Covid-19 surge in China: చైనాలో మళ్లీ కరోనా విజృంభణ
Covid-19 surge in China: పుట్టినిల్లు చైనాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య చైనాలో రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.
Covid-19 surge in China: కనుమరుగువుతోందని ఆశిస్తున్న కరోనా.. మళ్లీ విశ్వరూపం చూపుతోంది. చైనాలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కొత్తగా వచ్చిన బీఎఫ్ 7(BF.7) వేరియంట్ కారణంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందని భావిస్తున్నారు.
Covid-19 surge in China: అత్యధిక కేసులు
చైనాలో బుధవారం ఒక్కరోజే 31,444 కేసులు నమోదయ్యాయని నేషనల్ హెల్త్ కమిషన్ గురువారం వెల్లడించింది. ఈ సంఖ్య కోవిడ్ తీవ్రత అత్యంత ఎక్కువగా ఉన్న ఈ ఏప్రిల్ నెలలో అత్యధికంగా నమోదైన 29, 317 కన్నా ఎక్కువ కావడం గమనార్హం. ఏప్రిల్ నెలలో షాంఘైలో కఠిన లాకౌట్ అమల్లో ఉంది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, చైనా ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను మరింత పెంచింది. చాలా ప్రాంతాల్లో షాపులు, రెస్టారెంట్లు, విద్యా సంస్థలను మూసేసింది.
Omicron BF.7 Variant: ఒమిక్రాన్ వేరియంట్
ప్రస్తుతం చైనాలో కేసుల సంఖ్య పెరగడానికి కారణమైనవి కూడా ఒమిక్రాన్(Omicron) వేరియంట్లే. ప్రస్తుతం బీఎఫ్ 7(BF.7) వేరియంట్ ప్రభావం చైనాలో తీవ్రంగా ఉంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణమున్న ఈ వైరస్ కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు కోవిడ్ బారిన పడుతున్నారు. కోవిడ్ కారణంగా చోటు చేసుకుంటున్న మరణాల వివరాలను చైనా వెల్లడించడం లేదు. అయితే, ఒమిక్రాన్(Omicron) వేరియంట్ల వల్ల పెద్దగా ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. చైనాలో కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా సరిగ్గా లేదని, కేసుల సంఖ్య పెరగడానికి అది కూడా ఒక కారణమని భావిస్తున్నారు.
Corona situation in India: భారత్ కు కూడా ముప్పుందా?
చైనాలో కేసుల సంఖ్య భారీగా పెరగడానికి కారణమైన ఒమిక్రాన్(Omicron) సబ్ వేరియంట్ బీఎఫ్ 7(BF.7) భారత్ లోనూ కనిపించింది. భారత్ లోనే కాకుండా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, బెల్జియంలలో కూడా దీన్ని గుర్తించారు. భారత్ లో గత నెలలో కేరళలో ఈ వేరియంట్ వ్యాప్తిని గుర్తించారు. కరోనా పూర్తిగా అంతరించిపోలేదని, మాస్క్ లు ధరించడం వంటి కోవిడ్ ప్రొటోకాల్ ను ఇకపైనా పాటించడం అవసరమని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా రానున్న శీతాకాలం సీజన్ ఈ వైరస్ వ్యాప్తికి అనుకూలమని హెచ్చరిస్తున్నారు.