తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Govt Jobs: రాష్ట్రంలో కొత్తగా మరో 7,029 కొలువులు

TS Govt Jobs: రాష్ట్రంలో కొత్తగా మరో 7,029 కొలువులు

HT Telugu Desk HT Telugu

11 December 2022, 7:09 IST

    • telangana cabinet on new jobs: రాష్ట్రంలో ఇప్పటికే వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇదిలా ఉండగాననే... తెలంగాణ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మరో 7,029 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
కీలక నిర్ణయాలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
కీలక నిర్ణయాలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం

కీలక నిర్ణయాలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం

New Jobs in Telangana: రాష్ట్రంలోని పలు శాఖల్లో పోస్టుల భర్తీకి తెలంగాణ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పోలీసు, ఆర్‌అండ్‌బీ, జ్యోతిబా పూలే గురుకులాల్లో కలిపి మొత్తం 7,029 కొత్త కొలువులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయా శాఖలను ఆదేశించింది.

ట్రెండింగ్ వార్తలు

TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ హాల్ టికెట్లు విడుద‌ల‌ - డౌన్లోడ్ లింక్ ఇదే

Hyderabad Crime : బీమా డబ్బుల కోసం కోడలి దాష్టీకం..! అత్తమామల హత్యకు కుట్ర, కత్తులతో దాడి చేసిన సుఫారీ గ్యాంగ్

BRS Mlc Election Burden: బీఆర్​ఎస్ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ భారమంతా ‘పల్లా’పైనే! సహకరించని గులాబీ​ నేతలు

Warangal Naimnagar Bridge : నయీంనగర్ బ్రిడ్జి పనుల పూర్తికి టైమ్ ఫిక్స్ - జూన్​ 15 డెడ్ లైన్​..!

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తెలంగాణ సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయాలని మంత్రివ‌ర్గం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చర్యలు చేపట్టాలని హోంశాఖను కేబినెట్‌ ఆదేశించింది. పోలీస్‌ శాఖను మరింత బలోపేతం చేసేందుకు కొత్త పోలీస్‌ స్టేషన్లు, కొత్త సర్కిళ్లు, డివిజన్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

రోడ్లు, భవనాల శాఖ(ఆర్‌అండ్‌బీ) పని విస్తృతి పెరుగుతోందని పేర్కొంది. ఆ శాఖలో వికేంద్రీకరణ, పునర్వ్యవస్థీకరణకు క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఆ శాఖ ఇంజనీర్లకు కొత్త కార్యాలయ భవనాల నిర్మాణం, రహదారుల అభివృద్ధి పనులు, వైపరీత్యాల సమయంలో దెబ్బతినే రోడ్ల తక్షణ మరమ్మతులకు రూ.2,500 కోట్ల మేర నిధుల విడుదలను ఆమోదించింది. ఆర్ అండ్ బి శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472 అదనపు పోస్టులను కేబినెట్ మంజూరు చేసింది. ఇందులో... కొత్తగా 3 చీఫ్ ఇంజనీర్ పోస్టులు., 12 సూపరిండెంట్ ఇంజనీర్ పోస్టులు., 13 ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు., 102 డి.ఈ.ఈ పోస్టులు., 163 అసిస్టెంట్ ఈ.ఈ పోస్టులు., 28 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులతో పాటు పలు టెక్నికల్ , నాన్ టెక్నికల్ సిబ్బంది పోస్టులున్నాయి. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చేపట్టాలని రోడ్లు భవనాల శాఖను కేబినెట్ ఆదేశించింది. దాంతో పాటు సత్వరమే పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.

బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల్లోని పలు విభాగాల్లో 2,591 నూతన ఉద్యోగాల నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా ప్రారంభించిన 4 జూనియర్‌ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీలు, 33 రెసిడెన్షియల్‌ పాఠశాలలల్లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ విభాగాల్లో అవసరమైన మేరకు నూతన నియామకాలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

తదుపరి వ్యాసం