Telangana Group 4 Jobs: 9,168 గ్రూప్–4 ఉద్యోగాలు.. శాఖల వారీగా వివరాలివే
group 4 jobs in telangana: 9,168 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అతికొద్ది రోజుల్లోనే ఇందుకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది. అయితే ఈ పోస్టుల వివరాలు చూస్తే....
9168 group 4 vacancies in telangana: ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రాగా.. తాజాగా మరో తీపి కబురు చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. గ్రూప్ 4 పోస్టుల భర్తీకి శుక్రవారం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 9,168 పోస్టుల భర్తీకి ఆమోదముద్ర వేసింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు షురూ చేసింది.
శాఖలవారీగా వివరాలు…
మొత్తం 25 శాఖల్లోని 91 విభాగాల్లో ఖాళీగా ఉన్న 6,859 జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో పాటు పురపాలక శాఖలో 1,862 వార్డు అధికారుల పోస్టులు, ఆర్థికశాఖ, పురపాలకశాఖలో 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, ఆడిట్‌శాఖలో 18 మంది జూనియర్ ఆడిటర్ల నియామకానికి తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతించింది. సదరు ఉద్యోగాల భర్తీకి వీలుగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వివరాలను శాఖలవారీగా పరిశీలిస్తే....
-వ్యవసాయశాఖ: 44 (డైరెక్టర్ కార్యాలయం–2, కోఆపరేటివ్ రిజి్రస్టార్–4, అగ్రికల్చర్ కమిషనర్–4, హారి్టకల్చర్ వర్సిటీ–34, పశుసంవర్థక శాఖ–2, మత్స్యశాఖ–2)
-ఆర్థికశాఖ: 46 (డైరెక్టర్ ఆఫ్ వర్క్స్, అకౌంట్స్)
-మున్సిపల్ శాఖ: 601
-రెన్యూ శాఖ - 2,077
-ఉన్నత విద్య - 742(కళాశాల విద్య కమిషనరేట్–36, ఇంటరీ్మడియట్ కమిషనర్–68, సాంకేతిక విద్య కమిషనర్–46, ఓపెన్ యూనివర్సిటీ–26, జేఎన్‌యూఎఫ్‌ఏ–2, జేఎన్‌టీయూ–75, కాకతీయ వర్సిటీ–10, మహాత్మాగాందీ–4, ఉస్మానియా–375, పాలమూరు–8, తెలుగు వర్సిటీ–47, ఆర్‌జీయూకేటీ–31, శాతవాహన–8, తెలంగాణ వర్సిటీ–6)
-బీసీ సంక్షేమశాఖ: 307 (డైరెక్టర్ కార్యాలయం–7, జ్యోతిబాపూలే గురుకుల సొసైటీ–289, బీసీ సహకార సమాఖ్య–11)
-పౌర సరఫరాలశాఖ: 72 (డైరెక్టర్ కార్యాలయం–25, లీగల్ మెట్రాలజీ–1, సివిల్ సప్‌లైస్ కార్పొరేషన్–46)
-విద్యుత్ శాఖ : 2 (చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం)
-అటవీ, పర్యావరణ శాఖ: 23 (పీసీసీఎఫ్ కార్యాలయం)
-సాధారణ పరిపాలన శాఖ: 5 (పౌరసంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయం)
-వైద్య, ఆరోగ్యశాఖ: 338
-హోంశాఖ: 133 (డీజీపీ–88, జైళ్లశాఖ–18, అగ్ని మాపకశాఖ–17, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్–8, సైనిక్ వెల్ఫేర్–2)
-సాగునీటి శాఖ: 51 (భూగర్భజల శాఖ–1, ఈఎన్‌సీ–పరిపాలన–50)
-కార్మికశాఖ: 128
-రోడ్డు, రవాణాశాఖ: 20 (రవాణా కమిషనర్–11, ఈఎన్‌సీ ఆర్‌అండ్‌బీ–09)
-పరిశ్రమలశాఖ: 7 (కమిషనరేట్–4, మైన్స్, జియాలజీ–3)
-మైనార్టీ సంక్షేమశాఖ: 191 (మైనార్టీ సంక్షేమ డైరెక్టర్–06, మైనార్టీ గురుకులాలు–185)
-పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ: 1,245 (కమిషనర్ పరిధిలో–1,224, ఈఎన్‌సీ (జనరల్ అండ్ పీఆర్)–11, ఈఎన్‌సీ మిషన్ భగీరథ–10)
-ప్రణాళికశాఖ: 02 (అర్థగణాంక శాఖ డైరెక్టర్–02)
-ఎస్సీ అభివృద్ధి శాఖ: 474 (కమిషనర్ ఎస్సీల అభివృద్ధి శాఖ–13, ఎస్సీ సహకార కార్పొరేషన్–115, ఎస్సీ గురుకులాలు–346)
-మాధ్యమిక విద్యాశాఖ: 97 (డీఎస్‌ఈ–20, వయోజన విద్య–2, గ్రంథాలయాలు–9, మోడల్ స్కూళ్లు–14, టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ–9, టీఎస్‌ఆర్‌ఈఐఎస్–39, జిల్లా గ్రంథాలయాల సంస్థ–4)
-గిరిజన సంక్షేమ శాఖ: 221 (సీఈ ట్రైబల్ వెల్ఫేర్–04, కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్–11, జీసీసీ–65, ట్రైకార్–08, ఎస్టీ గురుకులాలు–132, టీసీఆర్‌అండ్‌టీఐ–1)
-మహిళాశిశు సంక్షేమశాఖ: 18 (జువెనైల్ వెల్ఫేర్–09, వికలాంగ, వయోవృద్ధుల సంక్షేమం–03, మహిళాశిశు సంక్షేమం–06)
-యువజన, సాంస్కృతికశాఖ: 13 (భాష సంస్కృతి–02, ఎన్‌సీసీ–11)
-పురపాలక వార్డు అధికారులు - 1,862 (మున్సిపల్ శాఖ)
మొత్తం :9,168
జూనియర్ అసిస్టెంట్లు - 6,859
పురపాలక వార్డు అధికారులు -1862
జూనియర్ అకౌంటెంట్లు -429
జూనియర్ ఆడిట్ అధికారులు - 18
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించే.. గ్రూపు 4 ఉద్యోగాలకు పేపర్ - 1, పేపర్ -2 పరీక్షలను నిర్వహిస్తారు. ఒక్కో పేపర్ లో 150 ప్రశ్నలకు గానూ 150 మార్కులు ఉంటాయి. రెండో పేపర్ లోనే ఇదే విధంగా ఉంటాయి. మొత్తం 300 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో గరిష్ఠ మార్కులతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. నెగిటివ్ మార్కులు ఉండవు. దీనిపై నోటిఫికేషన్ లో క్లారిటీ ఇస్తోంది పబ్లిక్ సర్వీస్ కమిషన్.