Link voter ID with Aadhaar card: ఆధార్, ఓటర్ ఐడీల అనుసంధానం గడువు పొడగింపు
08 January 2024, 19:24 IST
Link voter ID with Aadhaar card: ఓటర్ ఐడీ (voter ID), ఆధార్ కార్డు (Aadhaar card)ల అనుసంధానానికి 2023 ఏప్రిల్ 1వరకు ఉన్న గడువును పొడిగించారు. వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు ఓటర్ ఐడీ, ఆధార్ (Aadhaar card) లను అనుసంధానం చేసుకోవచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
Link voter ID with Aadhaar card: ఓటర్ ఐడీ (voter ID), ఆధార్ కార్డు (Aadhaar card)ల అనుసంధానానికి 2023 ఏప్రిల్ 1వరకు ఉన్న గడువును పొడిగించారు. వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు ఓటర్ ఐడీ (voter ID), ఆధార్ లను అనుసంధానం చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. 2024 మార్చి 31 వరకు ఆన్ లైన్ ద్వారా కానీ, ఎస్ఎంఎస్ పంపడం ద్వారా కానీ ఓటర్ ఐడీ (voter ID) ని, ఆధార్ నెంబర్ (Aadhaar card) ను లింక్ చేసుకోవచ్చు.
Link voter ID with Aadhaar card: ఈ అనుసంధానం కచ్చితం కాదు
అయితే, పాన్ కార్డు, ఆధార్ కార్డు లను కచ్చితంగా అనుసంధానం చేయాలని చెప్పిన ప్రభుత్వం.. ఆధార్ కార్డ్ (Aadhaar card), ఓటర్ ఐడీ (voter ID) లను కచ్చితంగా అనుసంధానం చేయాలని మాత్రం చెప్పలేదు. ఓటర్ ఐడీ (voter ID), ఆధార్ (Aadhaar card) ల అనుసంధానం ఐచ్ఛికమేనని, ఇష్టం లేని వారు అనుసంధానం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, ఒకే వ్యక్తి రెండు, మూడు నియోజకవర్గాల్లో ఓటర్ గా నమోదు కావడాన్ని ఈ ఓటర్ ఐడీ (voter ID) - ఆధార్ (Aadhaar card) అనుసంధానం ద్వారా నిరోధించవచ్చని వివరించింది.
Link voter ID with Aadhaar card: ఆధార్, ఓటర్ ఐడీ అనుసంధానం ఎలా?
ఆధార్ కార్డు (Aadhaar card) ను, ఓటర్ ఐడీ (voter ID) తో అనుసంధానం చేసుకోవడం కోసం ఈ స్టెప్స్ ఫాలో కావాలి.
- ముందుగా నేషనల్ వోటర్స్ సర్వీస్ పోర్టల్ (NVSP)ని ఓపెన్ చేయాలి. here.
- ఆ పోర్టల్ లోకి లాగిన్ కావాలి.
- ‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్స్ (Search in Electoral Roll)‘ ఆప్షన్ ను క్లిక్ చేయాలి.
- వివరాలు నింపి, ఆధార్ నెంబర్ (Aadhaar card) ను కూడా ఎంటర్ చేయాలి.
- రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి.
- మీ ఆధార్ నెంబర్ తో మీ ఓటర్ ఐడీ అనుసంధానం పూర్తవుతుంది.
టాపిక్