TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల - డౌన్లోడ్ లింక్ ఇదే
17 May 2024, 17:17 IST
- TS Inter Supplementary Hall Tickets 2024 Updates: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. బోర్డు అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల 2024 హాల్ టికెట్లు
TS Inter Supplementary Hall Tickets 2024 : తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే విద్యార్థుల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.
TS Inter Supplementary Hall Tickets Download - డౌన్లోడ్ లింక్ ఇదే
- ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలనే విద్యార్థులు https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ మే/జూన్ - 2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- రోల్ నంబర్ లేదా మునుపటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి.
- సబ్మిట్ బటన్ పై నొక్కితే హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది. డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TS Inter Supply Exam schedule 2024 - ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్…
- 24-05-2024 : Part II - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
- 25-05-2024 : Part I -ఇంగ్లిష్ పేపర్-1
- 28-05-2024 : Part -III -గణితం పేపర్-1A, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1
- 29-05-2024 : గణితం పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
- 30-05-2024 : ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1
- 31-05-2024 : కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1
- 01-06-2024 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-1(For BiPC Students)
- 03-06-2024 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1
TS Inter Supply Exam schedule 2024 - ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్…
- 24-05-2024 : Part II - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
- 25-05-2024 : Part I -ఇంగ్లిష్ పేపర్-2
- 28-05-2024 : Part -III -గణితం పేపర్-2A, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2
- 29-05-2024 : గణితం పేపర్-2B, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2
- 30-05-2024 : ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
- 31-05-2024 : కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2
- 01-06-2024 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-2(For BiPC Students)
- 03-06-2024 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2
ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరగనున్నాయి. ఇక సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహించనున్నారు.
ముందుగా మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు భావించింది. కానీ ఈ తేదీలను మే 24 నుంచి జూన్ 3 వరకు మార్చింది. మే 27న నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కారణంగా షెడ్యూల్ లో పలు మార్పులు చేసింది. దీంతో జూన్ 3వ రకు ఎగ్జామ్స్ జరగనున్నాయి.