800 Covid positives on Aus ship: సిడ్నీ తీరంలో నౌక; అందులో 800 మందికి కరోనా-800 test covid positive on australia cruise ship panic in sydney ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  800 Covid Positives On Aus Ship: సిడ్నీ తీరంలో నౌక; అందులో 800 మందికి కరోనా

800 Covid positives on Aus ship: సిడ్నీ తీరంలో నౌక; అందులో 800 మందికి కరోనా

HT Telugu Desk HT Telugu
Jan 08, 2024 10:13 PM IST

800 Covid positives on Aus ship: సిడ్నీ తీరంలో ఉన్న నౌకలోని 800 మందికి కోవిడ్ సోకినట్లు తేలడంతో ఆస్ట్రేలియాలో మళ్లీ కరోనా భయాలు ప్రారంభమయ్యాయి.

కార్నివాల్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్
కార్నివాల్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్

800 Covid positives on Aus ship: ఆస్ట్రేలియా లో భారీ క్రూయిజ్ నౌకల్లో ఒకటైన కార్నివాల్ ప్రిన్సెస్ షిప్ లోని 800 మంది ప్రయాణీకులకు కరోనా సోకింది. దాంతో ఆ నౌకను సిడ్నీ తీరంలోనే నిలిపేశారు. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్ట్రేలియా హోం మంత్రి తెలిపారు. కాగా, న్యూ సౌత్ వేల్స్ అధికారులు ఈ కరోనా తీవ్రతను టయర్ 3 కేటగిరీగా, తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన ముప్పుగా ప్రకటించారు.

800 Covid positives on Aus ship: గతంలోనూ..

2020లోనూ ఆస్ట్రేలియాలో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు రూబీ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ లో ఉన్న ప్రయాణీకులు కరోనా బారిన పడ్డారు. ఆ షిప్ లోని వారిలో 914 మందికి కరోనా సోకగా, వారిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇప్పుడు ముప్పు అంత ప్రాణాంతకంగా లేనందున, ఒక్కొక్కరికి వేర్వేరుగా వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం ఆ షిప్ నుంచి దింపి, ఐసోలేషన్ కు పంపిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం షిప్ లో ఉన్న కరోనా సోకిన వారిని ఐసోలేట్ చేశామని, వారు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆ క్రూయిజ్ నిర్వహణ సంస్థ కార్నివాల్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఒమిక్రాన్ XBB వేరియంట్ వల్లనే షిప్ లో ఆ స్థాయిలో కరోనా కేసులు నమోదైనట్లు భావిస్తున్నారు.

Whats_app_banner

టాపిక్