తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Jobs: గ్రూప్-2లో 783 పోస్టులు.. గ్రూప్ 3లో 1500

Tspsc jobs: గ్రూప్-2లో 783 పోస్టులు.. గ్రూప్ 3లో 1500

HT Telugu Desk HT Telugu

16 December 2022, 8:32 IST

    • Tspsc jobs: టీఎస్‌పీఎస్సీ నుంచి త్వరలో వెలువడనున్న గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం మొత్తం 783 పోస్టులు భర్తీ చేయనుంది.
త్వరలోనే వెలువడనున్న గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు
త్వరలోనే వెలువడనున్న గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు

త్వరలోనే వెలువడనున్న గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధం చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 783 పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. విభిన్న ప్రభుత్వ విభాగాల నుంచి ప్రతిపాదనలను స్వీకరించిన టీఎస్‌పీఎస్సీ పరిశీలన ప్రక్రియను పూర్తిచేసింది.

గ్రూప్-2లో తొలుత 663 పోస్టులను గుర్తించిన ప్రభుత్వం ఆమేరకు ఆగస్టు 30న జీవో జారీచేసింది. అయితే గ్రూప్-2 స్థాయి కలిగిన మరో 120 ఉద్యోగాలను కూడా తాజాగా ఇందులో చేర్చి మొత్తంగా 783 పోస్టులకు నోటిఫికేషన్ జారీచేయనున్నట్టు తెలుస్తోంది. కొత్తగా వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి 43 పోస్టులు, శిశు, సంక్షేమ శాఖ పరిధిలోని డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు సుమారు 70 పోస్టులు ఇందులో ఉన్నాయి.

ఇక గ్రూప్-3లో కూడా 1,373 పోస్టులు భర్తీ చేయాలని గుర్తించిన ప్రభుత్వం ఆమేరకు ఆగస్టు 30న జీవో జారీచేసింది. అయితే గ్రూప్ 3 స్థాయి మరికొన్ని ఉద్యోగాలను కూడా పరిశీలించి వీటికి అదనంగా చేర్చినట్టు తెలుస్తోంది. సంక్షేమ శాఖ, ఇతర శాఖల్లో అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ తదితర పోస్టులు దాదాపు 120 వరకు జత చేయనున్నారు. మొత్తం 1500 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.

గ్రూప్-2లో 783 పోస్టులు, గ్రూప్-3లో 1500 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఇప్పటికే గ్రూప్-4 నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే.

టాపిక్

తదుపరి వ్యాసం