TSPSC Group 4 Jobs: 9వేలకుపైగా గ్రూప్ -4 ఉద్యోగాలు.. ఎగ్జామ్ విధానం ఇదే..!
02 December 2022, 14:27 IST
- tspsc group 4 jobs: తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. ఇప్పటికే పోలీసు శాఖ నుంచి నోటిఫికేషన్లు వచ్చేశాయ్. ఇక టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్ 1 వచ్చింది. తాజాగా 9వేలకు పైగా గ్రూప్ 4 ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది. పోస్టుల ఖాళీలు, పరీక్ష విధానం చూస్తే...
తెలంగాణ గ్రూప్ 4 నోటిఫికేషన్
TSPSC Group 4 Jobs and Exam Pattern: తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి అన్ని శాఖలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పోలీస్ శాఖ భారీ స్థాయిలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక 500కు పై పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. మరోవైపు గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చేసింది. 9 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఎలాంటి పోస్టులు ఉన్నాయి.? సిలబస్ స్వరూపమేంటి..? పరీక్షా విధానం వంటి అంశాలపై చాలానే డౌట్స్ ఉంటాయి. అయితే ఇందుకు సంబంధించిన అంశాలను చూస్తే...
2 పేపర్లు.. 300 మార్కులు
గతంల పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించే.. గ్రూపు 4 ఉద్యోగాలకు పేపర్ - 1, పేపర్ -2 పరీక్షలను నిర్వహించారు. ఒక్కో పేపర్ లో 150 ప్రశ్నలకు గానూ 150 మార్కులు ఉంటాయి. రెండో పేపర్ లోనే ఇదే విధంగా ఉంటాయి. మొత్తం 300 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో గరిష్ఠ మార్కులతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. నెగిటివ్ మార్కులు లేవు. ఈసారి కూడా ఇలాగే ఉండే అవకాశం ఉంది.
సిలబస్ ఇదే..
పేపర్-1 లో మొత్తం 150 మార్కులు ఉంటాయి. ఇందులో జనరల్ అవేర్‌నెస్(General Knowledge) నుంచి ప్రశ్నలు వస్తాయి. సమయం గంటన్నర ఉంటుంది. కరెంట్ ఆఫైర్స్, అంతర్జాతీయ సంబంధాలు, సామాన్యశాస్త్రం, భారతదేశ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, భౌగోళిక అంశాలు, భారత రాజ్యాంగం: ప్రధాన లక్షణాలు , భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం, తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ సాంఘిక, సాంస్కృతిక, వారసత్వ అంశాలు, కళలు, సాహిత్యంతో పాటు తెలంగాణ రాష్ట్ర విధానాల వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఇక పేపర్ -2లో మొత్తం 150 మార్కులు ఉంటాయి. ఇందులో సెక్రటేరియల్ సామర్ధ్యాల (Secretarial Abilities) నుంచి ప్రశ్నలు వస్తాయి. పాలనా సామర్థ్యాలు (సెక్రటేరియల్ ఎబిలిటీస్) మెంటల్ ఎబిలిటీస్ (వెర్బల్, నాన్ వెర్బల్), లాజికల్ రీజనింగ్, కాంప్రహెన్షన్, రీ-అరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ ఎ వ్యూ టు ఇంప్రూవింగ్ ఎనాలసిస్ ఆఫ్ ఎ పాసేజ్, న్యూమరికల్, అర్థమెటికల్ ఎబిలిటీస్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
మరోవైపు పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి స్థాయి నోటఫికేషన్ ను డిసెంబర్ 23న అందుబాటులోకి తీసుకురానుంది. ఫైనల్ నోటిఫికేషన్ సమయంలో సిలబస్ లో ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య - 9168
మొత్తం మార్కులు - 300
పేపర్ 1: జనరల్ నాలెడ్జ్ (150 మార్కులు)
పేపర్ 2: సెక్రటేరియట్ ఎలిజిబిలిటీస్ (150 మార్కులు)
గ్రూప్ 4లో ముఖ్యంగా మూడు కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 6,859, వార్డు ఆఫీసర్ పోస్టులు 1,862, పంచాయితీరాజ్‌శాఖ 1,245 పోస్టులు, 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, 18 జూనియర్ ఆడిటర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. గతంలోని గ్రూప్ 2లో 663 పోస్టులు గుర్తిస్తూ.. టీఎస్పీఎస్సీ ఉత్తర్వులు ఇచ్చింది.