తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Croma Diwali Sale : ఐఫోన్​, యాపిల్​ వాచ్​పై అదిరిపోయే ఆఫర్స్​!

Croma Diwali Sale : ఐఫోన్​, యాపిల్​ వాచ్​పై అదిరిపోయే ఆఫర్స్​!

Sharath Chitturi HT Telugu

26 September 2022, 16:33 IST

    • Croma Diwali Sale : దేశ ప్రజలను మరో ఫెస్టివల్​ సేల్​ పలకరించేసింది! దీపావళి సేల్​ను ప్రకటించింది క్రోమా. ఈ క్రమంలో ఐఫోన్​ 13తో పాటు ఇతర యాపిల్​ ప్రాడక్టులపై ఆకర్షణీయమైన ఆఫర్లను ఇచ్చింది. ఆ వివరాలు..
క్రోమా దీపావళి సేల్​లో ఐఫోన్​పై ఆఫర్స్​
క్రోమా దీపావళి సేల్​లో ఐఫోన్​పై ఆఫర్స్​ (Apple)

క్రోమా దీపావళి సేల్​లో ఐఫోన్​పై ఆఫర్స్​

Croma Diwali Sale : దీపావళి ఫెస్టివల్​ సేల్​ను ప్రకటించింది 'క్రోమా'. స్మార్ట్​ఫోన్లు, ఎలక్ట్రానిక్​ పరికరాలపై భారీ డిస్కౌంట్లను ఇస్తోంది. ఈ క్రమంలో ఐఫోన్​ 13 స్మార్ట్​ఫోన్​.. ఆన్​లైన్​లో అత్యంత కనిష్ఠ ధరకు అందుబాటులోకి రానుంది. ఫ్లిప్​కార్ట్​లో కొనుగోలు చేయలేకపోయిన వారు.. క్రోమా దీపావళి ఫెస్టివల్​ సేల్​లో ఐఫోన్​ 13ని దక్కించుకోవచ్చు!

ట్రెండింగ్ వార్తలు

Protein supplements ICMR : ప్రోటీన్​ సప్లిమెంట్స్​ వాడొద్దని ఐసీఎంఆర్​ ఎందుకు చెప్పింది?​

UPSC NDA NA results 2024: ఎన్డీఏ, ఎన్ఏ 2024 ఫలితాలను విడుదల చేసిన యూపీఎస్సీ

Kedarnath Dham yatra 2024: రేపటి నుంచి కేదార్ నాథ్ ధామ్ యాత్ర ప్రారంభం; రిజిస్టర్ చేసుకోకుండా వెళ్లొచ్చా?

karnataka sslc result 2024: 10వ తరగతి ఫలితాలను డైరెక్ట్ లింక్ ద్వారా తెలుసుకోండి

క్రోమా వెబ్​సైట్​లోని టీజర్​​ ప్రకారం.. ఐఫోన్​ 13 ధర రూ. 51,990గా ఉండనుంది. ఈ స్మార్ట్​ఫోన్​ అసలు ధర రూ. 69,900. అంటే.. ఐఫోన్​ 13పై ఏకంగా రూ. 17,910 తగ్గినట్టు. అయితే.. ఈ డీల్​ ఎంత కాలం ఉంటుందో చెప్పలేదు. క్రోమా వెబ్​ పేజ్​ ప్రకారం.. ఈ డీల్​ ఈ రోజు సాయంత్రం 4:45 గంటలకు లైవ్​లోకి వెళ్లనుంది. బ్యాంక్​ కార్డులు, ప్రీపెయిడ్​ ఆర్డర్లు, ఫ్లాట్​ డిస్కౌంట్ల ఆప్షన్లతో ఐఫోన్​ 13 ధరల్లో మార్పులు చూడవచ్చు.

Croma Diwali Sale offers : ఫ్లిప్​కార్ట్​లో ఐఫోన్​ 13 ధర రూ. 57,900గా ఉంది. ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​లో రూ. 16,900 తగ్గుతుంది. కాగా.. అమెజాన్​లో ఐఫోన్​ 12 ధర రూ. 42,999గా ఉంది.

ఇక క్రోమా దీపావళి సేల్​లో యాపిల్​ ఎస్​ఈ కూడా డిస్కౌంట్​ ధరకు లభించనుంది. రూ. 19,990కి ఈ స్మార్ట్​వాచ్​ను దక్కించుకోవచ్చు. ఇక శాంసంగ్​ గ్యాలెక్సీ ఎఫ్​ఈ 5జీ స్మార్ట్​ఫోన్​ రూ. 26,999కి కొనుగోలు చేసుకోవచ్చు. మరోవైపు 43 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ స్మార్ట్​ టీవీ వన్​ప్లస్​ ధర రూ. 19,999గా ఉండటం విశేషం.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ క్రెడిట్​ కార్డులపో 10శాతం డిస్కౌంట్​ లభిస్తుంది. అయితే ఇవి కొన్ని ఎంపిక చేసిన ప్రాడక్టులపైనే ఉండొచ్చు. పూర్తి వివరాల కోసం క్రోమా అధికారిక వెబ్​సైట్​ను సందర్శించాల్సి ఉంటుంది.

Apple Diwali sale : యాపిల్​ కూడా..

కొన్ని రోజుల క్రితమే యాపిల్​ ఇండియా కూడా దీపావళి సేల్​ను ప్రకటించింది. యాపిల్​ ఇండియా స్టోర్​ టీజర్​ ప్రకారం.. ఈ లిమిటెడ్​ టైమ్​ ఆఫర్​.. ఈ నెల 26న మొదలైంది. 

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.