Omicron BF. 7 : బీఎఫ్.7 లక్షణాలేంటి? ఒమిక్రాన్ కొత్త సబ్‌వేరియంట్ ప్రమాదకరమా?
Omicron BF. 7 symptoms : పండుగ సీజన్ వేళ దేశంలో ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఎఫ్.7 భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరగడానికి ఈ వేరియంట్ కారణమని తెలుస్తోంది.
Omicron BF. 7 symptoms : దేశంలో కొవిడ్ భయాలు మళ్లీ మొదలయ్యాయి! ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఎఫ్.7కి సంబంధించిన తొలి కేసును గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ గుర్తించింది. ఈ కొత్త సబ్‌వేరియంట్.. రోగనిరోధక శక్తిని తప్పించుకుని ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దేశంలో దీపావళి పండుగ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ నెల 22న దంతేరస్‌తో మొదలై.. 24 వరకు పండుగ సీజన్ నడుస్తుంది. ఈ తరుణంలో ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఎఫ్.7 వార్త సర్వత్రా భయాందోళనలను పెంచుతోంది. పండుగ సీజన్ కారణంగా.. కొవిడ్ కొత్త వేవ్ పుట్టుకొస్తుందా? అన్న భయం ప్రజల్లో నెలకొంది. ప్రజలు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని నిపుణులు సైతం చెబుతున్నారు. రానున్న రెండు, మూడు వారాలు అత్యంత కీలకం అని అంటున్నారు.
పెరుగుతున్న కొవిడ్ కేసులు..
ఈ వార్తలకు తోడు.. దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయన్న సమాచారం మరింత ఆవేదనకు గురిచేస్తోంది. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 2శాతానికి మించిపోయింది. ముంబై, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్లో సైతం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి.
Omicron BF. 7 : ఈ ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఎఫ్.7 ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. చైనాలో ఇటీవల కేసులు పెరుగుతున్నాయి. దీని వెనుక కొత్త సబ్‌వేరియంట్ ఉన్నట్టు తెలుస్తోంది. అటు యూకే, ఆస్ట్రేలియా, అమెరికా, బెల్జియంలో సైతం కేసులు పెరుగుతున్నాయి.
ఒమిక్రాన్ బీఎఫ్.7 లక్షణాలపై ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం..
- విపరీతమైన దగ్గు
- వినడంలో ఇబ్బందులు
- ఛాతిలో నొప్పి
- శరీరం వణికిపోవడం
- వాసన పీల్చుతున్నప్పుడు మార్పులు గమనించడం
Omicron new variant news : "బీఎఫ్.7 వేరియంట్‌కు హై ఇన్ఫెక్షన్ రేటు ఉన్నట్టు తెలుస్తోంది. ఒమిక్రాన్‌తో పాటు దాని సబ్వేరియంట్లకు రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకునే లక్షణాలు ఉన్నాయి. అయితే.. ఒమిక్రాన్ లక్షణాలు అంత తీవ్రంగా ఉండకపోవడం ఉపశమనం కలిగించే విషయం. సాధారణంగా పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ గుండె, కిడ్నీ, లివర్ సమస్యలు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మాస్కులు వేసుకోవాలి. సామాజిక దూరం పాటించాలి," అని ఢిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్ డైరక్టర్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ డా. సంజయ్ ధాల్ వెల్లడించారు.
కేంద్రం ఆరోగ్యశాఖ సమీక్ష..
దేశంలో కొవిడ్ తాజా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుక్ మాండవీయ మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉన్న వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సైతం పరిశీలించనున్నారు. భవిష్యత్తు కార్యచరణపై ప్రణాళికలు రచించనున్నారు.
India Covid latest situation : అధికారిక లెక్క ప్రకారం.. దేశవ్యాప్తంగా 1.8కోట్ల కొవిడ్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి మరో 6 నెలల వరకు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. కొవిడ్ కేసులు తగ్గిపోవడంతో ప్రజలు టీకాలు తీసుకోవడాన్ని తగ్గించినట్టు అధికారులు భావిస్తున్నారు.
అధికారిక లెకక ప్రకారం.. దేశంలో 98శాతం వృద్ధులు కనీసం 1 డోసునైనా తీసుకున్నారు. 92శాతం మంది రెండు డోసులు తీసేసుకున్నారు. 15-18మధ్య వయస్కులలో 83.7శాతం మంది మొదటి డోసును తీసుకున్నారు. 72శాతం మంది టీకా రెండు డోసులు అందుకున్నారు. ఇక 12-14ఏళ్ల మధ్య వయస్కుల్లో 87.3శాతం మంది మొదటి డోసు తీసుకున్నారు. 68.1శాతం మంది పూర్తిగా రెండు డోసులు తీసుకున్నారు.
India covid cases : దేశంలో 18ఏళ్లు పైబడిన వారికి ప్రికాషనరీ డోసులు ఇస్తున్నారు. ఇప్పటివరకు 27శాతం మంది టీకాలు తీసుకున్నారు.
సంబంధిత కథనం