Telangana Voters List: తెలంగాణలోని మొత్తం ఓటర్లు 2,99,92,941 - తాజా లెక్కలివే-total registered voters list released by chief electoral officer telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Voters List: తెలంగాణలోని మొత్తం ఓటర్లు 2,99,92,941 - తాజా లెక్కలివే

Telangana Voters List: తెలంగాణలోని మొత్తం ఓటర్లు 2,99,92,941 - తాజా లెక్కలివే

HT Telugu Desk HT Telugu
Jan 06, 2023 07:11 AM IST

Registered voters list in Telangana: తెలంగాణలోని ఓటర్ల సంఖ్య 2,99,92,941కు చేరింది. గత ఏడాదితో పోలిస్తే 3,63,953 మంది ఓటర్లు తగ్గారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ గురువారం వివరాలను వెల్లడించారు.

తెలంగాణలో ఓటర్ల వివరాలు వెల్లడి
తెలంగాణలో ఓటర్ల వివరాలు వెల్లడి (ceo telangana)

Telangana Registered Voters List: రాష్ట్రంలోని ఓటర్ల వివరాలను వెల్లడించింది ఎన్నికల సంఘం. తెలంగామలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,99,92,941కు చేరింది. 18 నుంచి 19 సంవత్సరాల వయసున్న ఓటర్లు 2,78,650 మంది నమోదు చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే 3,63,953 మంది ఓటర్లు తగ్గినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు. వార్షిక ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం(ఎస్‌ఎస్‌ఆర్‌)–2023లో భాగంగా ఈ మేరకు తుది ఓటర్ల జాబితా వివరాలను పేర్కొన్నారు.

సాధారణ ఓటర్లకు ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 2,740 మంది, సర్వీసు ఓటర్లు (కేంద్ర సాయుధ బలగాలు) 15,282 మంది కలిపితే మొత్తం ఓటర్ల సంఖ్య 2,99,92,941కు చేరనుందని ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంలో ఈ ఏడాది జరగాల్సిన శాసనసభ ఎన్నికలను ఈ జాబితాతోనే నిర్వహించనున్నారు. గతేడాది 3,03,56,894 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య కాస్త 2,99,92,941కి తగ్గింది. గడిచిన ఏడాది ఒకే ఫొటోతో ఉన్న.., వేర్వేరు ప్రాంతాల్లోని ఓటర్లను గుర్తించి తొలగించడంతో సంఖ్య తగ్గినట్లు ఈసీ ప్రకటించింది. మొత్తం ఓటర్లలో మహిళల కన్నా పురుషులు 1,25,221 మంది మాత్రమే ఎక్కువ ఉన్నారని వెల్లడించింది.

ఓట్ల లెక్కలు
ఓట్ల లెక్కలు

రాష్ట్రంలోని 19,314 ప్రాంతాల్లో 34,891 పోలింగు కేంద్రాలున్నాయని వికాస్ రాజ్ తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా యువతను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని 1,700 కళాశాలల్లో ఓటు నమోదు ప్రచారం నిర్వహించామని వివరించారు. పలు గిరిజన తండాల్లో ప్రచారం నిర్వహించి ఇప్పటివరకు ఓటు హక్కులేని 2,800 మందిని గుర్తించి ఓటర్లుగా నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఫలితంగా వీరంతా తొలిసారిగా ఓటు హక్కును పొందినట్లు తెలిపారు. సదరం డేటాబేస్, ఆసరా పెన్షన్ల సమాచారాన్ని వికలాంగ ఓటర్ల నమోదుకు వినియోగించామని వివరించారు.ఓటర్ల తుది జాబితాలో చోటుపొందని వారు మళ్లీ దరఖాస్తు చే సుకోవచ్చని స్పష్టం చేశారు. ఎన్‌వీఎస్‌పీ వెబ్‌పోర్టల్, ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ లేదా తమ దరఖాస్తును స్థానిక బీఎల్‌ఓకు అందజేస్తే అర్హులకు ఓటు హక్కు కల్పిస్తామని వెల్లడించారు.

IPL_Entry_Point