తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Junior Lecturer Jobs: జూనియర్‌ లెక్చరర్‌ దరఖాస్తు తేదీల్లో మార్పులు.. తాజా వివరాలివే

TS Junior Lecturer Jobs: జూనియర్‌ లెక్చరర్‌ దరఖాస్తు తేదీల్లో మార్పులు.. తాజా వివరాలివే

HT Telugu Desk HT Telugu

16 December 2022, 14:56 IST

    • TSPSC Junior Lecturer Notification 2022 :1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కావాల్సిన ఉండగా.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక అప్డేట్ ఇచ్చింది. 
జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తులు
జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తులు

జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తులు

Junior Lecturer Notification 2022 in Telangana : రాష్ట్రంలోని 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. నిజానికి డిసెంబర్ 16 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ... పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక అప్డేట్ ఇచ్చింది. దరఖాస్తుల తేదీలను మార్పు చేస్తూ ప్రకటన జారీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Mulugu District : లిఫ్ట్ ఇచ్చి రేప్..! అడవిలో అంగ‌న్వాడీ టీచ‌ర్ హత్య

Karimnagar Rains : అకాల వర్షాలు, తడిసిపోయిన ధాన్యం..! అన్నదాత ఆగమాగం

TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ హాల్ టికెట్లు విడుద‌ల‌ - డౌన్లోడ్ లింక్ ఇదే

Hyderabad Crime : బీమా డబ్బుల కోసం కోడలి దాష్టీకం..! అత్తమామల హత్యకు కుట్ర, కత్తులతో దాడి చేసిన సుఫారీ గ్యాంగ్

ఈనెల 16 వ తేదీ ప్రారంభం కావాల్సిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది. సాంకేతిక కారణాలతో ఈనెల 20 నుంచి అప్లికేషన్లను స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది. జనవరి 10వ తేదీని తుది గడువుగా ప్రకటించింది. అభ్యర్థులు https://www. tspsc.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి పరీక్షను జూన్ లేదా జులై నిర్వహించనున్నారు.27 సబ్జెక్టుల్లో.. మల్టీ జోన్ 1 లో 724, మల్టీ జోన్ 2 లో 668 పోస్టులను భర్తీ చేయనున్నారు.

వివరాలివే:

బోటనీ - 113

బోటనీ (ఉర్దూ మీడియం)-15

అరబిక్ - 02

కెమిస్ట్రీ(రసాయన శాస్త్రం) - 113

కెమిస్ట్రీ(ఉర్దూ మీడియం) - 19

సివిక్స్(పొలిటికల్ సైన్స్) - 56

సివిక్స్ (ఉర్దూ మీడియం) - 16

సివిక్స్ (మారాఠీ) - 01

కామర్స్ - 50

కామర్స్ (ఉర్దూ మీడియం) - 07

ఎకనామిక్స్(అర్థశాస్త్రం) - 81

ఎకనామిక్స్ (ఉర్దూ) - 15

ఇంగ్లీష్ - 81

ఫ్రెంచ్ - 02

హిందీ - 117

హిస్టరీ- 77

హిస్టరీ (ఉర్దూ మీడియం) - 17

హిస్టరీ (మరీఠీ మీడియం) - 01

మ్యాథ్స్ - 154

మ్యాథ్స్ (ఉర్దూ మీడియం) - 09

ఫిజిక్స్ - 112

ఫిజిక్స్(ఉర్దూ మీడియం) - 18

జువాలజీ - 128

జువాలజీ (ఉర్దూ మీడియం) - 18

Sanskrit - 10

తెలుగు - 60

ఉర్దూ - 28

Drug Inspector Jobs: మరోవైపు ఇవాళ్టి నుంచి ఔషధ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలోని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. 2023 జనవరి 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. టిఎస్‌పిఎస్సీ భర్తీ చేయనున్న డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల్లో 5ఉద్యోగాలు మల్టీ జోన్ -1 పరిధిలో ఉన్నాయి. మల్టీ జోన్‌ 2 పరిధిలో 13 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు 2022 జులై 1 నాటికి 18 నుంచి 44ఏళ్ల మధ్య వయసు ఉన్న వారై ఉండాలి.

తదుపరి వ్యాసం