తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Fed Rate Hike : భారీగా పెరగనున్న వడ్డీ రేట్లు.. ప్రజలపై మరింత భారం!

FED rate hike : భారీగా పెరగనున్న వడ్డీ రేట్లు.. ప్రజలపై మరింత భారం!

Sharath Chitturi HT Telugu

27 August 2022, 7:46 IST

    • FED rate hike : వడ్డీ రేట్ల పెంపుపై మరింత తీవ్రంగా ఉండనున్నట్టు అమెరికా ఫెడ్​ పేర్కొంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే తమ లక్ష్యమని.. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినా, ప్రజలు ఉద్యోగాలు కోల్పోయినా పర్లేదని తేల్చిచెప్పింది.
వడ్డీ రేట్లను భారీగా పెంచేందుకు అమెరికా ఫెడ్​ నిర్ణయం!
వడ్డీ రేట్లను భారీగా పెంచేందుకు అమెరికా ఫెడ్​ నిర్ణయం! (Bloomberg)

వడ్డీ రేట్లను భారీగా పెంచేందుకు అమెరికా ఫెడ్​ నిర్ణయం!

FED rate hike : తీవ్రస్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కోసం.. కఠిన చర్యలకు సిద్ధపడుతోంది అమెరికా ఫెడ్​. రానున్న రోజుల్లో వడ్డీ రేట్లను భారీగా పెంచుతామని.. ఫెడ్​ ఛైర్మన్​ జెరోమి పావెల్​ ప్రకటించారు. తమ చర్యలతో ఆర్థిక వ్యవస్థ కాస్త నెమ్మదించినా.. 40ఏళ్ల ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే లక్ష్యం అని తేల్చిచెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

అమెరికాలో మూడు రోజుల జాక్సన్​ హోల్​ సమావేశం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పావెల్​ నుంచి ఓ ప్రకటన వెలువడింది. ఫెడ్​.. భారీగా వడ్డీ రేట్లను పెంచుతుందని సంకేతాలిచ్చారు.

"రానున్న రోజుల్లో వడ్డీ రేట్లను మరింత పెంచుతాము. ఈ చర్యలతో ప్రజలు, వ్యాపారులకు బాధ కలగవచ్చు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించవచ్చు. ప్రజలు తమ ఉద్యోగాలు కోల్పోవచ్చు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలంటే ఈ బాధను భరించక తప్పదు. కానీ ధరల్లో స్థిరత్వాన్ని తిరిగి తీసుకురాకపోతే కలిగే బాధ ఇంకా దారుణంగా ఉంటుంది. అందుకే వడ్డీ రేట్ల పెంపు తప్పదు," అని ఫెడ్​ ఛైర్మన్​ పావెల్​ అభిప్రాయపడ్డారు.

America Inflation : అమెరికాలో.. ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠాన్ని తాకిన మాట వాస్తవమే. 3 నెలల క్రితంతో పోల్చుకుంటే.. ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయంతో ద్రవ్యోల్బణం కాస్త తగ్గింది. ఇందుకు తగ్గట్టుగానే.. రానున్న రోజుల్లో.. వడ్డీ రేట్ల పెంపు తీవ్రతను తగ్గించే అవకాశం ఉన్నట్టు  గత నెలలో సంకేతాలిచ్చింది ఫెడ్​. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాల డేటా అత్యంత బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఇక ఫెడ్​ వడ్డీ రేట్ల తీవ్రత కచ్చితంగా తగ్గుతుందని నిపుణులు భావించారు. పావెల్​ కూడా ఇదే చెబుతారని ఆశించారు. కానీ అందరిని షాక్​కు గురిచేస్తూ.. వడ్డీ రేట్ల పెంపుపై మరింత దూకుడుగా ఉంటామని ఫెడ్​ చెప్పింది.

ఈ పరిణామాలతో అమెరికా స్టాక్​ మార్కెట్లు భారీగా, ఒక్కసారిగా పతనమయ్యాయి. మదుపర్లలో మళ్లీ భయాలు మొదలయ్యాయి. ఫలితంగా డౌ జోన్స్​ సూచీ.. ఏకంగా 1000పాయింట్లు పతనమైంది.

FED chairman Powell : ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపుతో అమెరికాలో ద్రవ్యోల్బణం దిగి వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇది మంచి విషయమే అయితే.. ఫెడ్​ నిర్ణయంతో ఆర్థిక మాంద్యం ఏర్పడే ప్రమాదం ఉండటం ఇప్పుడు ఆందోళనకర విషయం.

<p>&nbsp;ఫెడ్​ ఛైర్మన్​ పావెల్​</p>

అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు.. ఈ ఏడాది మార్చ్​ నుంచి చర్యలు తీసుకుంటోంది ఫెడ్​. ఫలితంగా అమెరికాలో కార్ల వాహనాల లోన్లు, ఇళ్ల ధరలు, వ్యాపారాల్లో అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇళ్ల అమ్మకాలు పడిపోయాయి.

Rate Hike : ఫెడ్​ ఛైర్మన్​ పావెల్​ ప్రకటనపై ఇప్పుడు సర్వత్రా ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఎప్పటివరకు వడ్డీ రేట్లను పెంచుతారు? వడ్డీ రేట్ల తీవ్రత ఎప్పుడు తగ్గుతుంది? ప్రజలు ఉద్యోగాలు కోల్పోతే ఫెడ్​ చర్యలేంటి? ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తే.. ఫెడ్​ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అమెరికాతో పోల్చుకుంటే.. భారత్​లో ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉంది. ఇప్పటికే పలుమార్లు వడ్డీ రేట్లను పెంచింది ఆర్​బీఐ. ఇక అమెరికాలో తాజా పరిస్థితులు.. ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయాలు.. భారత దేశంపై, ఆర్​బీఐ నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.