AP High Court Jobs: ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు....డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్-ap high court direct job recruitment notification released ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap High Court Direct Job Recruitment Notification Released

AP High Court Jobs: ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు....డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్

HT Telugu Desk HT Telugu
Oct 07, 2022 02:25 PM IST

ap high court jobs: ఏపీ హైకోర్టులో పలు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్‌ 22వ తేదీని తుది గడువుగా ప్రకటించింది. సెప్టెంబర్‌ 30వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మొత్తం 76 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. వీటిలో కోర్టు మాస్టర్‌, న్యాయమూర్తులకు పర్సనల్ సెక్రటరీ ఉద్యోగాలున్నాయి.

ఏపీ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఏపీ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP High Court Jobs 2022:ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఉద్యోగ నియామకాలను భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన వెలువడింది. తాజాగా ఏపీ హైకోర్టులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో కోర్టు మాస్టర్లు, పర్సనల్‌ సెక్రెటరీలు పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ,

పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు....

ఉద్యోగాల పేరు: కోర్టు మాస్టర్లు, పర్సనల్‌ సెక్రెటరీలు

మొత్తం 76 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో ఓపెన్‌ క్యాటగిరీలో 28పోస్టులున్నాయి. వాటిలో 12 మహిళలకు కేటాయించారు. ఓపెన్‌ క్యాటగిరీలో వికలాంగులకు ఒకటి, స్పోర్ట్స్‌ అభ్యర్ధులకు ఒకటి, ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌కు ఒకటి కేటాయించారు. ఈడబ్ల్యుఎస్‌ కోటాలో 8పోస్టులుండగా ఒకటి మహిళలకు కేటాయించారు. బిసి ఏ విభాగంలో 5లో ఒకటి మహిళలకు, బిసి బిలో 7లో ఒకటి మహిళలకు, బిసి డిలో ఆరులో ఒకటి మహిళలకు, బిసి ఈలో 3 పోస్టులు, ఎస్సీ విభాగంలో 11 పోస్టుల్లో ఒకటి మహిళలకు, ఎస్టీ విభాగంలో 5లో ఒకటి మహిళలుకు కేటాయించారు. మొత్తం 75 పోస్టుల్లో 22 పోస్టుల్ని మహిళలకు కేటాయించారు.

అర్హతలు:

గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుంచి ఆర్ట్స్‌/ సైన్స్‌/ కామర్స్‌/ లా సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టైపింగ్‌ స్పీడ్‌, కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉండాలి.స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌ లేదా తత్సామాన బోర్డు నుంచి టైపింగ్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. నిమిషానికి 180 అక్షరాల ఇంగ్లీష్‌ షార్ట్‌ హ్యాండ్‌ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. టైపింగ్‌లో ‍‍హయ్యర్‌ గ్రేడ్‌ ఉత్తీర్ణులై ఉండాలి. టైపింగ్‌, షార్ట్‌ హ్యాండ్‌ అర్హతల ఆధారంగా ఉద్యోగ భర్తీ పరీక్ష నిర్వహిస్తారు. కంప్యూటర్‌ నైపుణ్యం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.

వయసు: 01.01.2022 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి. 42ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బిసి, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల మినహాయింపు ఉంటుంది. వికలాంగులకు 10ఏళ్ల మినహాయింపు ఇస్తారు.

దరఖాస్తు చేయడం ఇలా...

హైకోర్టు ఉద్యోగాల దరఖాస్తుతో పాటు మూడు లెేటెస్ట్ ఫోటోలు అతికించాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు ఎస్సెస్సీ, డిగ్రీ, షార్ట్‌హ్యాండ్‌ 150-180 సర్టిఫికెట్, టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణతా పత్రం, కుల ధృవీకరణ, ఈడబ్ల్యుఎస్ ధృవీకరణ, వికలాంగ ధృకరణ, ఎక్స్‌ సర్వీస్ మెన్ ధృవీకరణ, నిరభ్యంతర పత్రం వంటివి జత చేయాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం:

షార్ట్‌హ్యాండ్‌ ఇంగ్లీష్‌ మూడు నిమిషాల్లో 180 పదాలు, నాలుగు నిమిషాల్లో150 పదాలకు పరీక్ష నిర్వహిస్తారు. షార్ట్‌ హ్యాండ్ తర్జుమా 40-45 నిమిషాల వ్యవధిలో కంప్యూటర్‌పై పూర్తి చేయాల్సి ఉంటుంది. షార్ట్‌ హ్యాండ్‌ రెండు విభాగాల్లో 100మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఓరల్‌ ఇంటర్వ్యూలో 20 మార్కులకు సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఓరల్ ఇంటర్వ్యూకు 20మార్కులు ఇస్తారు.

కోర్టు ఉద్యోగాలకు పరీక్షలు నవంబర్ 11వ తేదీన నిర్వహిస్తారు. సాంకేతిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి నవంబర్ 25వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. నవంబర్ 30వ తేదీన ఫలితాలను వెల్లడిస్తారు.

దరఖాస్తు విధానం:

ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు రుసుం - జనరల్/ ఓబీసీ అభ్యర్థులు 1000 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ వారికి రూ. 500గా నిర్ణయించారు. పరీక్ష ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్‌ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. డీడీలు నేలపాడులోని ఎస్‌‌బిఐలో ఏపీ హైకోర్టు పేరిట తీయాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫారమ్ లను రిజిస్ట్రార్‌ (అడ్మినిస్ట్రేషన్‌), హైకోర్ట్‌ ఆఫ్‌ ఏపీ, నేలపాడు, అమరావతి, గుంటూరు జిల్లా 522237. అడ్రస్ కు పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది. పరీక్షకు హాజరయ్యే అభ‌్యర్ధులకు ఎలాంటి టిఏ, డిఏలు చెల్లించరు.

IPL_Entry_Point