TS Junior Lecturer Jobs: 1,392 జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ జారీ-tspsc issued notification to fill 1392 junior lecturer posts ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Junior Lecturer Jobs: 1,392 జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ జారీ

TS Junior Lecturer Jobs: 1,392 జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ జారీ

HT Telugu Desk HT Telugu
Dec 09, 2022 06:47 PM IST

TSPSC Junior Lecturer Notification 2022 : తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదలైంది. 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన జారీ చేసింది.

జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Junior Lecturer Notification 2022 in Telangana : నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు ఇస్తుండగా… తాజాగా జేఎల్(Junior Lecturers) పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల కోసం అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీపడే అవకాశం ఉంది.

ఈనెల 16, 2022 నుంచి జనవరి 06, 2023 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి పరీక్షను జూన్ లేదా జులై నిర్వహించనున్నారు.27 సబ్జెక్టుల్లో.. మల్టీ జోన్ 1 లో 724, మల్టీ జోన్ 2 లో 668 పోస్టులను భర్తీ చేస్తారు.

వివరాలివే:

బోటనీ - 113

బోటనీ (ఉర్దూ మీడియం)-15

అరబిక్ - 02

కెమిస్ట్రీ(రసాయన శాస్త్రం) - 113

కెమిస్ట్రీ(ఉర్దూ మీడియం) - 19

సివిక్స్(పొలిటికల్ సైన్స్) - 56

సివిక్స్ (ఉర్దూ మీడియం) - 16

సివిక్స్ (మారాఠీ) - 01

కామర్స్ - 50

కామర్స్ (ఉర్దూ మీడియం) - 07

ఎకనామిక్స్(అర్థశాస్త్రం) - 81

ఎకనామిక్స్ (ఉర్దూ) - 15

ఇంగ్లీష్ - 81

ఫ్రెంచ్ - 02

హిందీ - 117

హిస్టరీ- 77

హిస్టరీ (ఉర్దూ మీడియం) - 17

హిస్టరీ (మరీఠీ మీడియం) - 01

మ్యాథ్స్ - 154

మ్యాథ్స్ (ఉర్దూ మీడియం) - 09

ఫిజిక్స్ - 112

ఫిజిక్స్(ఉర్దూ మీడియం) - 18

జువాలజీ - 128

జువాలజీ (ఉర్దూ మీడియం) - 18

Sanskrit - 10

తెలుగు - 60

ఉర్దూ - 28

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 247 లెక్చ‌రర్ల పోస్టుల భ‌ర్తీకి బుధవారం ప్రకటన విడుదల చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. మొత్తం 19 స‌బ్జెక్టుల్లో ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయనున్నారు.

ఉద్యోగ వివరాలు
ఉద్యోగ వివరాలు

పాలిటెక్నిక్ లెక్చరర్ల ఉద్యోగాలకు ఈ నెల 14 నుంచి జ‌న‌వ‌రి 4వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్య వివ‌రాల కోసం www.tspsc.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఓటీఆర్ నమోదు లేదా అప్డేట్ చేసుకోని వారు కూడా... పూర్తి చేసుకోవాలని టీఎస్పీఎస్సీ అధికారులు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే వారు చివరి నిమిషం వరకు వేచి చూడకూడదని... ముందస్తుగానే చేసుకుంటే మంచిదని సూచించింది.

Drug Inspector Jobs: తెలంగాణ రాష్ట్రంలోని ఔషధ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టుల్ని భర్తీచ చేయడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 16 నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. 2023 జనవరి 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. టిఎస్‌పిఎస్సీ భర్తీ చేయనున్న డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల్లో 5ఉద్యోగాలు మల్టీ జోన్ -1 పరిధిలో ఉన్నాయి. మల్టీ జోన్‌ 2 పరిధిలో 13 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు 2022 జులై 1 నాటికి 18 నుంచి 44ఏళ్ల మధ్య వయసు ఉన్న వారై ఉండాలి.

IPL_Entry_Point