Telangana Jobs : మరో 16,940 పోస్టులకు నోటిఫికేషన్-16946 jobs notification in next 3 days here s details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Jobs : మరో 16,940 పోస్టులకు నోటిఫికేషన్

Telangana Jobs : మరో 16,940 పోస్టులకు నోటిఫికేషన్

HT Telugu Desk HT Telugu
Nov 29, 2022 10:06 PM IST

Telangana Govt Jobs : తెలంగాణలో కొలువుల జాతర మెుదలైంది. ఇప్పటికే కొన్ని పోస్టులకు సంబంధించి.. రిక్రూట్ మెంట్ ప్రాసెస్ నడుస్తోంది. మరో మూడు రోజుల్లో 16,940 పోస్టులకు నోటిఫికేషన్ రానుంది. భూగర్భ జల వనరులశాఖలో 57 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది.

టీఎస్సీఎస్పీ జాబ్స్
టీఎస్సీఎస్పీ జాబ్స్

ఇప్పటికే వివిధ శాఖల్లో 60,929 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేశామని సీఎస్ సోమేశ్ కుమార్(CS Somesh Kumar) తెలిపారు. రిక్రూట్మెంట్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యే లా చూడాలని అధికారులను ఆదేశించారు. మరో 16,940 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మరో మూడురోజుల్లో అనుమతులు ఇవ్వనున్నట్లు సీఎస్​ సోమేశ్​కుమార్ చెప్పారు. ఉద్యోగ నియామక ప్రక్రియకు సంబంధించి.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్దన్​ రెడ్డితో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు.

సీఎం కేసీఆర్(CM KCR) ఆదేశాలతో వివిధ శాఖల్లో 60,929 పోస్టుల భర్తీకి అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సీఎస్ చెప్పారు. మరో 16వేలకు పైగా పోస్టులకు మరో మూడురోజుల్లో అనుమతులు ఇవ్వనున్నట్టుగా తెలిపారు. నియామకాల ప్రక్రియలో గడువులు నిర్దేశించుకుని పనిచేయాలని తెలిపారు. ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. డిసెంబర్ నెలలో నోటిఫికేషన్లు జారీ చేసేందుకు వీలుగా సమాచారాన్ని టీఎస్పీఎస్సీ(TSPSC) అందించాలన్నారు.

మరోవైపు భూగర్భ జల వనరుల శాఖ ఉద్యోగ నోటిఫికేషన్(Job Notification) విడుదలైంది. 57 పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్‌(TSPSC Job Notification) ఇచ్చింది. 32 గెజిటెడ్, 25 నాన్‌గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్‌ 6 నుంచి 27 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.

నోటిఫికేషన్ జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు టీఎస్పీఎఎస్సీ(TSPSC) కసరత్తు చేస్తోంది. నియామకాలను ప్రారంభించడం, వివిధ శాఖల అధికారులతో వరుస సమావేశాలను నిర్వహిస్తోంది. గ్రూప్ IV రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి సుమారు 30 విభాగాలతో TSPSC ఛైర్మన్ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్ ఇప్పటికే అధికారులతో సమావేశమయ్యారు. డిసెంబర్ నెలలో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉంది.

ఇప్పటివరకు, రిక్రూట్‌మెంట్ కోసం ప్రకటించిన మెుత్తం 80,039 ఖాళీలలో 61,804 ఖాళీలకు రిక్రూట్‌మెంట్ కోసం ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. మిగిలిన 18,235 ఖాళీలకు కూడా త్వరలో క్లియరెన్స్ లభిస్తుంది. మెుత్తం 94 శాఖల అధికారులతో దశల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. గ్రూప్ 2, 3, 4కు సంబంధించి.. ఖాళీలు, ఇండెంట్లు, రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు తదితర అంశాలపై చర్చిస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం