TDP CBN: ఏపీలో ఎన్నికలకు 46 రోజుల గడువే ఉందని రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ప్రజలదేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు Chandra babuఅన్నారు. వైసీపీ YCP పని అయిపోయిందని, ఏపీలో ఆ పార్టీ ప్రభుత్వం ఉండేది ఇంకా 46 రోజులే అన్నారు. రాప్తాడు Raptaduలో జరిగిన ఎన్నికల Ap assembly elections 2024 ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమని, రాష్ట్ర భవిష్యత్ కోసం మూడు పార్టీలు కలిశాయని, ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసం ప్రజలు తమ కూటమికి మద్దతివ్వాలని బాబు Chandrababu విజ్ఞప్తి చేశారు.
ప్రజా ప్రభుత్వం కోసం ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. అక్రమ కేసులు, బెదిరింపులకు ఎవరూ భయపడ వద్దని సూచించారు. ప్రభుత్వం నుంచి జగన్ ను ఇంటికి పంపడమే అందరి లక్ష్యం కావాలన్నారు.
విధ్వంసంతో రాష్ట్రాన్ని జగన్ లూటీ చేశారని, విద్యుత్ ఛార్జీలను అమాంతం పెంచేశారని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, అన్నింటి ధరలను పెంచుకుంటూ పోయారని, అసమర్థుడు, అవినీతిపరుడిని ఇంటికి పంపాలన్నారు.
రాష్ట్రంలో మద్యం ధరలు కూడా విపరీతంగా పెంచేశారని, నాసిరకం మద్యంతో అనారోగ్యం పాలయ్యే పరిస్థితి ఉందన్నారు. నాసిరకం మద్యం తాగి కొంతమంది చనిపోయారన్నారు.
ఏపీలో ఆఖరికి ఇసుకపైనా దోపిడీ చేశారని, భవన నిర్మాణ కార్మికులను నాశనం చేశారన్నారు. ఇసుక దొరక్క భవన నిర్మాణ రంగం కుదేలైందన్నారు. రాప్తాడులో ఇసుక దొరకదని కానీ అదే ఇసుక ఇసుక బెంగళూరులో దొరుకుతుందన్నారు. ఇక్కడి నుంచి అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు.
జగన్ నిరుద్యోగులను నిలువునా ముంచేశారని, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.68 వేల కోట్లు ఖర్చు పెట్టామని, రాయలసీమకు రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు.
జగన్ ఐదేళ్లలో రూ.2 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని, రాయలసీమ ద్రోహి జగన్ అని ఆరోపించారు. రాయలసీమకు జగన్ రాజకీయ హింస తెచ్చారని, వైసీపీ ప్రభుత్వంలో సైకో రాజ్యంగా మార్చేశారని, వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో ముంచేసిందన్నారు. గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత కూడా తీసుకుంటామన్నారు.
సంబంధిత కథనం