తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Hc Jobs : జనవరి 20న ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు రాత పరీక్ష…..

AP HC JOBS : జనవరి 20న ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు రాత పరీక్ష…..

HT Telugu Desk HT Telugu

17 December 2022, 8:37 IST

    • AP HC JOBS ఏపీ హైకోర్టులో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షా తేదీలను హైకోర్టు రిజిస్ట్రార్‌ ప్రకటించారు.  ఏపీహైకోర్టులో 241 ఉద్యోగ నియామకాలకు సంబంధించి  ఇప్పటికే నోటఫికేషన్ విడుదలైంది.   వచ్చే ఏడాది జనవరిలో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన  రాత పరీక్షను నిర్వహించనున్నారు. 
ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు రాత పరీక్ష
ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు రాత పరీక్ష

ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు రాత పరీక్ష

AP HC JOBS ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నియామక పరీక్షను 2023 జనవరి నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ హైకోర్టు అడ్మినిస్ట్రేషన్ రిజిస్ట్రార్‌ ఏ.గిరిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టులో241ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఇప్పటికే విడుదలైంది. వివిధ క్యాటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులకు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తున్నారు. మరోవైపు హైకోర్టులో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల - ఖాళీలు, ముఖ్య తేదీలివే

AP EAPCET 2024 Updates : ఐఎండీ రెయిన్ అలర్ట్... ఏపీ ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులకు కీలక అప్డేట్

ఏపీ హైకోర్టులోసెక్షన్ ఆఫీసర్‌, డ్రైవర్‌, ఆఫీస్ సబార్డినేట్‌, అసిస్టెంట్‌, ఎగ్జామినర్, ఓవర్‌ సీర్‌/అసిస్టెంట్ ఓవర్ సీర్‌ , టైపిస్ట్‌, కాపీయిస్ట్‌ పోస్టులకు ఉమ్మడిగా కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తారు. జనవరి 14వ తేదీ నుంచి ఏపీ హైకోర్టు వెబ్‌సైట్‌లో హాల్‌ టిక్కెట్లను జారీ చేస్తారు. జనవరి 23లోగా రాత పరీక్షకు సంబంధించిన కీ అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతారు. టైపిస్ట్‌, కాపీయిస్ట్‌, డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించిన స్కిల్ టెస్ట్‌ను ఫిబ్రవరి 25న నిర్వహిస్తారు. స్కిల్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారి జాబితాను మార్చి 3న ప్రకటిస్తారు.

అక్టోబర్‌లో ప్రకటన…..

ఏపీ హైకోర్టుతో పాటు జిల్లా కోర్టుల్లో పలు ఉద్యోగాలకు గత అక్టోబర్్లో నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 3,673 ఉద్యోగాల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టింది. జిల్లా కోర్టుల్లో 3,432 ఉద్యోగాలు, హైకోర్టుల్లో 241 పోస్టులతో మొత్తం 3,673 పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశారు.

ఆంధ్ర ప్రదేశ్‌ న్యాయస్థానాల్లో భర్తీ చేయనున్న ఉద్యోగాలు, పోస్టుల వివరాలు, అర్హతలు, పరీక్షా విధానం, రిజర్వేషన్లు తదితర వివరాల కోసం హైకోర్టు వెబ్‌ సైట్‌ hc.ap.nic.inలో చూడవచ్చు. ఏపీ హైకోర్టు అడ్మిన్ రిజిస్ట్రార్‌ ఆలపాటి గిరిధర్‌ రిక్రూట్‌మెంట్‌ రిజిస్ట్రార్‌గా వ్యవహరించనున్నారు. ఏపీ హైకోర్టులో సిబ్బంది కొరతతో ఉద్యోగులపై పనిభారం ఎక్కువైంది. ఉద్యోగాల నియామకం కోసం గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖాళీల భర్తీ కోసం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా చొరవ చూపారు.

కోర్టుల్లో భర్తీ చేసే పోస్టుల్లో టైపిస్ట్‌, కాపీయిస్ట్‌, డ్రైవర్, ఎగ్జామినర్, ఫీల్డ్‌ అసిస్టెంట్‌, ప్రాసెస్‌ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్‌, ఆఫీస్ సబార్డినేట్, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ 3 వంటి ఉద్యోగాలు ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్‌ 3, కాపీయిస్ట్‌, డ్రైవర్‌ ఉద్యోగాలకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్ధులు వేర్వేరు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న ఒకే కామన్‌ పరీక్ష ద్వారా మెరిట్ లిస్ట్‌ ఎంపిక చేస్తారు. అయా పోస్టుల్ని బట్టి దరఖాస్తు చేసిన వారిలో మెరిట్ జాబితాను సిద్ధం చేస్తారు. మొదటిసారి కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్న వారు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

జిల్లా కోర్టుల్లో భర్తీ చేసే పోస్టుల్లో స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్ -3 ఉద్యోగాలు 114 ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 681, టైపిస్ట్ ఉద్యోగాలు 170, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు 158, ఎగ్జామినర్ ఉద్యోగాలు 112, కాపీయిస్ట్‌ ఉద్యోగాలు 209, డ్రైవర్ ఉద్యోగాలు 20, రికార్డ్ అసిస్టెంట్ 9, ప్రాసెస్‌ సర్వర్‌ 439, ఆఫీస్ సబార్డినేట్ 1520 ఉద్యోగాలు ఉన్నాయి.

హైకోర్టులో భర్తీ చేసే ఉద్యోగాల్లో సెక్షన్ ఆఫీసర్‌, కోర్టు ఆఫీసర్‌ 9, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌ 13, కంప్యూటర్ ఆపరేటర్స్‌ 11, ఓవర్ సీర్‌ పోస్టు 1, అసిస్టెంట్ ఉద్యోగాలు 14, ఎగ్జామినర్‌ 13, టైపిస్ట్‌ 16, కాపీయిస్ట్‌ 20, అసిస్టెంట్ ఓవర్‌సీర్‌ 1, డ్రైవర్లు 8, ఆపీస్‌ సబార్డినేట్లు 135 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైకోర్టు ఉద్యోగాలకు నవంబర్‌ 15లోగా దరఖాస్తు చేసుకున్న వారికి జనవరిలో కంప్యూటర్ బేస్డ్ పరీక్షను నిర్వహించనున్నారు.

తదుపరి వ్యాసం