తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lok Sabha Elections : ఓటర్లు ఇళ్లకే పరిమితం- ఓటు వేయని బెంగళూరు ప్రజలు!

Lok Sabha elections : ఓటర్లు ఇళ్లకే పరిమితం- ఓటు వేయని బెంగళూరు ప్రజలు!

Sharath Chitturi HT Telugu

27 April 2024, 8:50 IST

  • బెంగళూరు అర్హత కలిగిన ఓటర్లలో దాదాపు సగం మంది లోక్ సభ ఎన్నికలలో పాల్గొనలేదు, బెంగళూరు సెంట్రల్, నార్త్ మరియు సౌత్ వంటి పట్టణ ప్రాంతాలు రాష్ట్ర సగటు 69.23% కంటే తక్కువ పోలింగ్ ను నివేదించాయి.

ఓటు హక్కు వినియోగించుకోని సగం మంది బెంగళూరు వాసులు..
ఓటు హక్కు వినియోగించుకోని సగం మంది బెంగళూరు వాసులు.. (HT_PRINT)

ఓటు హక్కు వినియోగించుకోని సగం మంది బెంగళూరు వాసులు..

2024 Lok Sabha elections Bengaluru : ‘రండి.. ఓటు వేయండి’ అని రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, ప్రముఖులు ఎంత మంది ప్రచారాలు చేసినా.. ప్రముఖ నగరాల్లో పెద్దగా స్పందన లభించడం లేదు! శుక్రవారం జరిగిన 2024 లోక్​సభ ఎన్నికల రెండో దశ పోలింగ్​ ఇందుకు మరో ఉదాహరణ. బెంగళూరులో దాదాపు సగం మంది ఓటర్లు.. తమ ఓటు హక్కును ఉపయోగించుకోకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Covid vaccine: సేఫ్టీ ఇష్యూస్ కారణంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఉపసంహరించుకోనున్న ఆస్ట్రాజెనెకా

Haryana: హరియాణాలో సంక్షోభంలో బీజేపీ సర్కారు; అసెంబ్లీలో మారిన సంఖ్యాబలం

US crime news: ‘‘డాడీకి గుడ్ బై చెప్పు’’ - మూడేళ్ల కొడుకును షూట్ చేసి చంపేసిన కర్కశ తల్లి

Dhruv Rathee: ధృవ్​ రాఠీ: సోషల్ మీడియా సంచలనం.. మోదీనే ఎందుకు టార్గెట్ చేశారు?

సగం మంది ఓటు వేయలేదు..!

కర్ణాటకలోని 14 నియోజకవర్గాల్లో 69.23 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే బెంగళూరులోని మూడు కీలక నియోజకవర్గాలైన బెంగళూరు సెంట్రల్, బెంగళూరు నార్త్, బెంగళూరు సౌత్​లలో ఓటింగ్ శాతం.. మొత్తం రాష్ట్ర సగటు కంటే తక్కువగా నమోదైంది. కర్ణాటకలోని 14 నియోజకవర్గాల్లో 69.23 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించినప్పటికీ, ఈ మూడు పట్టణ ప్రాంతాల్లో తక్కువ శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ లోక్​సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్​లో 52.81 శాతం, బెంగళూరు నార్త్​లో 54.42 శాతం, బెంగళూరు సౌత్​లో 53.15 శాతం పోలింగ్ నమోదైంది. 2019 లోక్​సభ ఎన్నికల్లో.. ఇదే బెంగళూరు సెంట్రల్లో 54.32 శాతం, బెంగళూరు నార్త్​లో 54.76 శాతం, బెంగళూరు సౌత్లో 53.70 శాతం పోలింగ్ నమోదైంది. అంటే.. గతంతో పోల్చుకుంటే ఈసారి ఇంకా తక్కువ పోలింగ్​ శాతం నమోదైనట్టు. పైగా.. ప్రతిసారి ఇదే పరిస్థితులు కనిపిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు.

Bengaluru voter turnout 2024 : ఓటు హక్కు విషయంపై ఎంత అవగాహన కల్పించినా, ఎంత తీవ్రంగా ప్రచారాలు చేసినా.. ఓటర్ల ఉదాసీనత కొనసాగడంపై ఎన్నికల సంఘం అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

"దీనికి ఎలాంటి వివరణ లేదు. అదే నిజం' అని ఈసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

నగరంలోని పోలింగ్ కేంద్రాలకు ప్రజలు రాకపోవడానికి వేసవి తాపం కూడా ఒక కారణమని ఎన్నికల అధికారులు అభిప్రాయపడుతున్నారు.

బెంగళూరు రూరల్​లో 67.29 శాతం పోలింగ్ నమోదైంది.

మాండ్యలో 81.48 శాతం, కోలార్లో 78.07 శాతం పోలింగ్ నమోదైంది.

Lok Sabha elections 2024 : ఈ ఎన్నికల సందర్భంగా పట్టణ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి కర్ణాటక ఎన్నికల సంఘం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. వివిధ యాప్​ల వాడకాన్ని ప్రోత్సహించడం, ఓటర్లు పోలింగ్ బూత్లను గుర్తించడంలో సహాయపడటానికి ఓటరు స్లిప్పులపై క్యూఆర్ కోడ్లను జోడించడం వంటి చర్యలు తీసుకుంది.

బెంగళూరులోని పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లు, పార్కింగ్ సౌకర్యాల గురించి సమాచారం అందించడంతో పాటు విస్తృతమైన బూత్ ఎన్నికల నిర్వహణ ప్రణాళికను సైతం అందించింది. కానీ ఓటర్లు వచ్చి ఓటు వేయలేదు!

ఓటింగ్​ ప్రక్రియను సులభతరం చేసే చర్యల్లో భాగంగా ఓటర్ హెల్ప్​లైన్, 'నో యువర్ క్యాండిడేట్' యాప్​లను కూడా ఎన్నికల సంఘం ఉపయోగించింది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, గత లోక్​సభ ఎన్నికల్లో చారిత్రాత్మకంగా తక్కువ పోలింగ్ నమోదైన ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేల ఫీడ్​బ్యాక్​ ఆధారంగా ఎన్నికల సంఘం పట్టణ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలను మెరుగుపరిచింది. గతంలో ఓటర్ల భాగస్వామ్యాన్ని నిరుత్సాహపరిచిన కొన్ని కీలక సమస్యలను పరిష్కరిస్తూ.. ఓటింగ్​ను మరింత అందుబాటులోకి తీసుకురావడం, సమర్థవంతంగా నిర్వహించడం ఈ కార్యక్రమాల లక్ష్యం. అయినా.. ఫలితం దక్కలేదు!

Lok Sabha elections voter turnout : ఓవైపు.. 90ఏళ్లు పైబడిన వృద్ధులు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపిస్తూ.. ఉదయాన్నే పోలింగ్​ కేంద్రాలకు చేరుకుంటున్న దృశ్యాలు సోషల్​ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. ఇలా నగరాల్లోని ప్రజలు ఓటు వేసేందుకు ఆసక్తి చూపించకపోవడం చర్చకు దారితీస్తోంది.