RBI interest rate hike : హోం లోన్ ఈఎంఐపై మరింత భారం.. సామాన్యుడి జేబుకు చిల్లు!
05 August 2022, 12:56 IST
- RBI interest rate hike : మీకు హోం లోన్ ఉందా? నెలనెల ఈఎంఐ చెల్లిస్తున్నారా? అయితే మీకు బ్యాడ్‌న్యూస్. మీపై ఈఎంఐ భారం పడే అవకాశం ఉంది!
ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపుతో.. సామాన్యుడి జేబుకి చిల్లు!
RBI interest rate hike : రెపో రేట్లను 50బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది. ఫలితంగా రెపో రేట్లు 5.40శాతానికి చేరాయి. అధికంగా ఉన్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రెపో రేట్లను పెంచుతున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. రెపో రేట్లను పెంచడం ఇది వరుసగా మూడోసారి.
నిపుణుల ప్రకారం.. ఆర్బీఐ తాజా చర్యలతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా బ్యాంక్‌లో డిపాజిట్లు చేసే వారి సంఖ్య కూడా పెరిగొచ్చు. ఎఫ్డీలపై రిటర్నులు పెరిగే సూచనలు కనిపిస్తుండటమే ఇందుకు కారణం. అదే సమయంలో ఈఎంల భారం పెరగనుంది. కొత్తగా రుణాలు తీసుకునేవారితో పాటు రెపో రేట్ ఆధారంగా.. ఇప్పటికే ఉన్న రుణాలు మరింత భారంకానున్నాయి!
"ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడంతో.. పర్సనల్, హోమ్, ఆటో లోన్లపై బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. అదే సమయంలో ఎఫ్డీ వంటి డిపాజిట్లపై బ్యాంక్‌లు వడ్డీలు పెంచాల్సి ఉంటుంది. అందువల్ల.. డిపాజిట్లు చేసే వారికి ఆర్బీఐ వార్త మంచి విషయమే. కానీ రుణాలు తీసుకునేవారికి మాత్రం కష్టమే," అని ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ జితేంద్ర సొలంకి వెల్లడించారు.
RBI repo rate hike : "బ్యాంక్‌లు.. ఈ మధ్యకాలంలో రెపో రేటు ఆధారిత లోన్లు ఎక్కువగా ఇస్తున్నాయి. హోం- ఆటో లోన్లు వీటిల్లో ఎక్కువగా ఉంటున్నాయి. ఇలాంటి దీర్ఘకాలిక రుణాలపై రెపో రేట్లు పెంచాలని ఆయా బ్యాంక్‌లు నిర్ణయిస్తే.. ప్రజలపై మరింత భారం పడినట్టే అవుతుంది," అని గుడ్మనీయింగ్.కామ్ ఫౌండర్ మనికరణ్ సింఘల్ వెల్లడించారు.
భారం ఎంత?
"ప్రస్తుతం వడ్డీ రేటు 6శాతంగా ఉంది. ఓ వ్యక్తి.. హోం లోన్ కింద 20ఏళ్ల కాల వ్యవధికి రూ. 35లక్షల రుణం తీసుకోవాలి అని అనుకుంటున్నాడు. అతనికి లోన్ లభిస్తే.. నెలవారీ ఈఎంఐ 6శాతంగా ఉంటుంది. అంటే రూ. 25,000 కట్ అవుతుంది. కానీ ఇప్పుడు హోం లోన్ల మీద వడ్డీ రేట్లు 50బీపీఎస్ పెరిగాయి అని అనుకుందాము. ఈ తరుణంలో హోం లోన్ మీద పడే ఈఎంఐ రూ .26,000 అవుతుంది. అంటే రుణం తీసుకున్న వ్యక్తిపై రూ. 1000 అదనపు భారం అని అర్థం. ఆర్బీఐ రెపో రేట్‌తో ఫ్లెక్సిబుల్ ఇంట్రెస్ రేట్ లోన్ తీసుకున్న రుణాలు కూడా పెరుగుతాయి," అని మనికరణ్ స్పష్టం చేశారు.
Home loan EMI : "ఈ రేట్ హైక్ ఊహించినదే. కానీ 35బీపీఎస్‌లు పెంచుతారేమో అని భావించాము. కానీ 50బీపీఎస్ పెంచారు. అందువల్ల ఇళ్ల లోన్ల ఈఎంఐలు మరింత భారంగా మారతాయి," అని అనిరాక్ గ్రూప్‌కు ఛైర్మన్ అనూజ్ పూరి తెలిపారు.
టాపిక్