వైసీపీని 49 సీట్లలో ఇక్కడి ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. ముద్దులు పెట్టాడు, బుగ్గలు నిమిరాడు కానీ, జగన్ రెడ్డి రాయలసీమ Rayalaseema ప్రజల కోసం చేసింది సున్నా అన్నారు.
జగన్ ఐదేళ్లలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టును పూర్తిచేయ లేదని. ఒక్క ఎకరాకు నీళ్లవ్వ లేదని, ఒక్క పరిశ్రమ తేలేదని, ఒక ఉద్యోగం ఇవ్వలేదని రాయలసీమలో 102 ప్రాజెక్టులను రద్దు చేశాడని ఆరోపించారు. రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టుల కోసం టీడీపీ ప్రభుత్వం రూ. 12వేలకోట్లు ఖర్చుపెట్టిందని, వైసీపీ కేవలం రూ. 2 వేలు కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. హంద్రీనీవా కోసం తెలుగుదేశం ప్రభుత్వం రూ.4.200 కోట్లు ఖర్చు చేసిందని ఎవరు రాయలసీమ అభివృద్ధి కోసం పని చేశారో ఎవరు రాయలసీమకు ద్రోహం చేశారో నిర్ణయించాల్సింది విజ్ఞులైన సీమ ప్రజలే అన్నారు.
కియా పరిశ్రమతో సీమ రూపురేఖలు మార్చాం
తెలుగుదేశం ప్రభుత్వం కియా పరిశ్రమను రప్పించడం ద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిందని చంద్రబాబు చెప్పారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నవైసీపీ అడ్డుపడినా అనంతకు పరిశ్రమ రావాలని స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న పార్ధసారధితో చెప్పానని, కియా కార్ల కంపెనీ పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో పని చేశామన్నారు.
ఇక్కడ తయారైన 12 లక్షల కియా కార్లు ప్రపంచం మొత్తం తిరుగుతున్నాయి. కియాను తేవడం మన బ్రాండు అయితే.. వాటిని తరిమికొట్టడం జగన్ బ్రాండుగా మారిందన్నారు. తాను కదిరికి నీళ్లు తెస్తే..జగన్ రాజకీయ హింస తీసుకొచ్చాడన్నారు.
మైనారిటీల విషయంలో కూటమిపై వైసీపీ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. ఇది రంజాన్ మాసం. దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్. ఖురాన్ పేదలకు సహాయం చేయమని చెబుతోంది. ఆ సిద్దాంతాన్నే తెలుగుదేశం నమ్ముతోంది. ఎన్డీఏలో వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 13 జిల్లాలలో ఉర్ధూను రెండవ భాషగా చేశామన్నారు.
సునీత ప్రశ్నలకు జవాబు ఏదన్న బాబు…
వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము జగన్‌కు ఉందా అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రశ్నించారు. చైతన్య వంతులైన రాష్ట్రప్రజలు హత్యారాజకీయాలను క్షమించరని, పరదాల మాటున బస్సు యాత్రలు చేస్తే ప్రజల సమస్యలు తెలుస్తాయా అని ఎద్దేవా చేశారు.
సొంత చిన్నాన చనిపోతే ఆ చావు వెనక ఉన్న కుట్రలను ఇప్పటివరకు నిర్ధారించ లేదని న్యాయం కోసం పోరాడుతున్న చిన్నాన కుమార్తె పైనే నిందలు వేయడం న్యాయమా? మీ చెల్లి కోర్టు చుట్టూ తిరుగుతుంటే అన్నగా బాధ్యత లేదా అని ప్రశ్నించారు.
చిన్నాన చనిపోయి ఐదేళ్లవుతున్నా మీ ప్రభుత్వం ఏం చేసింది? అధికారంలో ఉన్న మీరు చేయాల్సిన పని సరిగా చేయకపోవడం వల్లే ఆమెకు న్యాయం చేయాలని మాట్లాడాల్సి వస్తోందన్నారు.
వివేకాను హత్య చేసిన వారికి ముఖ్యమంత్రి రక్షణ కల్పిస్తున్నారని, వివేక హత్య వెనుక అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారని ప్రధాన నిందితుడు చెబుతున్నారని . గతంలో మీరు సిబిఐ విచారణ కోరారు... ఇప్పుడు వద్దంటున్నారని చిన్నానను చంపిన నిందితుడికి ఓటు వేయమని అడగడం తప్పు కదన్నా అని చెల్లెలు మిమ్మల్ని అడుగుతోందన్నారు.
చైతన్యవంతమైన రాష్ట్రప్రజలు ఆయన హత్యా రాజకీయాలను క్షమించరని ..వాటిపై పోరాడేందుకు సిద్దం కావాలన్నారు. అన్యాయానికి గురైన ఆడబిడ్డకు అండగా నిలబడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
చిన్నానను చంపేశారంటూ నంగనాచిలా మాట్లాడుతూ జగన్ కొత్త డ్రామా మొదలెట్టాడని, బాబాయిని చంపింది ఎవరో రాష్ట్రప్రజలందరికీ తెలుసని జగన్ రెడ్డి మాత్రం బాబాయిని చంపింది దేవుడికే తెలుసంటున్నాడని ఆరోపించారు. ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్దకువెళ్లి , చిన్నానను చంపిన వాడిని ప్రక్కన పెట్టుకుని తండ్రి సాక్షిగా జగన్ రెడ్డి అబద్దాలు ఆడాడని ఆరోపించారు.
సంబంధిత కథనం