US inflation | 40 ఏళ్ల గ‌రిష్టానికి యూఎస్ ద్ర‌వ్యోల్బ‌ణం-us inflation reached a new 40 year high in june of 91 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Us Inflation Reached A New 40-year High In June Of 9.1%

US inflation | 40 ఏళ్ల గ‌రిష్టానికి యూఎస్ ద్ర‌వ్యోల్బ‌ణం

HT Telugu Desk HT Telugu
Jul 13, 2022 10:24 PM IST

US inflation | అమెరికాలో నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ ధ‌ర‌లు మండిపోతున్నాయి. ఈ సంవ‌త్స‌రం మే నెల‌తో పోలిస్తే.. జూన్‌లో ఈ ధ‌ర‌ల సూచీ 1.3% పెరిగింది. అలాగే, అమెరికా ద్ర‌వ్యోల్బ‌ణం(US inflation) నాలుగు ద‌శాబ్దాల గ‌రిష్టానికి చేరింది.

ప్ర‌తీకాత్మ‌క చిత్రం
ప్ర‌తీకాత్మ‌క చిత్రం

US inflation | అమెరికాలో నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ల సూచీ( CPI - Consumer price index)లో క్ర‌మానుగ‌త పెరుగుద‌ల న‌మోద‌వుతోంది. మే నెల‌లో అంత‌కుముందు నెల క‌న్నా 1%, జూన్ నెల‌లో మే నెల క‌న్నా 1.3% పెరుగుద‌ల న‌మోదైంది. దేశంలో ఇంధ‌నం, ఆహార ప‌దార్ధాలు, రెంట్స్ భారీగా పెరుగుతున్నాయి. దాంతో, ద్ర‌వ్యోల్బ‌ణం కూడా రికార్డు స్థాయిలో న‌మోద‌వుతోంది.

ట్రెండింగ్ వార్తలు

US inflation : ద్ర‌వ్యోల్బ‌ణం 9.1 %

అమెరికా దేశ ద్ర‌వ్యోల్బ‌ణం నాలుగు ద‌శాబ్దాల గ‌రిష్టానికి చేరింది. జూన్ నెల‌లో 9.1 శాతానికి చేరి రికార్డు సృష్టించింది. ఈ నేప‌థ్యంలో యూఎస్ ప్ర‌జ‌ల‌పై మ‌రో భారం మోపే దిశ‌గా ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది. రుణాల వ‌డ్డీ రేట్ల‌ను పెంచాల‌న్న యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

US inflation : నల‌భై ఏళ్ల త‌రువాత‌

అమెరికాలో న‌ల‌భై ఏళ్ల త‌రువాత నిత్యావ‌స‌ర వస్తువుల ధ‌ర‌ల్లో ఈ స్థాయిలో పెరుగుద‌ల న‌మోదైంద‌ని లేబ‌ర్ డిపార్ట్‌మెంట్ వెల్ల‌డించింది. 1981 నాటి సంక్షోభ స‌మ‌యంలో ఈ స్థాయిలో US inflationలో పెరుగుద‌ల చోటు చేసుకుంద‌ని వివ‌రించింది. అలాగే, జూన్ నెల‌లో చోటు చేసుకున్న పెరుగుద‌ల 2005 త‌రువాత అత్య‌ధిక‌మ‌ని వెల్ల‌డించింది. ఈ ఇన్‌ఫ్లేష‌న్ పెరుగుద‌ల‌కు ప్ర‌ధాన కార‌ణం ఆహార ప‌దార్ధాలు, ఇంధ‌న ధ‌ర‌ల్లో, రెంట్ ల్లో చోటు చేసుకున్న అసాధార‌ణ పెరుగుద‌లే కార‌ణంగా తెలుస్తోంది.

US inflation : గ్యాస్ ధ‌ర‌..

ఇంధ‌న ధ‌ర‌లో మాత్రం జూన్ నెల‌తో పోలిస్తే జులై 12 నాటికి స్వ‌ల్ప త‌గ్గుద‌ల చోటు చేసుకుంది. జూన్ 15న గ్యాల‌న్ గ్యాస్ ధ‌ర 5 డాల‌ర్లు ఉండ‌గా, జులై 12న ఆ ధ‌ర 4.66 డాల‌ర్ల‌కు చేరింది. అంత‌కుముందు పెంపుతో పోలిస్తే.. ఈ త‌గ్గుద‌ల చాలా స్వ‌ల్పం. అలాగే, సంవ‌త్స‌రం క్రితం ధ‌ర‌తో పోలిస్తే ఈ 4.66 డాల‌ర్ల ధ‌ర చాలా ఎక్కువ‌. కాక‌పోతే, ఈ త‌గ్గుద‌ల కార‌ణంగా, జులై, ఆగ‌స్ట్ నెల‌ల్లో ద్ర‌వ్యోల్బ‌ణం త‌గ్గే అవ‌కాశం ఉంది.

US inflation : ప్ర‌భుత్వ చ‌ర్య‌లు

ద్ర‌వ్యోల్బ‌ణాన్న క‌ట్ట‌డి చేయ‌డానికి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు ప్రారంభించింది. త్వ‌ర‌లో రుణాల‌పై వడ్డీ రేట్లు పెంచాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌జ‌ల కొనుగోలు సామ‌ర్ధ్యంపై ప్రతికూల ప్ర‌భావం చూపే నిర్ణ‌యాల‌ను ఫెడ్ స‌మీక్షా స‌మావేశంలో తీసుకోనుంది. మ‌రోవైపు, ర‌ష్యా ఉక్రెయిన్ యుద్ధం, చైనాలో సుదీర్ఘ లాక్‌డౌన్ కార‌ణంగా త‌లెత్తిన సప్లై చెయిన్ సంక్షోభం కూడా ఈ inflation పెరుగుద‌లకు కార‌ణంగా భావిస్తున్నారు. చైనాలో లాక్‌డౌన్ ను తొల‌గించ‌డం, అక్క‌డ ప‌రిస్థితులు సాధార‌ణ స్థితికి వ‌స్తుండ‌డం శుభ ప‌రిణామ‌మ‌ని భావిస్తున్నారు.

IPL_Entry_Point