తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rise In Corona Cases: ఐదు నెలల తరువాత ఒకే రోజులో 2 వేల కొరోనా కేసులు

Rise in Corona cases: ఐదు నెలల తరువాత ఒకే రోజులో 2 వేల కొరోనా కేసులు

HT Telugu Desk HT Telugu

29 March 2023, 21:44 IST

  • Rise in Corona cases: భారత్ లో కొరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఐదు నెలల తరువాత తొలిసారి మంగళవారం ఒక్క రోజులో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య రెండు వేలు దాటింది. ఇప్పటికే కేంద్రం ఈ విషయమై రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rise in Corona cases: భారత్ లో మంగళవారం, మార్చి 28 న 24 గంటల వ్యవధిలో కొత్తగా మొత్తం 2,151 కొరోనా (corona) కేసులు నమోదయ్యాయి. గత ఐదు నెలల తరువాత రెండు వేల కన్నా ఎక్కువ కేసులు ఒకే రోజు నమోదు కావడం ఇదే ప్రథమం. గత సంవత్సరం అక్టోబర్ 28న సుమారు 2200 రోజువారీ కోవిడ్ 19 (covid-19) కేసులు నమోదయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Rise in Corona cases: కేరళ, కర్నాటకల్లో ఎక్కువ

దేశవ్యాప్తంగా కొరోనా పాజిటివిటీ రేటు (corona positivity rate) మంగళవారానికి 1.51 శాతానికి పెరిగింది. ఇప్పటివరకు భారత్ లో మొత్తం 4.48 లక్షల కోవిడ్ 19 (covid-19) కేసులు నమోదు కాగా, మొత్తం, 5,30,848 మంది ఈ కోవిడ్ 19 (covid-19) వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ కొరోనా (corona) కేసుల్లో పెరుగుదల నమోదు కావడానికి కొత్తగా వచ్చిన XBB.1.16 వేేరియంట్ కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్ లో మొత్తం 11,903 యాక్టివ్ (corona) కేసులున్నాయి. వాటిలో కర్నాటకలో 806, కేరళలో 2877, మహారాష్ట్రలో 2343, గుజరాత్ లో1976, ఢిల్లీలో 671, తమిళనాడులో 660, హిమాచల్ ప్రదేశ్ లో 574 యాక్టివ్ corona కేసులున్నాయి.

Rise in Corona cases: ఇమ్యూనిటీ పెరిగింది..

అయితే, ఇప్పుడు మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతుండడంపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే భారతీయుల్లో అటు కొరోనా (corona) నాచురల్ ఇన్ఫెక్షన్, ఇటు వ్యాక్సినేషన్ ద్వారా హైబ్రిడ్ ఇమ్యూనిటీ (hybrid immunity) డెవలప్ అయిందని వివరిస్తున్నారు. అందువల్ల ఆసుపత్రుల్లో చేరాల్సిన స్థాయిలో కోవిడ్ 19 (covid-19) వ్యాధి తీవ్రత ఉండదని చెబుతున్నారు. అయినా, వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి కొవిడ్ ప్రొటోకాల్ ను పాటించాలని సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, పరిశుభ్రతను పాటించడం వల్ల వైరస్ సోకకుండా కాపాడుకోవచ్చన్నారు. కొరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు మార్గదర్శకాలను సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఢిల్లీలో ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.