TS EAMCET Exam 2024 Updates : ఆ నెలలోనే తెలంగాణ ఎంసెట్ పరీక్షలు - తాజా అప్డేట్ ఇదే-telangana eamcet exam 2024 is likely to be conducted in may 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Eamcet Exam 2024 Updates : ఆ నెలలోనే తెలంగాణ ఎంసెట్ పరీక్షలు - తాజా అప్డేట్ ఇదే

TS EAMCET Exam 2024 Updates : ఆ నెలలోనే తెలంగాణ ఎంసెట్ పరీక్షలు - తాజా అప్డేట్ ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 15, 2024 03:46 PM IST

Telangana EAMCET 2024 Updates: తెలంగాణ ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ప్రాథమికంగా షెడ్యూల్ నూ రూపొందించినట్లు తెలుస్తోంది. మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

తెలంగాణ ఎంసెట్ 2024
తెలంగాణ ఎంసెట్ 2024 (TSHCE)

Telangana EAMCET 2024 Updates: ఈ ఏడాది నిర్వహించే ఎంసెట్ ప్రవేశ పరీక్షపై కసరత్తు చేస్తోంది తెలంగాణ ఉన్నత విద్యా మండలి. ఇప్పటికే పరీక్ష షెడ్యూల్ పై ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇంటర్, జేఈఈ వంటి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని… ఎంసెట్ షెడ్యూల్ ను నిర్ణయిస్తుంటారు అధికారులు. అయితే తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ కూడా వచ్చేసింది. మార్చి 19వ తేదీతో ఈ ఎగ్జామ్స్ పూర్తి కానున్నాయి. ఇక ఏప్రిల్ మాసంలో జేఈఈ పరీక్షలు ఉండనున్నాయి.

ఏప్రిల్ వరకు ఇంటర్, జేఈఈ పరీక్షలు పూర్తి కానున్న నేపథ్యంలో మే నెలలో ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. త్వరలోనే అధికారికంగా షెడ్యూల్ ను ప్రకటించనుంది తెలంగాణ ఉన్నత విద్యా మండలి. ఇక ఇదే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ప్రవేశాల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలను సిద్ధం చేసే పనిలో ఉంది ఉన్నత విద్యా మండలి. ఎంసెట్ ఎగ్జామ్ కు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం ఉంది.

పేరు మార్పుపై కసరత్తు….

ఎంసెట్ పేరు మార్పు విషయంపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఓవైపు ప్రవేశ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యా మండలి ప్రాథమికంగా షెడ్యూల్ ను సిద్ధం చేసింది. త్వరలోనే అధికారింకగా షెడ్యూల్ ను ప్రకటించనుంది. అయితే ఈసారి ఎంసెట్ పేరును మార్చాలని చూస్తోంది ప్రభుత్వం. ఇదే విషయంపై ఉన్నత విద్యామండలి నుంచి కూడా ప్రతిపాదనలు సర్కార్ కు అందినట్లు తెలుస్తోంది. మెడికల్, ఇంజినీరింగ్ సీట్లను వేర్వురుగా భర్తీ చేస్తున్న నేపథ్యంలో.... పేరు మార్చే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంది ప్రభుత్వం. దీనిపై రేపోమాపో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

గతంలో ఎంసెట్ ప్రవేశ పరీక్ష ద్వారానే మెడికల్, ఇంజినీరింగ్ సీట్లను భర్తీ చేసేవారు. కానీ 2017 తర్వాత పరిస్థితి మారింది. ఎంసెట్‌ నుంచి మెడికల్‌ సీట్ల భర్తీని తొలగించి.... కేవలం ఇంజినీరింగ్ సీట్లను మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఎంబీబీఎస్‌, ఇతర వైద్యకోర్సులను జాతీయ ప్రవేశ పరీక్ష నీట్ ద్వారానే భర్తీ చేస్తున్నారు. ఇదిలా ఉన్నప్పటికీ ఎంసెట్ పేరులో 'ఎం' అక్షరం అలాగే ఉండింది. అయితే ఇప్పుడు ఈ అక్షరాన్ని తొలగించాలనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ఎం అక్షరాన్ని తొలగించాలని ఉన్నత విద్యా మండలి కూడా ప్రతిపాదనలు పంపటంతో....పేరు మారటం ఖాయంగానే కనిపిస్తోంది. అక్షరాన్ని తీసివేయం ద్వారా త్వరలోనే కొత్త పేరును ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఎంసెట్ ద్వారా ఇంజినీరింగ్ తో పాటు ఫార్మసీ సీట్లను భర్తీ చేస్తున్నారు. అయితే పీ అనే అక్షరం మాత్రం లేదు. ఒకవేళ ఎం అనే అక్షరాన్ని సర్కార్ తీసివేస్తే... పీ అనే అక్షరాన్ని చేర్చవచ్చని సమాచారం.

మరోవైపు ఏపీలో ప్రస్తుతతం ఏపీ ఈఏపీ సెట్‌ అనే పేరుతో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు ఇటీవలే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. గతంలో జారీచేసిన ఎంసెట్‌ జీవోను సవరించి, కొత్త జీవోను జారీ చేయాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. ఎంసెట్‌ పేరు మార్పు జీవో త్వరలోనే ఖరారయ్యే అవకాశాలున్నట్టుగా అధికార వర్గాలు తెలిపాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం