తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi Chairs High-level Meet On Covid: ‘నిర్ల్యక్ష్యం వద్దు.. సిద్ధంగా ఉండండి’

PM Modi chairs high-level meet on Covid: ‘నిర్ల్యక్ష్యం వద్దు.. సిద్ధంగా ఉండండి’

HT Telugu Desk HT Telugu

22 December 2022, 19:42 IST

  • PM Modi chairs high-level meet on Covid: చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. ఆ మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ సంసిద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మోదీ ఈ సందర్భంగా వారికి పిలుపునిచ్చారు.

కోవిడ్ పై జరిగిన వర్చువల్ మీట్ లో ప్రధాని నరేంద్ర మోదీ
కోవిడ్ పై జరిగిన వర్చువల్ మీట్ లో ప్రధాని నరేంద్ర మోదీ (ANI)

కోవిడ్ పై జరిగిన వర్చువల్ మీట్ లో ప్రధాని నరేంద్ర మోదీ

PM Modi chairs high-level meet on Covid: చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. ఆ మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ సంసిద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మోదీ ఈ సందర్భంగా వారికి పిలుపునిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

PM Modi chairs high-level meet on Covid: భారత్ సిద్ధంగా ఉందా?

ఒకవేళ, భారత్ లో కూడా కరోనా(corona) కేసులు భారీగా పెరిగితే, తీసుకోవాల్సిన చర్యలపై, కేసుల సంఖ్య పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధాని నేతృత్వంలో జరిగిన సమావేశంలో చర్చించారు. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మోదీ(PM Modi)తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా(corona) మహమ్మారి ప్రారంభమైన 2020 తొలి రోజుల నుంచి ఆ మహమ్మారిపై భారత్ జరిపిన పోరాటంలో ప్రధాని మోదీ(PM Modi) ముందుండి నడిపించిన విషయం తెలిసిందే.

PM Modi chairs high-level meet on Covid: అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి

కరోనా(corona)ను ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కరోనా ముప్పు ముగిసిపోలేదని, అందువల్ల ఆ మహమ్మారిని తక్కువగా అంచనా వేసి నిర్లక్ష్యంగా ఉండకూడదని సూచించారు. కరోనా(corona) పై నిఘా ను మరింత విస్తృతం చేయాలని, ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయాల వద్ద నిశిత దృష్టితో వ్యవహరించాలని ఆదేశించారు. వైద్య వ్యవస్థలు, సామగ్రి, మానవ వనరులను సమర్ధవంతంగా వినియోగించుకునేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్నారు.

ramped up testing, genome sequencing: టెస్ట్ లను పెంచండి

కరోనా(corona) పరీక్షల సంఖ్యను పెంచాలని, అలాగే, పాజిటివ్ వచ్చిన వారికి జీనోమ్ సీక్వెన్సింగ్(genome sequencing) కచ్చితంగా జరపాలని సూచించారు. కోవిడ్ ఆసుపత్రుల్లో సదుపాయాలను సమీక్షించాలని రాష్ట్రాలను కోరారు. ఆక్సిజన్ సిలిండర్స్, పీఎస్ ఏ ప్లాంట్స్, వెంటిలేటర్లు తగిన సంఖ్యలో ఉండేలా చూసుకోవాలన్నారు.ప్రజలంతా కూడా కచ్చితంగా మాస్క్ లను ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, భౌతిక దూరం పాటించడం వంటి కోవిడ్(Covid) ప్రొటోకాల్ ను పాటించాలని సూచించారు. ముఖ్యంగా పండుగల సమయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.

Directions to States: రాష్ట్రాలకు సూచనలు

ప్రధాని నిర్వహించిన సమీక్షా సమావేశానికన్నా ముందే.. కరోనా(corona) కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రాలకు సూచనలు చేశామని ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పార్లమెంటుకు తెలిపారు. దేశంలో కరోనా(corona) పరిస్థితిపై ఆయన గురువారం లోక్ సభలో ఒక ప్రకటన చేశారు. పలు ఇతర దేశాల్లో కరోనా కేసులు పెరుగుతన్నాయని, భారత్ లో మాత్రం కేసుల సంఖ్య తగ్గుతోందని ఆయన వివరించారు. చైనాలో కేసుల సంఖ్య పెరగడానికి కారణమైన ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ కేసులు భారత్ లో ఇప్పటివరకు 4 నమోదయ్యాయన్నారు. కరోనా(corona) ప్రబలకుండా ప్రజలు మాస్క్ లు ధరించాలని సూచించారు. నూతన సంవత్సరం, సంక్రాంతి తదితర పండుగల సమయంలో ఎక్కువ మంది కలిసే అవకాశమున్నందున, కొవిడ్ ప్రొటోకాల్ ను కచ్చితంగా పాటించాలని కోరారు. కొత్త వేరియంట్లను తక్షణమే గుర్తించేలా అన్ని పాజిటివ్ కేసుల జీనోమ్ సీక్వెన్సింగ్(genome sequencing) ను చేపట్టాలని రాష్ట్రాలను ఆదేశించారు.

టాపిక్