TS Govt Jobs: మెడికల్ కాలేజీల్లో 3897 ఉద్యోగాలు.. భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్
govt jobs in telangana: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. మెడికల్ కాలేజీల్లో 3,897 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
TS Govt Green Signal to 3897 Vacancies: ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రాగా.. తాజాగా మరో తీపి కబురు చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,897 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అనుమతులు ఇస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావ్ ట్వీట్ చేశారు. 9 మెడికల్ కాలేజీల్లో 3897 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఆరోగ్య తెలంగాణకు పెద్ద బూస్టింగ్ వంటిందని ట్వీట్ చేశారు.
8 మెడికల్ కాలేజీలు..
కొద్దిరోజుల కిందటే తెలంగాణ(Telangana)లో ఒకేసారి 8 మెడికల్ కాలేజీ(Medical Colleges)ల్లో తరగతులు ప్రారంభం అయ్యాయి. నవంబర్ 15న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడేనాటికి 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఇందులో గాంధీ (1954), ఉస్మానియా (1946) దవాఖానలు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించే నాటికే ఉన్నాయి. కాకతీయ మెడిక ల్ కాలేజీని 1959లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆదిలాబాద్‌లో రిమ్స్, నిజామాబాద్ లో మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి.
తెలంగాణ(Telangana) రాష్ట్రం ఆవిర్భావించాక మొదటి దశలో మహబూబ్ నగర్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట్‌లో మెడిల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. రెండో దశలో మంచిర్యాల, రామగుండం(Ramagundam), జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, సంగారెడ్డిలో కాలేజీలను ర్పాటు చేశారు. కాలేజీల సంఖ్య 17కు పెరిగింది. ఎనిమిదేండ్లలోనే కాలేజీల సంఖ్య మూడున్నర రెట్లు పెరిగింది. కొత్త కాలేజీలతో రాష్ట్రంలో అదనంగా 1,150 సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. 2014లో 850గా ఉన్న ఎంబీబీఎస్ సీట్లు(MBBS Seats) ఇప్పుడు 2,790 కి పెరిగాయి. పీజీ సీట్లు 531 నుండి 1122 కు పెరిగాయి. సూపర్ స్పెషాలిటీ సీట్లు 76 నుండి 152 కు పెరిగాయి.
గ్రూప్ 4 పోస్టుల భర్తీకి పచ్చజెండా..
గ్రూప్ 4 పోస్టుల భర్తీకి కొద్దిరోజుల కిందటే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 9,168 పోస్టుల భర్తీకి ఆమోదముద్ర వేసింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావ్ పేర్కొన్నారు.
శాఖలవారీగా వివరాలు…
మొత్తం 25 శాఖల్లోని 91 విభాగాల్లో ఖాళీగా ఉన్న 6,859 జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో పాటు పురపాలక శాఖలో 1,862 వార్డు అధికారుల పోస్టులు, ఆర్థికశాఖ, పురపాలకశాఖలో 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, ఆడిట్‌శాఖలో 18 మంది జూనియర్ ఆడిటర్ల నియామకానికి తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతించింది. సదరు ఉద్యోగాల భర్తీకి వీలుగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వివరాలను శాఖలవారీగా పరిశీలిస్తే....
