Telangana: త్వరలోనే వరుస నోటిఫికేషన్లు.. అన్ని శాఖలు సిద్ధం కావాలి - సీఎస్-telangana cs somesh kumar given clarity on jobs recruitment ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Cs Somesh Kumar Given Clarity On Jobs Recruitment

Telangana: త్వరలోనే వరుస నోటిఫికేషన్లు.. అన్ని శాఖలు సిద్ధం కావాలి - సీఎస్

HT Telugu Desk HT Telugu
Mar 18, 2022 06:07 AM IST

ఉద్యోగాల భర్తీపై సీఎస్ సోమేశ్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కొలువుల భర్తీ విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహారించాలని స్పష్టం చేశారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఇవాళ లేదా రేపు సీఎం కేసీఆర్ ను సీఎస్ కలిసే అవకాశం ఉంది. ఉద్యోగాల భర్తీ కోసం ఆమోదం తీసుకోనున్నారని సమాచారం.

ఉద్యోగాల భర్తీపై సీఎస్ క్లారిటీ
ఉద్యోగాల భర్తీపై సీఎస్ క్లారిటీ (twitter)

ఉద్యోగాల భర్తీకి సంబంధించి త్వరలోనే వరుస నోటిఫికేషన్లు జారీ అవుతాయని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసిన 80,039 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఉత్తర్వులు వస్తాయని చెప్పారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియపై గురువార ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎస్.. కీలక అంశాలపై చర్చించారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా ప్రతి శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

అలాంటి వాటికి అవకాశం ఇవ్వొద్దు..

ఉద్యోగాల భర్తీ విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహారించాలని సీఎస్ తెలిపారు.. ఏ విషయంలోనూ గందరగోళానికి అవకాశం ఇవ్వొద్దని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో నియామకాలకే అన్ని ప్రభుత్వ శాఖలు ప్రాధాన్యం ఇవ్వాలని.. ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్‌ అధికారిని నియమించుకోవాలని సూచించారు. దీని కోసం ఆర్థికశాఖకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ పరిధిలో పోస్టులుంటే వారికి సమాచారం ఇవ్వాలన్నారు. ఒకేసారి అన్ని నోటిఫికేషన్లు కాకుండా ఒకదాని తర్వాత ఒకటి చొప్పున తగిన వ్యవధితో ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

సిద్ధం కావాలి..

పోలీసు శాఖలో ఉద్యోగాలపై సీఎస్ సమీక్షించారు. 18వేలకు పైగా నియామకాలకు తాము సిద్ధంగా ఉన్నామని పోలీసుశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. అయితే సీఎం ఆదేశాల తరువాత నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని సీఎస్ సూచించారు. వర్సిటీల్లోని ఖాళీల భర్తీకి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి భర్తీ చేయాలని నిర్దేశించారు. గ్రూపు పోస్టులను భర్తీకి సన్నద్ధం కావాలని సీఎస్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ను సీఎస్ కోరారు.

సీఎస్ నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌, విద్య, వైద్యశాఖ కార్యదర్శులు పాల్గొన్నారు.పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ఛైర్మన్‌, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శితో పాటు పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌ హాజరయ్యారు.

 

గ్రూప్ వారీగా పోస్టుల వివరాలు ఇలా..

1. గ్రూప్ I 503

2. గ్రూప్ II 582

3. గ్రూప్ III 1,373

4. గ్రూప్ IV 9,168

డిపార్ట్‌మెంట్ వారీగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఖాళీలు

హోమ్ 18,334

మాధ్యమిక విద్య 13,086

ఆరోగ్యం, వైద్యం 12,755

ఉన్నత విద్య 7,878

బీసీ సంక్షేమం 4,311

రెవెన్యూ శాఖ 3,560

ఎస్సీ అభివృద్ధి శాఖ 2,879

నీటిపారుదల 2,692

గిరిజన సంక్షేమం 2,399

మైనారిటీ సంక్షేమం 1,825

పర్యావరణం, సైన్స్ & టెక్నాలజీ 1,598

పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి 1,455

లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ 1,221

ఆర్థిక 1,146

మహిళలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధులు 895

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 859

వ్యవసాయం మరియు సహకారం 801

రవాణా, రోడ్లు, భవనాల శాఖ 563

న్యాయ విభాగం 386

పశుసంవర్ధక & మత్స్య పరిశ్రమ 353

సాధారణ పరిపాలన 343

పరిశ్రమలు, వాణిజ్యం 233

యువజన, టూరిజం, కల్చర్ 184

ప్రణాళిక 136

ఆహారం, పౌర సరఫరాలు 106

శాసనసభ 25

ఇంధనం 16

మొత్తం 80,039

లోకల్ కేడర్ వారీ ఖాళీలు….

జిల్లా 39,829

జోనల్ 18,866

మల్టీ జోనల్ 13,170

ఇతర వర్గాలు, విశ్వవిద్యాలయాలు 8,174

జిల్లా వారీగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఖాళీలు..

హైదరాబాద్ 5,268

నిజామాబాద్ 1,976

మేడ్చల్-మల్కాజిగిరి 1,769

రంగారెడ్డి 1,561

కరీంనగర్ 1,465

నల్గొండ 1,398

కామారెడ్డి 1,340

ఖమ్మం 1,340

భద్రాద్రి కొత్తగూడెం 1,316

నాగర్ కర్నూల్ 1,257

సంగారెడ్డి 1,243

మహబూబ్ నగర్ 1,213

ఆదిలాబాద్ 1,193

సిద్దిపేట 1,178

మహబూబాబాద్ 1,172

హనుమకొండ 1,157

మెదక్ 1,149

జగిత్యాల 1,063

మంచిర్యాల 1,025

యాదాద్రి భువనగిరి 1,010

జయశంకర్ భూపాలపల్లి 918

నిర్మల్ 876

వరంగల్ 842

కొమరం భీమ్ ఆసిఫాబాద్ 825

పెద్దపల్లి 800

జనగాం 760

నారాయణపేట 741

వికారాబాద్ 738

సూర్యాపేట 719

ములుగు 696

జోగులాంబ గద్వాల్ 662

రాజన్న సిరిసిల్ల 601

వనపర్తి 556

మొత్తం 39,829

జోన్ వారీగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఖాళీలు….

జోన్ VI - చార్మినార్ 5,297

జోన్ IV - భద్రాద్రి 2,858

జోన్ III - రాజన్న 2,403

జోన్ II - బాసర 2,328

జోన్ VII - జోగులాంబ 2,190

జోన్ V – యాదాద్రి 2,160

జోన్ I - కాళేశ్వరం 1,630

జోనల్ మొత్తం 18,866

మల్టీజోన్ వారీగా ఇలా…

మల్టీ జోన్ - I 6,800

మల్టీ జోన్ - II 6,370

మల్టీ జోన్ మొత్తం 13,170

IPL_Entry_Point