Covid-19 cases: కొరోనా పై రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు-health ministry directs states to accelerate the pace of covid 19 testing ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Health Ministry Directs States To Accelerate The Pace Of Covid-19 Testing

Covid-19 cases: కొరోనా పై రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు

HT Telugu Desk HT Telugu
Mar 25, 2023 06:44 PM IST

Covid-19 cases: దేశంలో కోవిడ్ 19 (covid 19) కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం పలు సూచనలతో కూడిన మార్గదర్శకాలను పంపించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (PTI)

Covid-19 cases: దేశంలో కొరోనా (corona) కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా గుజరాత్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్నాటకల్లో కోవిడ్ 19 (Covid 19)కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Covid-19 cases: టెస్ట్ ల సంఖ్య పెంచండి

దేశవ్యాప్తంగా, ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో కొరోనా (corona) కేసుల సంఖ్య పెరుగుతుండడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా రెండు రోజుల క్రితం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తాజాగా, రాష్ట్రాలకు కొన్ని సూచనలు చూస్తూ కేంద్ర వైద్యారోగ్య శాఖ, ఐసీఎంఆర్ (ICMR) తో కలిసి ఉమ్మడిగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇటీవలి కాలంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కొరోనా (corona) టెస్ట్ ల సంఖ్య చాలా తగ్గించారని కేంద్రం పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న ప్రమాణాల ప్రకారం.. ప్రతీరోజు 10 లక్షల జనాభాకు కనీసం 140 (corona) టెస్ట్ లు జరగాలని సూచించింది. కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల శ్యాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు ఎక్కువగా పంపించాలని కోరింది. అంతగా విశ్వసనీయం కాని ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ లపై ఎక్కువగా ఆధారపడకూడదని తెలిపింది. ప్రస్తుతం ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న ఇన్ ఫ్లుయెంజా లక్షణాలు కొరోనా (corona) లక్షణాల మాదిరిగానే ఉంటాయని, ఈ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరింది.

Covid-19 cases: ప్రొటోకాల్ పాటించాలి

కొవిడ్ ప్రొటోకాల్ (covid protocol) ను ప్రజలు పాటించడం మానేశారని కేంద్రం పేర్కొంది. మాస్క్ లను ధరించడం, భౌతిక దూరం పాటించడం, పరిశుభ్రత పాటించడం వంటి కొవిడ్ ప్రొటోకాల్ (covid protocol) విషయంలో అలక్ష్యం వద్దని సూచించింది. కొవిడ్ ప్రొటోకాల్ (covid protocol) ను పాటించేలా ప్రజల్లో మళ్లీ ప్రచారం చేయాలని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల్లో కేరళ (26.4%), మహారాష్ట్ర (21.7%), గుజరాత్ (13.9%), కర్నాటక (8.6%), తమిళనాడు (6.3%) ల్లో ఎక్కువగా ఉన్నాయి.

IPL_Entry_Point

టాపిక్