TSPSC Notifications: గుడ్ న్యూస్.. 57 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు - వివరాలివే-tspsc released notification for 57 posts in ground water department ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tspsc Released Notification For 57 Posts In Ground Water Department

TSPSC Notifications: గుడ్ న్యూస్.. 57 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు - వివరాలివే

HT Telugu Desk HT Telugu
Nov 30, 2022 06:31 AM IST

Ground Water department Jobs 2022: మరో 2 నోటిఫికేషన్లు ఇచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ కు సంబంధించి... రెండు విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో నాన్ గెజిటెడ్ పోస్టులు(Non Gazetted) 25, గెజిటెడ్(Gazetted) పోస్టుల 32 ఖాళీగా ఉన్నాయి.

గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ ఉద్యోగాలు,
గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ ఉద్యోగాలు,

TSPSC Ground Water department Jobs: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. గ్రూప్ 1 ఇవ్వగా... మరోవైపు గ్రూప్ 2, 3, 4 పోస్టుల భర్తీకి కూడా త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా... గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

గెజిటెడ్ పోస్టుల విభాగంలో మొత్తం 32 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు డిసెంబర్ 06 నుంచి అప్లికేషన్స్ ప్రక్రియ ప్రారంభం కానుంది.. డిసెంబర్ 27ను తుది గడువుగా నిర్ణయించారు.

ఖాళీల వివరాలు చూస్తే…

అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ - 01

అసిస్టెంట్ కెమిస్ట్ - 04

అసిస్టెంట్ జియోఫిజిస్ట్ - 06

అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్ - 16

అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ - 05

క్వాలిఫికేషన్స్...

అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్.. మెటీరియాలజీ లేదా ఫిజిక్స్ లేదా మ్యాథమేటిక్స్ లేదా అప్లైడ్ మేథమేటిక్స్ లో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.

అసిస్టెంట్ కెమిస్ట్.. కెమిస్ట్రీ లేదా అప్లైడ్ కెమిస్ట్రీలో డిగ్రీ కలిగి ఉండాలి. లేదా కెమికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేసిన వారు కూడా అర్హులు. వీటితో పాటు.. PG కూడా ఉండాలి.

అసిస్టెంట్ జియోఫిజిస్ట్.. జియో ఫిజిక్స్ లో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.

అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్.. జియాలజీలో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.

అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్.. సివిల్ ఇంజనీరింగ్ లో జియోలజీ అనేది ఒక సబ్జెక్ట్ కలిగి ఉండాలి. లేదా హైడ్రాలజీలో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.

అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

నాన్ గెజిటెడ్ పోస్టులు

నాన్ గెజిటెడ్ పోస్టుల విభాగంలో 25 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 07 నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 28 ని తుది గడువుగా ప్రకటించింది టీఎస్పీఎస్సీ.

వివరాలిలా..

1. టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రోజియాలజిస్ట్) - 07

2. టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రాలజిస్ట్ ) - 05

3.టెక్నికల్ అసిస్టెంట్ (జియో ఫిజిక్స్) - 08

4. ల్యాబ్ అసిస్టెంట్ - 01

5.జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ - 04

అర్హతలు..

టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రోజియాలజిస్ట్) .. జియాలజీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రాలజిస్ట్ ).. సివిల్ ఇంజనీరింగ్ లో జియాలజీ అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి. లేదా హైడ్రాలజీలో రెండేళ్ల ఎమ్సెస్సీ పూర్తి చేసి ఉండాలి.

టెక్నికల్ అసిస్టెంట్ (జియో ఫిజిక్స్).. జియో ఫిజిక్స్ లో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. లేదా ఎంటెక్ లో జియో ఫిజిక్స్ పూర్తి చేసిన వారు అర్హులు.

ల్యాబ్ అసిస్టెంట్.. కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్ తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్.. జియాలజీలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. లేదా మ్యాథమేటిక్స్ లేదా జియాలజీ ఒక సబ్జెక్ట్ తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఇదిలా ఉంటే ఉద్యోగాల భర్తీపై మంగళవారం సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్షించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్దన్​ రెడ్డితో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు. మరో 16,940 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మరో మూడురోజుల్లో అనుమతులు ఇవ్వనున్నట్లు సీఎస్​ సోమేశ్​కుమార్ చెప్పారు.

IPL_Entry_Point