DU Faculty Recruitment 2023 : డీయూలో 225 అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్.. అప్లై చేసుకోండిలా
20 December 2022, 10:36 IST
DU Faculty Recruitment 2023 : ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని రెండు కాలేజ్‌లలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల నోటిఫికేషన్ పడింది. ఆ వివరాలు..
డీయూలో 225 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా
DU Faculty Recruitment 2023 : ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన జేఎంసీ(జీసెస్ అండ్ మేరీ కాలేజ్)లో ఫాకల్టీ పోస్టుల రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలైంది. జేఎంసీ అధికారిక వెబ్సైట్ అయిన jmc.ac.in లో.. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ 2023 జనవరి 7న ముగుస్తుందన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి.
జేఎంసీలోని మొత్తం 145 పోస్టులకు రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుగుతోంది. అర్హతతో పాటు సెలక్షన్ ప్రక్రియను ఇక్కడ తెలుసుకోండి.
అర్హత..
JMC recruitment 2023 : అభ్యర్థులకు భారత విశ్వవిద్యాలయాలు లేదా అక్రిడేటెడ్ ఫారిన్ యూనివర్సిటీల్లో 55శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. లేదా.. ప్రపంచంలోని టాప్ 500 యూనివర్సిటీల్లోని ఇన్స్టిట్యూషన్ నుంచి పీహెచ్.డీ ఉండాలి.
అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ అనేది కనీస అర్హతగా ఉంటుంది. అయితే.. ఎన్ఈటీ నిర్వహించని సబ్జెక్టులకు మినహాయింపు లభిస్తుంది.
సెలక్షన్ ప్రక్రియ..
అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుంది. ఎక్కువ మార్కులు మొదలుకుని.. తక్కువ మార్కుల వరకు ఓ లిస్ట్ తయారు చేస్తుంది. వాటిల్లో నుంచి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఆ తర్వాత వారిని ఇంటర్వ్యూ చేస్తుంది. ఇంటర్వ్యూలో మెరుగైన ప్రదర్శన చేసిన వారికే ఉద్యోగం లభిస్తుంది.
అప్లికేషన్ ఫీజు..
దరఖాస్తు కోసం యూఆర్/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌కు చెందిన వారు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలకు ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు.
80 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు..
DU recruitment 2022 : ఢిల్లీ యునివర్సిటీకి చెందిన శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో 80 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తుకు 2023 జనవరి 9 చివరి తేది. అభ్యర్థులు.. colrec.uod.ac.in లో అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు-
అప్లికేషన్ ఫీజు కోసం అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థలు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.
DU recruitment 2022 for assistant professors : ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలకు ఎలాంటి రుసుము లేదు.
అప్లై చేసుకోండి ఇలా..
స్టెప్ 1:- colrec.uod.ac.in వెబ్‌సైట్‌కు వెళ్లండి
స్టెప్ 2:- సైన్ ఇన్ చేసి అప్లికేషన్ ఫామ్‌ను నింపండి
స్టెప్ 3:- అప్లికేషన్ ఫీజు కట్టిండి
స్టెప్ 4:- అప్లికేషన్ ఫామ్‌ను సబ్మీట్ చేయండి
స్టెప్ 1:- భవిష్యత్తు కార్యకలాపాల కోసం ప్రింటౌట్ తీసుకోండి.
* శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ పూర్తి నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
* శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్, జేఎంసీ ఆర్హత, సెలక్షన్ ప్రక్రియ ఒకే విధంగా ఉన్నాయి.