Vaccine for omicron : ఒమిక్రాన్​ కోసం ప్రత్యేక వ్యాక్సిన్​.. ఓకే చెప్పిన యూకే-uk clears new moderna vaccine targeting omicron variant ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Vaccine For Omicron : ఒమిక్రాన్​ కోసం ప్రత్యేక వ్యాక్సిన్​.. ఓకే చెప్పిన యూకే

Vaccine for omicron : ఒమిక్రాన్​ కోసం ప్రత్యేక వ్యాక్సిన్​.. ఓకే చెప్పిన యూకే

Sharath Chitturi HT Telugu
Aug 15, 2022 06:00 PM IST

Vaccine for omicron : ఒమిక్రాన్​ కోసం ప్రత్యేక టీకా అందుబాటులోకి వచ్చింది. మోడెర్నా అప్డేటెడ్​ వ్యాక్సిన్​కు బ్రిటన్​ అనుమతులిచ్చింది.

<p>ఒమిక్రాన్​ కోసం ప్రత్యేక వ్యాక్సిన్​.. ఓకే చెప్పిన యూకే</p>
ఒమిక్రాన్​ కోసం ప్రత్యేక వ్యాక్సిన్​.. ఓకే చెప్పిన యూకే (REUTERS)

Vaccine for omicron : ప్రపంచాన్ని భయపెడుతున్న కొవిడ్​ వేరియంట్​ ఒమిక్రాన్​పై 'టీకా' అస్త్రం ప్రయోగించాల్సిన సమయం వచ్చేసింది! ఒమిక్రాన్​ను అడ్డుకునేందుకే ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యేక వ్యాక్సిన్​కు అనుమతి ఇస్తున్నట్టు బ్రిటన్​ సోమవారం ప్రకటించింది.

ఇప్పటికే కొవిడ్​ కోసం అందుబాటులో ఉన్న మోడెర్నా టీకాకు ఇది అప్డేటెడ్​ వెర్షన్​. దీనితో కొవిడ్​తో పాటు ఒమిక్రాన్​ నుంచి కూడా రక్షణ పొందవచ్చు.

"అప్డేటెడ్​ మోడెర్నా టీకా.. రెగ్యూలేటరీ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉంది. ఇది పూర్తిగా సేఫ్​ అని తెలిసిన తర్వాతే.. టీకాకు అనుమతి ఇచ్చాము. దీనిని బూస్టర్​ డోసు కింద ఇవ్వొచ్చు," అని మెడిసిన్​ అండ్​ హెల్త్​కేర్​ ప్రాడక్ట్స్​ రెగ్యూలేటరీ ఏజెన్స్​ ఓ ప్రకటన చేసింది.

ఈ మోడెర్నా టీకా.. కొవిడ్​తో పాటు ఒమిక్రాన్​పైనా మెరుగ్గా పోరాడుతోందని ఎంహెచ్​ఆర్​ఏ చీఫ్​ జూన్​ రైనె వెల్లడించారు. కొవిడ్​ వేరియంట్ల నుంచి రక్షణ పొందేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తాజాగా వచ్చిన అప్డేటెడ్​ మోడెర్నా టీకా.. ఒమిక్రాన్​ సబ్​వేరియంట్లు బీఏ.4- బీఏ.5 నుంచి రక్షణను కల్పిస్తున్నాయని వైద్యులు వెల్లడించారు. ఆయా వేరియంట్లలో యూరోప్​, అమెరికాలో కొత్త వేవ్​లు పుట్టుకొస్తున్న సమయంలో తాజా వార్త ప్రజలకు ఉపశమనాన్ని కలిగిచింది.

కాగా.. ఒరిజినల్​ మోడెర్నా టీకాతో పోల్చుకుంటే.. ఈ వ్యాక్సిన్​లోనూ స్వల్పంగా సైడ్​ ఎఫెక్ట్​లు ఉన్నట్టు తెలుస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్