Voter ID Download : ఆన్ లైన్ లో ఓటర్ ఐడీ కార్డు డౌన్ లోడ్, ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి?
20 April 2024, 15:17 IST
- Voter ID Download : 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు టైం వచ్చింది. మీ ఓటర్ ఐడీ కనిపించడంలేదా? అయితే ఆన్ లైన్ లో ఈజీగా ఓటర్ ఐడీ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఆన్ లైన్ లో ఓటర్ ఐడీ కార్డు డౌన్ లోడ్
Voter ID Download : ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ 'భారత సార్వత్రిక ఎన్నికలు-2024' ప్రారంభం అయ్యాయి. మొత్తం 7 దశల్లో జనరల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 18 సంవత్సరాలు నిండిన భారత పౌరుడు ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హుడు. ఓటు వేసేందుకు ఓటర్ ఐడీ(EPIC Card) అవసరం.
ఓటర్ ఐడీ కార్డు(EPIC- Electors Phots Identity Card) అనేది భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డు. ఓటరు ఐడీ కార్డు ఓటర్లను గుర్తించేందుకు, ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం జారీచేస్తుంది.
మీ ఓటర్ ఐడీ కార్డు(Voter ID) కనిపించడంలేదా? అయితే మీరు డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును సులభంగా డౌన్ లోడ్(Voter ID Download) చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో సులభంగా e-EPIC కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీటిని డీజీ లాకర్(Digi Locker)లో అప్‌లోడ్ చేయవచ్చు లేదా హార్డ్ కాపీగా ఉపయోగించుకునేందు లామినేట్ చేయవచ్చు. డిజిటల్ ఓటర్ కార్డు(e-Voter Card) పొందేందుకు మొబైల్ నెంబర్ అప్డేట్ తప్పనిసరి. ఫారం-8 ద్వారా మొబైల్ నెం. అప్డేట్ చేసుకోవచ్చు.
మొబైల్ నెంబర్ అప్డేట్(Voter ID Mobile No. Update) కోసం ఇలా చేయండి?
Step 1 : అధికారిక వెబ్ సైట్ https://voters.eci.gov.in/ పై క్లిక్ చేయండి.
Step 2 : 'Login'పై క్లిక్ చేయండి. మొబైల్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా నమోదు చేసి 'Get OTP' బటన్‌ను క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు వచ్చిన OTPని నమోదు చేసి, 'Verify & Login' బటన్‌పై క్లిక్ చేయండి.
Stop 3 : నివాస అడ్రస్ మార్పు, EPIC భర్తీ, PwD మార్కింగ్ ట్యాబ్ కింద ఉన్న ఫారం 8 పూరించండి అనే బటన్‌ను క్లిక్ చేయండి. తర్వాత 'Self' ను సెలక్ట్ చేసి 'Submit'పై క్లిక్ చేయండి. మీ ఓటరు ఐడీ వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. ఓకే బటన్‌ను క్లిక్ చేసిన తర్వాత, కరెక్షన్ బటన్ పై క్లిక్ చేయాలి.
Step 4 : రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ/లోక్ సభ నియోజకవర్గాన్ని సెలక్ట్ చేసుకుని నెక్ట్స్ పై క్లిక్ చేయండి. తర్వాత డిటైల్స్ విభాగంలో మొబైల్ నంబర్ సెలక్ట్ చేసి మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి నెక్ట్స్ పై క్లిక్ చేయండి. 'అప్లికేషన్ ఫర్ కరెక్షన్ ఆఫ్ ఎక్సిస్టింగ్ ఎలక్టోరల్ రోల్' ఆప్షన్ లో 'Mobile Number'పై క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ నమోదు చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నంబర్ అప్‌డేట్ అవుతుంది.
డిజిటల్ ఓటర్ ఐడీ డౌన్ లోడ్(e-Voter ID Download) చేసుకునే విధానం :
Step 1 : అధికారిక వెబ్ సైట్ https://voters.eci.gov.in/ పై క్లిక్ చేయండి.
Stpe 2 : 'E-EPIC Download' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. లాగిన్ పోర్టల్ లో మొబైల్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఓటీపీ పొందండి. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై & లాగిన్ బటన్ పై క్లిక్ చేయండి.
Step 3 : 'Download EPIC Card' పేజ్ లో 'EPIC నెంబర్' లేదా 'ఫారం రిఫరెన్స్ నెంబర్' ఎంటర్ చేయాలి. స్టేట్ సెలక్ట్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయండి.
Step 4 : మీ ఓటర్ ఐడీ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. కింద 'OTP Send' బటన్‌ను క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్ అప్డేట్ కాకపోతే, 'OTP' బటన్ అందుబాటులో ఉండదు.
Step 5 : OTP ఎంటర్ చేసి 'Verify'బటన్ పై క్లిక్ చేయండి. స్క్రీన్ పై డౌన్ లోడ్ e-EPIC బటన్‌ను క్లిక్ చేసి ఓటర్ ఐడీ డౌన్లోడ్ చేసుకోండి.