AP TS Congress Coordinators : సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధం- ఏపీ, తెలంగాణలో కోఆర్డినేటర్లు నియామకం
AP TS Congress Coordinators : ఏపీ, తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. మంత్రులు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించింది.
AP TS Congress Coordinators : సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం సన్నద్ధమవుతోంది. దేశంలోని 28 రాష్ట్రాల్లోని పార్లమెంట్ స్థానాలకు ఏఐసీసీ సమన్వయ కర్తలను నియమించింది. ఏపీలోని 25 , తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మహబూబ్‌నగర్, చేవెళ్ల నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్ సభ స్థానాల బాధ్యతను అప్పగించింది. టీపీసీసీ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా సీఎం రేవంత్‌రెడ్డిని ఏఐసీసీ నియమించింది.
తెలంగాణలో కాంగ్రెస్ సమన్వయకర్తలు
- ఆదిలాబాద్(ST) - మంత్రి సీతక్క
- పెద్దపల్లి(SC) - మంత్రి శ్రీధర్‌బాబు
- కరీంనగర్ - మంత్రి పొన్నం ప్రభాకర్
- నిజామాబాద్ -టి. జీవన్ రెడ్డి
- జహీరాబాద్ - పి.సుదర్శన్ రెడ్డి
- మెదక్ - మంత్రి దామోదర రాజనర్సింహ
- మల్కాజ్‌గిరి - మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- ఖమ్మం, మహబూబాబాద్ - మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
- వరంగల్- మంత్రి కొండా సురేఖ
- నల్గొండ - మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- భువనగిరి - మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
- నాగర్‌కర్నూల్ - మంత్రి జూపల్లి కృష్ణారావు
ఏపీ పార్లమెంట్ కో ఆర్డినేటర్లు
ఏపీలో పార్టీ పూర్వవైభవానికి ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్...సాధ్యమైనన్ని లోక్ సభ సీట్లు గెలుచుకోవాలని భావిస్తుంది. రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాలకు ఏఐసీసీ సమన్వయ కర్తలను నియమించింది. సీనియర్ నేతలు, మాజీ మంత్రులకు పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించింది.
ఏపీ లోక్ సభ స్థానాలకు కో-ఆర్డినేటర్లు
- అరకు(ఎస్టీ)- జగతా శ్రీనివాస్
- శ్రీకాకుళం - మీసాల సుబ్బన్న
- విజయనగరం - బొడ్డేపల్లి సత్యవతి
- విశాఖ - కొత్తూరి శ్రీనివాస్
- అనకాపల్లి - సనపాల అన్నాజీరావు
- కాకినాడ - కేబీఆర్. నాయుడు
- అమలాపురం (ఎస్సీ)- ఎం.వెంకట శివ ప్రసాద్
- రాజమండ్రి- ముషిని రామకృష్ణ
- నర్సాపురం- జెట్టి గురునాథరావు
- ఏలూరు - కె. బాపిరాజు
- మచిలీపట్నం - కొరివి వినయ్ కుమార్
- విజయవాడ - డి.మురళీ మోహన్ రావు
- గుంటూరు - గంగిశెట్టి ఉమాశంకర్
- నరసరావుపేట - వి.గురునాథం
- బాపట్ల(ఎస్సీ)- శ్రీపతి ప్రకాశం
- ఒంగోలు - యు.వెంకటరావు యాదవ్
- నంద్యాల - బండి జకారియా
- కర్నూలు - పి.ఎం. కమలమ్మ
- అనంతపురం - ఎన్. శ్రీహరి ప్రసాద్
- హిందూపూర్ - షేక్ సత్తార్
- కడప - ఎం. సుధాకర్ బాబు
- నెల్లూరు - ఎం.రాజేశ్వరరావు
- తిరుపతి (ఎస్సీ) - షేక్ నాజర్ అహమ్మద్
- రాజంపేట - ఎన్. తులసి రెడ్డి
- చిత్తూరు(ఎస్సీ)- డి. రాంభూపాల్ రెడ్డి