TSPSC Group Jobs: పెరగనున్న ఉద్యోగాలు.. త్వరలోనే గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లు..!-tspsc added six more posts in group 2 and two more posts in group 3 category ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Group Jobs: పెరగనున్న ఉద్యోగాలు.. త్వరలోనే గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లు..!

TSPSC Group Jobs: పెరగనున్న ఉద్యోగాలు.. త్వరలోనే గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లు..!

HT Telugu Desk HT Telugu
Nov 25, 2022 02:51 PM IST

Group 2, 3 Jobs in Telangana: ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చిన టీఎస్పీఎస్సీ… త్వరలోనే గ్రూప్ 2, 3 ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది.

త్వరలో గ్రూప్ 2, 3 ఉద్యోగాల భర్తీ!
త్వరలో గ్రూప్ 2, 3 ఉద్యోగాల భర్తీ! (tspsc)

TSPSC Group Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పరిధిలోకి వచ్చే పోస్టులను సవరించింది. ఈ మేరకు బుధవారం కొత్త జీవో నె.136 జారీ చేసింది. గతంలో జారీ చేసిన జీవో నెం.55ను సవరించింది. వివిధ విభాగాల్లోని పలు పోస్టులను గ్రూప్ 2, 3, 4 సర్వీసుల పరిధిలోకి తీసుకువస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ఆయా సర్వీసుల్లో ఉన్న అర్హతలు ఒకేలా ఉండటంతో ఈ మార్పులు చేసింది ప్రభుత్వం. ఫలితంగా ఖాళీల సంఖ్య మరికొంత పెరగనుంది.

గ్రూప్-2లో కొత్త పోస్టులు..

గ్రూప్‌-2 పరిధిలో ప్రస్తుతం 16 రకాల సర్వీసు ఉద్యోగాలు ఉన్నాయి. ఈ కేటగిరీలోకి మరో ఆరు కేటగిరీల పోస్టులను చేర్చింది. సహాయ సెక్షన్‌ అధికారి(రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సేవలు), సహాయ సెక్షన్‌ అధికారి(ఇతర విభాగాలు), జిల్లా ప్రొబేషనరీ అధికారులు(జువైనల్‌ విభాగం), సహాయ బీసీ సంక్షేమ అధికారులు, సహాయ గిరిజన సంక్షేమాధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారుల పోస్టుల్ని కొత్తగా చేర్చింది. దీంతో గ్రూప్‌-2 పరిధిలోకి మొత్తం 22 రకాల పోస్టులు వచ్చాయి.

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్,

డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్,

అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్,

అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్,

అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్.

గ్రూప్ 3 లో ఇలా...

ఇక గ్రూప్‌-3 లో చూస్తే ప్రస్తుతం 8 కేటగిరీల ఉద్యోగాలున్నాయి. కొత్తగా మరో రెండు సర్వీసులను చేర్చడంతో వీటి సంఖ్య పదికి చేరింది. కొత్తగా అకౌంటెంట్‌(గిరిజన సంక్షేమ సేవలు), ఇతర విభాగాధిపతుల కార్యాలయాల్లో సీనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌తో పాటు వీటి తత్సమాన కేటగిరీ ఉద్యోగాలు గ్రూప్‌-3 పరిధిలో ఉంటాయి.

1. అకౌంటెంట్

2. సీనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్

గ్రూప్ -4లో ఇలా...

గ్రూప్‌-4లో ప్రస్తుతం ఇందులో జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌ ఇతర తత్సమాన పోస్టులున్నాయి. వీటికి అదనంగా జువైనల్‌ విభాగం పరిధిలోని సూపర్‌వైజర్‌(పురుషులు), మాట్రన్‌-స్టోర్‌ కీపర్‌, సాంకేతిక విద్య కమిషనరేట్‌లో మాట్రన్‌ పోస్టులతో కలిపి నాలుగు రకాల కేటగిరీ ఉద్యోగాలు వచ్చాయి.

1. జూనియర్ అసిస్టెంట్, జూనిర్ అకౌంటెంట్

2. సూపర్వైజర్

3. మాట్రన్ కమ్ స్టోర్ కీపర్

4. మాట్రన్

త్వరలోనే నోటిఫికేషన్...?

ప్రభుత్వం తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ తో ఆయా పరిధిలో ఉద్యోగాల సంఖ్య పెరగనుంది. అదనంగా చేర్చినవాటితో కలిపి త్వరలో గ్రూప్‌-2, 3 నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. డిసెంబరు నాటికి ఈ రెండు నోటిఫికేషన్లు వెలువడే ఛాన్స్ ఉంది. తొలుతు గ్రూప్ 2 ఇచ్చిన తర్వాత... కొద్దిరోజుల తేడాలోనే గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇస్తారని సమాచారం.

Whats_app_banner