TS Entrance Exams 2024 : మారిన ‘ఎంసెట్’ పేరు, మే 9 నుంచి ఎగ్జామ్స్ - ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలివే-telangana state council of higher education has finalized the dates for the entrance exams 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Entrance Exams 2024 : మారిన ‘ఎంసెట్’ పేరు, మే 9 నుంచి ఎగ్జామ్స్ - ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలివే

TS Entrance Exams 2024 : మారిన ‘ఎంసెట్’ పేరు, మే 9 నుంచి ఎగ్జామ్స్ - ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 25, 2024 06:08 PM IST

Telangana Entrance Exams 2024 : ఈ ఏడాదికి సంబంధించిన ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది. ఎంసెట్ పేరును EAPCETగా మార్చింది.

తెలంగాణ ప్రవేశ పరీక్షలు
తెలంగాణ ప్రవేశ పరీక్షలు

Telangana State Council of Higher Education News: ఈ ఏడాదికి సంబంధించిన ప్రవేశ పరీక్షలు తేదీలు వచ్చేశాయ్. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటన చేసింది. ఎంసెట్ పేరును EAPCETగా కూడా మార్చింది. మే 9 నుంచి 13 వరకు ఈ పరీక్షలు(EAPCET) జరగనున్నాయి. మే 6వ తేదీన టీఎస్ఈసెట్ ప్రవేశ పరీక్ష ఉండనుండగా… జూన్ 4,5 తేదీల్లో ఐసెట్ ఎగ్జామ్ ఉంటుంది. మే 23వ తేదీన ఎడ్ సెట్, జూన్ 3వ తేదీ లాసెట్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.

ముఖ్య తేదీలివే:

-EAPCET(ఎంసెట్ ) - మే 9 నుంచి 13 వరకు.

-మే 6వ తేదీన ఈసెట్‌.

-జూన్‌ 4,5 తేదీల్లో ఐసెట్‌.

-మే 23వ తేదీన ఎడ్‌సెట్‌.

-జూన్‌ 3వ తేదీన తెలంగాణ లాసెట్‌, పీజీ లాసెట్‌.

తెలంగాణ పీజీఈసెట్ 6 జూన్, 2024 - 8, జూన్, 2024.

టీఎస్ పీఈసెట్ - 10.06.2024 - 13.06.2024.

ఈసెట్ ప్రవేశ పరీక్షను ఉస్మానియా వర్శిటీ, ఎంసెట్ పరీక్షలను జేఎన్టీయూ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది. ఎడ్ సెట్ ఎగ్జామ్ ను మహాత్మ గాంధీ వర్శిటీ, లాసెట్ - ఉస్మానియా వర్శిటీ, ఐసెట్ - కాకతీయ వర్శిటీ, పీజీఈసెట్ - జేఎన్టీయూ, టీఎస్ పీఈసెట్ ప్రవేశ పరీక్షను శాతవాహన వర్శిటీ నిర్వహించనుంది.

గతంలో ఎంసెట్ ప్రవేశ పరీక్ష ద్వారానే మెడికల్, ఇంజినీరింగ్ సీట్లను భర్తీ చేసేవారు. కానీ 2017 తర్వాత పరిస్థితి మారింది. ఎంసెట్‌ నుంచి మెడికల్‌ సీట్ల భర్తీని తొలగించి.... కేవలం ఇంజినీరింగ్ సీట్లను మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఎంబీబీఎస్‌, ఇతర వైద్యకోర్సులను జాతీయ ప్రవేశ పరీక్ష నీట్ ద్వారానే భర్తీ చేస్తున్నారు. ఇదిలా ఉన్నప్పటికీ ఎంసెట్ పేరులో 'ఎం' అక్షరం అలాగే ఉండింది. అయితే ఇప్పుడు ఈ అక్షరాన్ని తొలగించాలనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ఎం అక్షరాన్ని తొలగించాలని ఉన్నత విద్యా మండలి కూడా ప్రతిపాదనలు పంపటంతో.... ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందుకు తగ్గట్టుగానే ఉన్నత విద్యా మండలి కొత్త పేరుతో ప్రకటన జారీ చేసింది.

మరోవైపు ఏపీలో ప్రస్తుతతం ఏపీ ఈఏపీ సెట్‌ అనే పేరుతో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు ఇటీవలే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.

IPL_Entry_Point