Covid surge: చైనా సహా పలు దేశాల్లో కరోనా(corona) ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న చోట కచ్చితంగా మాస్క్ ధరించాలని, కొవిడ్ ప్రొటోకాల్ ను పాటించాలని సూచించింది.
భారత్ లో కరోనా(corona) అదుపులోనే ఉందని, అయితే, అవాంఛనీయ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండడం అవసరమని కేంద్రం పేర్కొంది. ఇప్పటివరకైతే, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు సంబంధించిన నిబంధనలను మార్చడం లేదని, ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలే కొనసాగుతాయని వివరించింది. కరోనా ముప్పు పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒకవేళ కేసుల సంఖ్య పెరిగినా, ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, వైద్య వ్యవస్థ సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది.
బూస్టర్ డోస్(booster dose) విషయంలో ప్రజలు నిర్లక్ష్యంగా ఉన్నారని, దేశవ్యాప్తంగా బూస్టర్ డోస్(booster dose) కు అర్హులైన వారిలో 27% నుంచి 28% మంది మాత్రమే బూస్టర్ డోస్ వేసుకున్నారని నీతి ఆయోగ్(ఆరోగ్యం) సభ్యుడు వీకే పాల్ వెల్లడించారు. మిగతావారు కూడా ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్(booster dose) వేసుకోవాలని సూచించారు. గుంపుగా ప్రజలు ఉన్నచోట తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, ముఖ్యంగా ఇతర ప్రాణాంతక వ్యాధులు ఉన్నవారు, వృద్ధులు, గర్భిణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు, కరోనా(corona) పై ప్రజలను అప్రమత్తం చేసేందుకు గతంలో వినిపించిన కాలర్ ట్యూన్ ను మళ్లీ ప్రారంభించాలని టెలీకాం సంస్థలు నిర్ణయించినట్లు సమాచారం.
చైనా, దక్షిణ కొరియా, జపాన్, అమెరికా, బ్రెజిల్ దేశాల్లో కరోనా(corona) కేసుల సంఖ్య ఇటీవల భారీగా(covid surge) పెరుగుతోంది. దాంతో, అప్రమత్తమైన భారత ప్రభుత్వం బుధవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, భారత్ లో కోవిడ్(covid) పరిస్థితిపై సమీక్ష నిర్వహించింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐసీఎంఆర్(ICMR) డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహల్, National Technical Advisory Group on Immunization (NTAGI) చైర్మన్, ఎన్ కే అరోరా, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, కేంద్ర వైద్యారోగ్య, ఆయుష్, ఫార్మా, బయోటెక్నాలజీ విభాగాల కార్యదర్శులు పాల్గొన్నారు. కోవిడ్(covid) ముప్పు ముగియలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, అన్ని జాగ్రత్తలు తీసుకుని సిద్ధంగా ఉండాలని సంబంధిత విభాగాలను ఆదేశించినట్లు కేంద్రమంత్రి మాండవీయ ఆ సమావేశం అనంతరం ట్వీట్ చేశారు. corona విషయంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా అప్రమత్తం చేసినట్లు వివరించారు.
కరోనా(corona) కేసుల వివరాలను నిశితంగా గణించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ముఖ్యంగా కొత్త వేరియంట్లను గుర్తించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది. కోవిడ్ పాజిటివ్ కేసుల జీనోమ్ సీక్వెన్సింగ్ న విస్తృతం చేయాలని కోరింది.
టాపిక్