తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Four-hour Delivery: 4 గంటల్లోనే డెలివరీ ఇస్తానంటున్న అమెజాన్

four-hour delivery: 4 గంటల్లోనే డెలివరీ ఇస్తానంటున్న అమెజాన్

HT Telugu Desk HT Telugu

23 September 2022, 17:05 IST

  • Amazon four-hour delivery: అమెజాన్ 2017లో తన ప్రైమ్ మెంబర్లకు సేమ్ డెలివరీ వెసులుబాటు పరిచయం చేసింది. ఇప్పుడు మరింత వేగవంతంగా 4 గంటల్లోనే డెలివరీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

నాలుగు గంటల్లో డెలివరీ ఇస్తామంటున్న అమెజాన్
నాలుగు గంటల్లో డెలివరీ ఇస్తామంటున్న అమెజాన్

నాలుగు గంటల్లో డెలివరీ ఇస్తామంటున్న అమెజాన్

బెంగళూరు: అమెజాన్ ఇండియా సేమ్ డే డెలివరీ కోసం తీసుకునే సమయాన్ని తగ్గిస్తోంది. భారతదేశం అంతటా 50 ప్రధాన నగరాలు, పట్టణాల్లో తన ప్రైమ్ మెంబర్‌లకు నాలుగు గంటలలోపు డెలివరీ అందించనుంది. ఇప్పటివరకు ఇది 14 నగరాల్లో మాత్రమే ఉండేది.

ట్రెండింగ్ వార్తలు

Iran President Raisi death : హెలికాప్టర్​ ప్రమాదంలో ఇరాన్​ అధ్యక్షుడు రైసీ మృతి

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

ఈ సేవలు సూరత్, మైసూరు, మంగళూరు, భోపాల్, నాసిక్, నెల్లూరు, అనంతపురం, వరంగల్, ఘజియాబాద్, ఫరీదాబాద్, పాట్నా తదితర నగరాల్లో అందుబాటులో ఉంటాయి. వైర్‌లెస్, ఎలక్ట్రానిక్స్, పుస్తకాలు, బొమ్మలు, కిచెన్ వంటి కేటగిరీల్లో ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్, జొమాటోకు చెందిన బ్లింకిట్, జెప్టో, డన్జో, స్విగ్గి ఇన్‌స్టామార్ట్ వంటి స్టార్టప్‌లు, ఇ-కామర్స్ సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు నిమిషాల్లో డెలివరీ ఇస్తామంటూ పోటాపోటీగా హామీ ఇస్తున్న ఈ సమయంలో ఈ ప్రకటన వెలువడింది.

అమెజాన్ ప్రత్యర్థి ఫ్లిప్‌కార్ట్ 2020లో బెంగళూరులో ఫ్లిప్‌కార్ట్ క్విక్‌ను ప్రారంభించింది. ఇది 2021లో కోల్‌కతా, చెన్నై, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, పూణెతో సహా 14 నగరాలకు విస్తరించింది. ఇది వినియోగదారులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడానికి, తదుపరి 90 నిమిషాల్లో డెలివరీని పొందడానికి అవకాశం కల్పిస్తుంది. కిరాణా, స్నాక్స్, మొబైల్, ఎలక్ట్రానిక్స్ తదితర కేటగిరీలకు వర్తిస్తుంది.

అమెజాన్ తన ప్రైమ్ మెంబర్‌షిప్, లాయల్టీ ప్రోగ్రామ్‌లో భాగంగా 2017లో భారతదేశంలో సేమ్ డే డెలివరీని మొదటిసారిగా ప్రవేశపెట్టింది. ఇప్పుడు నాలుగు గంటల డెలివరీ కోసం నగరంలోని వివిధ ప్రాంతాలను కవర్ చేస్తూ వ్యూహాత్మకంగా ఉన్న ప్రత్యేక సెంటర్లను ఉపయోగిస్తుంది.

‘కస్టమర్ లొకేషన్‌కు దగ్గరగా ఉన్న ప్రత్యేక భవనాల్లో అవసరమైన వస్తువులను నిల్వ చేయడం ద్వారా మేం అలా చేయగలుగుతున్నాం. సేమ్-డే డెలివరీ అసోసియేట్లకు గొప్ప ఉద్యోగ అవకాశాలను కూడా అందిస్తుంది..’ అని అమెజాన్ ఇండియా కస్టమర్ ఫుల్‌ఫిల్‌మెంట్, సప్లై చైన్ అండ్ అమెజాన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ డైరెక్టర్ అభినవ్ సింగ్ అన్నారు.

భారతదేశంలో త్వరిత వాణిజ్య మార్కెట్ 2025 నాటికి $5.5 బిలియన్లకు చేరుకుంటుంది. దాని ప్రస్తుత పరిమాణం కంటే 15 రెట్లు పెరుగుతుంది. కస్టమర్ల స్వీకరణ పరంగా చైనాతో సహా ఇతర మార్కెట్లలో అగ్రగామిగా ఉంది.

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, బ్లింకిట్ ప్రస్తుతం నిమిషాల్లో డెలివరీ ఇస్తామని హామీ ఇస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు అధిక మూలధనాన్ని ఖర్చుచేసే స్టార్టప్‌లు.. వ్యాపార నమూనాల స్థిరత్వంపై కూడా విమర్శలను ఎదుర్కొన్నాయి.

తదుపరి వ్యాసం