RBI interest rate hike : హోం లోన్​ ఈఎంఐపై మరింత భారం.. సామాన్యుడి జేబుకు చిల్లు!-how loan emis bank fds could be impacted by rbi interest rate hike ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  How Loan Emis, Bank Fds Could Be Impacted By Rbi Interest Rate Hike

RBI interest rate hike : హోం లోన్​ ఈఎంఐపై మరింత భారం.. సామాన్యుడి జేబుకు చిల్లు!

Sharath Chitturi HT Telugu
Aug 05, 2022 12:56 PM IST

RBI interest rate hike : మీకు హోం లోన్​ ఉందా? నెలనెల ఈఎంఐ చెల్లిస్తున్నారా? అయితే మీకు బ్యాడ్​న్యూస్​. మీపై ఈఎంఐ భారం పడే అవకాశం ఉంది!

ఆర్​బీఐ వడ్డీ రేట్ల పెంపుతో.. సామాన్యుడి జేబుకి చిల్లు!
ఆర్​బీఐ వడ్డీ రేట్ల పెంపుతో.. సామాన్యుడి జేబుకి చిల్లు! (Mint)

RBI interest rate hike : రెపో రేట్లను 50బేసిస్​ పాయింట్లు పెంచుతున్నట్టు ఆర్​బీఐ శుక్రవారం వెల్లడించింది. ఫలితంగా రెపో రేట్లు 5.40శాతానికి చేరాయి. అధికంగా ఉన్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రెపో రేట్లను పెంచుతున్నట్టు ఆర్​బీఐ వెల్లడించింది. రెపో రేట్లను పెంచడం ఇది వరుసగా మూడోసారి.

ట్రెండింగ్ వార్తలు

నిపుణుల ప్రకారం.. ఆర్​బీఐ తాజా చర్యలతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా బ్యాంక్​లో డిపాజిట్లు చేసే వారి సంఖ్య కూడా పెరిగొచ్చు. ఎఫ్​డీలపై రిటర్నులు పెరిగే సూచనలు కనిపిస్తుండటమే ఇందుకు కారణం. అదే సమయంలో ఈఎంల భారం పెరగనుంది. కొత్తగా రుణాలు తీసుకునేవారితో పాటు రెపో రేట్​ ఆధారంగా.. ఇప్పటికే ఉన్న రుణాలు మరింత భారంకానున్నాయి!

"ఆర్​బీఐ వడ్డీ రేట్లు పెంచడంతో.. పర్సనల్​, హోమ్​, ఆటో లోన్లపై బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. అదే సమయంలో ఎఫ్​డీ వంటి డిపాజిట్లపై బ్యాంక్​లు వడ్డీలు పెంచాల్సి ఉంటుంది. అందువల్ల.. డిపాజిట్లు చేసే వారికి ఆర్​బీఐ వార్త మంచి విషయమే. కానీ రుణాలు తీసుకునేవారికి మాత్రం కష్టమే," అని ట్యాక్స్​ అండ్​ ఇన్​వెస్ట్​మెంట్​ ఎక్స్​పర్ట్​ జితేంద్ర సొలంకి వెల్లడించారు.

RBI repo rate hike : "బ్యాంక్​లు.. ఈ మధ్యకాలంలో రెపో రేటు ఆధారిత లోన్లు ఎక్కువగా ఇస్తున్నాయి. హోం- ఆటో లోన్లు వీటిల్లో ఎక్కువగా ఉంటున్నాయి. ఇలాంటి దీర్ఘకాలిక రుణాలపై రెపో రేట్లు పెంచాలని ఆయా బ్యాంక్​లు నిర్ణయిస్తే.. ప్రజలపై మరింత భారం పడినట్టే అవుతుంది," అని గుడ్​మనీయింగ్​.కామ్​ ఫౌండర్​ మనికరణ్​ సింఘల్​ వెల్లడించారు.

భారం ఎంత?

"ప్రస్తుతం వడ్డీ రేటు 6శాతంగా ఉంది. ఓ వ్యక్తి.. హోం లోన్​ కింద 20ఏళ్ల కాల వ్యవధికి రూ. 35లక్షల రుణం తీసుకోవాలి అని అనుకుంటున్నాడు. అతనికి లోన్​ లభిస్తే.. నెలవారీ ఈఎంఐ 6శాతంగా ఉంటుంది. అంటే రూ. 25,000 కట్​ అవుతుంది. కానీ ఇప్పుడు హోం లోన్​ల మీద వడ్డీ రేట్లు 50బీపీఎస్​ పెరిగాయి అని అనుకుందాము. ఈ తరుణంలో హోం లోన్​ మీద పడే ఈఎంఐ రూ .26,000 అవుతుంది. అంటే రుణం తీసుకున్న వ్యక్తిపై రూ. 1000 అదనపు భారం అని అర్థం. ఆర్​బీఐ రెపో రేట్​తో ఫ్లెక్సిబుల్​ ఇంట్రెస్​ రేట్​ లోన్​ తీసుకున్న రుణాలు కూడా పెరుగుతాయి," అని మనికరణ్​ స్పష్టం చేశారు.

Home loan EMI : "ఈ రేట్​ హైక్​ ఊహించినదే. కానీ 35బీపీఎస్​లు పెంచుతారేమో అని భావించాము. కానీ 50బీపీఎస్​ పెంచారు. అందువల్ల ఇళ్ల లోన్ల ఈఎంఐలు మరింత భారంగా మారతాయి," అని అనిరాక్​ గ్రూప్​కు ఛైర్మన్​ అనూజ్​ పూరి తెలిపారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్