-వ్యవసాయశాఖ: 44 (డైరెక్టర్ కార్యాలయం–2, కోఆపరేటివ్ రిజి్రస్టార్–4, అగ్రికల్చర్ కమిషనర్–4, హారి్టకల్చర్ వర్సిటీ–34, పశుసంవర్థక శాఖ–2, మత్స్యశాఖ–2)
-ఆర్థికశాఖ: 46 (డైరెక్టర్ ఆఫ్ వర్క్స్, అకౌంట్స్)
-మున్సిపల్ శాఖ: 601
-రెన్యూ శాఖ - 2,077
-ఉన్నత విద్య - 742(కళాశాల విద్య కమిషనరేట్–36, ఇంటరీ్మడియట్ కమిషనర్–68, సాంకేతిక విద్య కమిషనర్–46, ఓపెన్ యూనివర్సిటీ–26, జేఎన్‌యూఎఫ్‌ఏ–2, జేఎన్‌టీయూ–75, కాకతీయ వర్సిటీ–10, మహాత్మాగాందీ–4, ఉస్మానియా–375, పాలమూరు–8, తెలుగు వర్సిటీ–47, ఆర్‌జీయూకేటీ–31, శాతవాహన–8, తెలంగాణ వర్సిటీ–6)
-బీసీ సంక్షేమశాఖ: 307 (డైరెక్టర్ కార్యాలయం–7, జ్యోతిబాపూలే గురుకుల సొసైటీ–289, బీసీ సహకార సమాఖ్య–11)
-పౌర సరఫరాలశాఖ: 72 (డైరెక్టర్ కార్యాలయం–25, లీగల్ మెట్రాలజీ–1, సివిల్ సప్‌లైస్ కార్పొరేషన్–46)
-విద్యుత్ శాఖ : 2 (చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం)
-అటవీ, పర్యావరణ శాఖ: 23 (పీసీసీఎఫ్ కార్యాలయం)
-సాధారణ పరిపాలన శాఖ: 5 (పౌరసంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయం)
-వైద్య, ఆరోగ్యశాఖ: 338
-హోంశాఖ: 133 (డీజీపీ–88, జైళ్లశాఖ–18, అగ్ని మాపకశాఖ–17, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్–8, సైనిక్ వెల్ఫేర్–2)
-సాగునీటి శాఖ: 51 (భూగర్భజల శాఖ–1, ఈఎన్‌సీ–పరిపాలన–50)
-కార్మికశాఖ: 128
-రోడ్డు, రవాణాశాఖ: 20 (రవాణా కమిషనర్–11, ఈఎన్‌సీ ఆర్‌అండ్‌బీ–09)
-పరిశ్రమలశాఖ: 7 (కమిషనరేట్–4, మైన్స్, జియాలజీ–3)
-మైనార్టీ సంక్షేమశాఖ: 191 (మైనార్టీ సంక్షేమ డైరెక్టర్–06, మైనార్టీ గురుకులాలు–185)
-పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ: 1,245 (కమిషనర్ పరిధిలో–1,224, ఈఎన్‌సీ (జనరల్ అండ్ పీఆర్)–11, ఈఎన్‌సీ మిషన్ భగీరథ–10)
-ప్రణాళికశాఖ: 02 (అర్థగణాంక శాఖ డైరెక్టర్–02)
-ఎస్సీ అభివృద్ధి శాఖ: 474 (కమిషనర్ ఎస్సీల అభివృద్ధి శాఖ–13, ఎస్సీ సహకార కార్పొరేషన్–115, ఎస్సీ గురుకులాలు–346)
-మాధ్యమిక విద్యాశాఖ: 97 (డీఎస్‌ఈ–20, వయోజన విద్య–2, గ్రంథాలయాలు–9, మోడల్ స్కూళ్లు–14, టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ–9, టీఎస్‌ఆర్‌ఈఐఎస్–39, జిల్లా గ్రంథాలయాల సంస్థ–4)
-గిరిజన సంక్షేమ శాఖ: 221 (సీఈ ట్రైబల్ వెల్ఫేర్–04, కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్–11, జీసీసీ–65, ట్రైకార్–08, ఎస్టీ గురుకులాలు–132, టీసీఆర్‌అండ్‌టీఐ–1)
-మహిళాశిశు సంక్షేమశాఖ: 18 (జువెనైల్ వెల్ఫేర్–09, వికలాంగ, వయోవృద్ధుల సంక్షేమం–03, మహిళాశిశు సంక్షేమం–06)
-యువజన, సాంస్కృతికశాఖ: 13 (భాష సంస్కృతి–02, ఎన్‌సీసీ–11)
-పురపాలక వార్డు అధికారులు - 1,862 (మున్సిపల్ శాఖ)
ఇవే కాకుండా... తాజాగా భూగర్భశాఖలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇదే నెలలో గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అన్నీ కుదరితే ఈ నెలలో భారీగానే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది.